KOIL ALWAR TIRUMANJANAM HELD AT SRI GT _శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం 

TIRUPATI, 18 MAY 2023: The Koil Alwar Tirumanjanam in connection with both Maha Samprokshanam of Vimana Gopuram and ensuing annual brahmotsavams was held in Sri Govindaraja Swamy temple in Tirupati on Thursday.

 

The religious Samprokshanam fete for gold-plated Vimana Gopuram will be observed between May 20 to 25. 

 

Parimalam mixture was smeared on the walls, roofs and applied to the pillars as a part of the event between 6.30am and 8.30am.

 

Meanwhile, the annual brahmotsavams are scheduled between May 26 to June 3 with Ankurarpanam on May 25.

 

PARADAS DONATED

 

Three massive screens for the temple doors were donated by Tirupati-based Sri Mani.

 

Temple staff including AEO Sri Ravi Kumar and others were also present.

 

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

 

శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుపతి, 2023 మే 18: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో గురువారం ఉదయం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయంలో మే 20 నుండి 25వ తేదీ వరకు బంగారు తాపడ విమాన గోపుర మహాసంప్రోక్షణ జరుగనున్న విషయం తెలిసిందే. మహాసంప్రోక్షణ ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.

ఈ సందర్భంగా ఉదయం 6.30 గంటల నుండి 8.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేపట్టారు. ఇందులో భాగంగా శ్రీ గోవిందరాజస్వామివారి సన్నిధితో పాటు ఆలయ ప్రాంగణం లోని ఇతర ఆలయాల గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేశారు . అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి, పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీ గడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు.

ఆలయానికి పరదాలు విరాళం :

తిరుపతికి చెందిన శ్రీ మణి ఆలయానికి మూడు పరదాలు విరాళంగా అందించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో శ్రీ రవి కుమార్, ప్రధాన అర్చకులు శ్రీ శ్రీనివాస దీక్షితులు, సూపరింటెండెంట్‌ శ్రీ మోహన్ రావు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ధనంజయులు, అర్చక బృందం పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.