TTD EO PRESENTS VASTRAMS TO ANJANADRI ANJANEYA _ శ్రీ బాలాంజనేయ స్వామివారికి టిటిడి ఈవో పట్టువస్త్రాల సమర్పణ

Tirumala,18 May 2023: On the last day of Sri Hanuman Jayanti on Thursday, TTD EO Sri AV Dharma Reddy presented Pattu Vastrams to Sri Anjanadevi sameta Sri Balanjaneya Swami at Anjanadri Akashaganga.

 

Special Abhishekam to deities and Chakra  Snanam to Sri Sudarshan Chakrathalwar  was performed on the occasion.

 

TTD Vaikhanasa Agama Adviser Sri Mohana Rangacharyulu, Srivari temple Peishkar Sri Srihari and Parupattedar Sri Tulasi Prasad were also present.

 

 

 ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీ బాలాంజనేయ స్వామివారికి టిటిడి ఈవో పట్టువస్త్రాల సమర్పణ

తిరుమల, 2023 మే 18: హనుమజ్జయంతి ఉత్సవాల్లో చివరి రోజైన గురువారం ఉదయం తిరుమల ఆకాశగంగలోని శ్రీ అంజనాదేవి, శ్రీ బాలాంజనేయస్వామివారికి టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు.

ఈ సందర్భంగా శ్రీ అంజనాదేవికి, శ్రీ బాలాంజనేయ స్వామివారికి విశేషంగా అభిషేకం చేశారు. అదేవిధంగా, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్ కు ఆకాశగంగ తీర్థంలో చక్రస్నానం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి వైఖానస ఆగమ సలహాదారు శ్రీ మోహనరంగాచార్యులు, శ్రీవారి ఆలయ పేష్కార్ శ్రీ శ్రీహరి, పారుపత్తేదార్ శ్రీ తులసిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.