KOIL ALWAR TIRUMANJANAM HELD AT SRI PAT _ శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Tiruchanoor, 25 Aug 20 :Ahead of the Annual Pavitrotsavam festival, the traditional Koil Alwar Tirumanjanam was performed at Sri Padmavati Ammavari temple at Tiruchanoor on Tuesday morning.

After morning rituals of Suprabatham, Sahasra Namarchana and Shuddhi the holy task of cleansing the temple premises began at 6am and lasted till 9am. The roofs, temple prakaram, pillars, puja materials were all cleansed with  herbs and perfumed water amalgamation called “Parimalam”.

CURTAINS DONATED  

Devotee couple from Hyderabad, Sri Srinivasulu and Smt Sarada had donated 12 decorative curtains to the temple.

Dyeo Smt Jhansi Rani, AEO Sri Subramanyam, Superintendents Smt Malleswari, Sri Madhu and Archakas participated in the event.

PAVITROTSAVAMS FROM AUG 31 TO SEP 02 

The Pavitrotsavam festival will be conducted at the Sri Padmavati temple in Tiruchanoor from August 31 to September 2, with Ankurarpanam on August 30.

The Three-day Agama ritual including  will be performed once in a year to ward off any lapses committed either by staff or by devotees during festivals and utsavas in the temple.

As part of the event Pavitra Pratista will be done on August 31 and Pavitra Samarpana on September 1 and Purnahuti on September 2.

In View of Covid-19 restrictions the Pavitrotsavam festival will be performed in Ekantham at Sri Padmavati temple. 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI  

                                 
శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం
 
తిరుపతి, 2020 ఆగ‌స్టు 25   ; తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి వార్షిక పవిత్రోత్సవాలను పురస్కరించుకుని  మంగళవారం ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం  శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చాన, శుధ్ధి నిర్వహించారు.
 
ఆనంతరం ఉదయం 6.00 నుండి 9.00 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేపట్టారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం తో పాటు పలు సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు.
 
పరదాలు విరాళం :
హైదరాబాదుకు చెందిన శ్రీ శ్రీనివాసులు , శ్రీమతి శారద దంపతులు  ఆలయానికి  మంగళవారం ఉదయం 12 పరదాలు  విరాళంగా అందించారు.
 
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ  ఈవో శ్రీమతి ఝాన్సీ రాణి, సూపరింటెండెంట్లు శ్రీమతి మల్లీశ్వరి, శ్రీ  మధు, ఆలయ ఆర్చకులు పాల్గొన్నారు.
 
ఆగ‌స్టు 31 నుండి సెప్టెంబరు 2వ తేదీ వరకు పవిత్రోత్సవాలు…
 
శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగ‌స్టు 31 నుంచి సెప్టెంబరు 2వ తేదీ వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఈ ఉత్సవాలకు ఆగ‌స్టు 30వ తేదీ సాయంత్రం అంకురార్పణం జరుగనుంది.
 యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక జరిగే దోషాల ప్రభావాన్ని నివారించడానికి  ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాలలో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
 
ఈ సందర్భంగా ఆగ‌స్టు 31వ తేదీన పవిత్రప్రతిష్ఠ, సెప్టెంబరు 1న పవిత్ర సమర్పణ, సెప్టెంబరు 2న పూర్ణాహుతి కార్యక్రమాలు జరుగనున్నాయి. 
 
కోవిడ్ – 19  వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా  ప‌విత్రోత్స‌వాలు ఏకాంతంగా నిర్వ‌హిస్తారు. 
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.