KOIL ALWAR TIRUMANJANAM PERFORMED _ శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
Tirumala, 11 Jan. 22: In connection with the auspicious Vaikunta Ekadasi on January 13, the traditional temple cleaning fete, Koil Alwar Tirumanjanam was performed in Tirumala temple with religious fervour on Tuesday.
Speaking to media after the ritual, TTD Additional EO Sri AV Dharma Reddy said, this agamic fete is performed four times in a year before the occasions of Telugu Ugadi, Anivara Asthanam, annual Brahmotsavams and Vaikunta Ekadasi.
He said a special aromatic mixture called Parimalam will be smeared on the roofs, walls of Garbhalaya and other Upalayas located in Tirumala temple which acts as a disinfectant also. After this fete, the devotees will be allowed for Darshan.
He said “keeping in view the past experience, we are not allotting rooms today at Tirumala as we need to spruce them up to allocate them to devotees tomorrow who are coming for Vaikunta Ekadasi darshan”.
He reiterated that the devotees are requested to follow all Covid norms and co-operate with TTD management.
Board Member Sri Madhusudhan Yadav, Temple DyEO Sri Ramesh Babu, Peishkar Sri Sri Hari, VGO Sri Bali Reddy were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుమల, 2022 జనవరి 11: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి, అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి పాల్గొన్నారు.
అనంతరం అదనపు ఈవో శ్రీ ఎవి. ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించినట్లు చెప్పారు. సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఆలయంలోని ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ప్రసాదాల పోటు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పుతోపాటు పూజాసామగ్రిని శుద్ధి చేసినట్టు తెలిపారు.
గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, వైకుంఠ ఏకాదశి దర్శనానికి వచ్చే భక్తులకు దర్శనం, వసతి సౌకర్యావంతంగా కల్పించేందుకు మంగళవారం (నేడు) గదులను కేటాయించడం లేదని చెప్పారు. భక్తులు కోవిడ్ నిబంధనలను పాటిస్తూ వైకుంఠ ద్వారా దర్శనం చేసుకుని టిటిడికి సహకరించాలని ఆయన పునరుద్ఘాటించారు.
కాగా, ఆలయంలో ఉదయం 6 నుండి ఉదయం 11 గంటల వరకు శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి వేశారు. శుద్ధి పూర్తి అయిన అనంతరం నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆ తరువాత భక్తులను దర్శనానికి అనుమతించారు.
ఈ కార్యక్రమంలో పాలకమండలి సభ్యుడు శ్రీ మధుసూధన్ యాదవ్, పెష్కార్ శ్రీ శ్రీ హరి, విజివో శ్రీ బాలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.