SPECIAL EVENTS OF SRI KRT IN THE MONTH OF AUGUST 2019_ ఆగస్టులో శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

The schedule of events as follows:

August 2,10,17,24,31- All Saturdays- Abhisekam of main idols of Sitarama Lakshmana-Devotee participation with a ticket of Rs.20.

Tiruchi vahanam of Swami and Ammavaru in evenings. Unjal seva later on with devotee participation on Rs.16 ticket.

August 15: Satakalashabisekam in morning. Devotee participation with Rs.50 ticket.

Tiruchi utsavam on mada streets to Sri Ramachandra Pushkarini Asthanam at 6.30 pm.

August 27: Sitarama Kalyanam on Punarvasu nakshatram at 11.00 am. Devotee participation at Rs.500 ticket.

Tiruchi procession of Swami and consorts from Mada streets to Sri Ramachandra Pushkarini in the evening. Unjal Seva at 6.00 pm.
August 30: Amavasya. Sahasra Kalashabisekam. Rs.500 ticket for participation Hanumantha Vahanam seva at 7.00 PM.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఆగస్టులో శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

జూలై 31, తిరుపతి, 2019: తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో ఆగస్టు నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

– ఆగస్టు 3, 10, 17, 24, 31వ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6.00 గంటలకు శ్రీసీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం నిర్వహిస్తారు. భక్తులు రూ.20/- చెల్లించి మూలవర్ల అభిషేకంలో పాల్గొనవచ్చు. సాయంత్రం 6.00 గంటలకు స్వామి, అమ్మవారిని తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు, అనంతరం రాత్రి 7.00 గంటలకు ఆలయంలో ఊంజల్‌సేవ నిర్వహిస్తారు. రూ.116/- టికెట్‌ కొనుగోలు చేసి ఊంజల్‌సేవలో పాల్గొనవచ్చు.

– ఆగస్టు 15న పౌర్ణమి సందర్భంగా ఉదయం 9 గంటలకు అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహిస్తారు. రూ.50/- చెల్లించి భక్తులు ఈ సేవలో పాల్గొనవచ్చు. సాయంత్రం 5.30 గంటలకు ఆలయ నాలుగు మాడ వీధుల నుంచి శ్రీరామచంద్ర పుష్కరిణి వరకు తిరుచ్చి ఉత్సవం నిర్వహిస్తారు. సాయంత్రం 6.30 గంటలకు ఆస్థానం చేపడతారు.

– ఆగస్టు 27న పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని ఉదయం 11 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. రూ.500/- టికెట్‌ కొనుగోలు చేసి కల్యాణంలో పాల్గొనవచ్చు. సాయంత్రం 5.30 గంటలకు స్వామి, అమ్మవారిని తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల గుండా శ్రీరామచంద్ర పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళతారు. సాయంత్రం 6.30 గంటలకు ఊంజల్‌సేవ నిర్వహిస్తారు.

– ఆగస్టు 1, 30వ తేదీల్లో అమావాస్య సందర్భంగా ఉదయం 6.30 గంటలకు సహస్ర కలశాభిషేకం జరుగనుంది. రూ.500/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) పాల్గొనవచ్చు. రాత్రి 7.00 గంటలకు హనుమంత వాహనసేవ జరుగనుంది.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.