ELABORATE ARRANGEMENTS MADE FOR AUGUST 09 VARALAKSHMI VRATHAM: JEO TPT P BASANTH KUMAR _ ఆగస్టు 9న వరలక్ష్మీ వ్రతానికి విస్తృత ఏర్పాట్లు : టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పి.బసంత్‌ కుమార్‌

Tiruchanoor, 31 July 19: TTDs Joint Executive Officer for Tirupati Sri P Basant Kumar said today elaborate arrangements have been made for the conduction of the Sri Varalakshmi Vratam on August 9th.

Speaking after review of the arrangements with senior officials at the Asthana Mandapam in Tiruchanoor on Wednesday the JEO said the holy Varalakshmi vratam will be conducted in the traditional format at the Asthana mandapam from 10.00 to 12.00 of August 9th. Later in the evening, Sri Padmavathi Ammavaru would be grandly paraded on the Swarna ratham in the evening. Iinterested couple could participate with Rs.500 ticket in the Varalakshmi vratam.

The TTD has cancelled the Abhisekanantara darshan, Lakshmi puja, Kalyanotsavam, Kumkumarchana and Unjal seva on the day of vratam

The JEO advised the officials to make all arrangements with their experiences in past conduction of the event. The TTD has set up huge LED screens, anna prasadam, disbursement of kumkuma, prasadam, kankanalu, gajulu etc.

He said the HDPP artists will conduct bhajans and other bhakti sangeet programs. The Engineering Department has been instructed to gear up electrical decorations along with flower decorations by the garden department.

The SVBC made arrangements for live coverage of the vratam and queue lines organised to prevent hardships to devotees in the Asthana mandapam. TTD has roped in an adequate number of Srivari Sevakulu, sanitary workers and security guards to ensure smooth conduction of the event and a hassle-free darshan to devotees.

The TTD has made all arrangements for the online release of 200 tickets Varalakshmi vratam on August 2 and another 200 tickets on a day prior to the event at the sales counter near the Sri Padmavati ammavari temple.

Legends say that the performance of the Vratam at the commencement of Sravana Masam will beget women children, prosperity, health and peace.

Dyeo Smt Jhansi Rani, IT chief Sri Sesha Reddy, VGO Sri Ashok Kumar Gowd, HDPP secretary Sri Ramana Prasad, Annaprasadam chief Sri Venugopal, EE Sri Satyanarayana, DE (Electrical) Sri Chandrasekhar, Garden Deputy Director Sri Srinivasulu, AVSO Sri Nandieswara Rao, temple priests, and officials participated.


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఆగస్టు 9న వరలక్ష్మీ వ్రతానికి విస్తృత ఏర్పాట్లు : టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పి.బసంత్‌ కుమార్‌

తిరుపతి, 2019 ఆగస్టు 31: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 9న నిర్వహించనున్న వరలక్ష్మీ వ్రతానికి భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నట్టు టిటిడి తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పి. బసంత్‌ కుమార్‌ తెలిపారు. తిరుచానూరులోని ఆస్థానమండపంలో బుధవారం ఆయన వరలక్ష్మీ వ్రతం ఏర్పాట్లపై శాఖల వారీగా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ ఆగస్టు 9వ తేదీ శుక్రవారం ఉదయం 10.00 నుంచి 12.00 గంటల వరకు ఆస్థానమండపంలో వరలక్ష్మీవ్రతంను శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం సాయంత్రం 6.00 గంటలకు స్వర్ణరథంపై శ్రీ పద్మావతి అమ్మవారు నాలుగుమాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమివ్వనున్నట్లు తెలియజేశారు. వరలక్ష్మీ వ్రతంలో భక్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి పాల్గొనవచ్చన్నారు. ఈ కారణంగా అభిషేకానంతర దర్శనం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, కుంకుమార్చన, ఊంజల్‌సేవలను టిటిడి రద్దు చేసినట్లు తెలిపారు.

గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మరింత మెరుగ్గా ఏర్పాట్లు చేయాలని జేఈవో అధికారులకు సూచించారు. వరలక్ష్మీ వ్రతాన్ని భక్తులు తిలకించేందుకు వీలుగా ఎల్‌ఇడి స్క్రీన్లు ఏర్పాటుచేయాలని, అన్నప్రసాదాలు పంపిణీ చేయాలని ఆదేశించారు. భక్తులకు పంపిణీ చేసేందుకు కుంకుమ ప్యాకెట్లు, కంకణాలు, గాజులు సిద్ధంగా ఉంచుకోవాలని, భజన బృందాలను ఏర్పాటుచేయాలని హిందూ ధర్మప్రచార పరిషత్‌ అధికారులను ఆదేశించారు. అమ్మవారి ఆలయం, ఆస్థాన మండపం, ఇతర ప్రాంతాల్లో ఆకట్టుకునేలా పుష్పాలంకరణ, విద్యుద్దీపాలంకరణ చేపట్టాలని సూచించారు.

వరలక్ష్మీ వ్రతాన్ని ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారాలు అందించేందుకు వీలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆస్థానమండపంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైన శ్రీవారి సేవకులు, పారిశుద్ధ్య కార్మికులు, సెక్యూరిటీ గార్డులను సమకూర్చుకోవాలన్నారు. అమ్మవారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసే అవకాశం ఉండడంతో ముందస్తుగా ఏర్పాట్లు చేపట్టాలన్నారు.

ఆగష్టు 2 ఆన్‌లైన్‌లో టికెట్లు విడుదల :

తిరుచానూరు వరలక్ష్మీ వ్రతం టికెట్లను ఆగష్టు2వ తేదీన 200 టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామని జెఈవో తెలిపారు. అదేవిధంగా వరలక్ష్మీ వ్రతంకు ముందు రోజు 200 టికెట్లను ఆలయం వద్ద గల కౌంటర్‌లో విక్రయించాలని అధికారులకు సూచించారు.

పురాణ ప్రాశస్త్యం :

పూర్వం శంకరుడు పార్వతిదేవికి ఈ వరలక్ష్మీ వ్రతం విశిష్ఠత, అచరించవలసిన విధానాన్ని తెలియచేసినట్లు స్కంద, భవిష్యోత్తర పురాణాల ద్వారా తెలుస్తుంది. కావున సాక్షత్తు శ్రీ మహాలక్ష్మీ అవతరించిన దివ్యస్థలం తిరుచానూరు. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం ఆచరించడం ఆనవాయితీ. శ్రవణ మాసంలో ఈ వ్రతం చేసిన మహిళలకు సత్సంతానం, దీర్ఘమాంగల్యసౌఖ్యం, సిరిసంపదలు, ఆరోగ్యం, కుటుంబసౌఖ్యం వంటి ఎన్నో మహాఫలాలు కలుగుతాయని పురాణాల ద్వారా తెలుస్తుందని అర్చకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆగమసలహాదారులు శ్రీనివాసాచార్యులు, డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణి, ఐటీ విభాగాధిపతి శ్రీ శేషారెడ్డి, విజివో శ్రీ ఆశోక్‌కుమార్‌ గౌడ్‌, డిపిపి కార్యదర్శి శ్రీరమణ ప్రసాద్‌, అన్నప్రసాదం ప్రత్యేకాధికారి శ్రీ వేణుగోపాల్‌, ఈఈ శ్రీ సత్యనారాయణ, డిఈ ఎలక్ట్రికల్‌ శ్రీ చంద్రశేఖర్‌, గార్డెన్‌ డిప్యూటీ డైరెక్టర్‌ శ్రీనివాసులు, ఏవీఎస్వో శ్రీ నందీశ్వర్‌ రావు, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.