MAHASHANTI TIRUMANJANAM PERFORMED AT HYDERABAD_ హైదరాబాద్ లోని శ్రీవారి ఆలయంలో వేడుకగా మహాశాంతి తిరుమంజనం

Hyderabad, 12 Mar. 19: As a prelude to Mahakumbhabhishekam which is scheduled on Wednesday in the Sri Venkateswara temple at Jubilee Hills in Hyderabad, a special ritual Mahashanti Tirumanjanam was performed to the presiding deity on Tuesday evening.

In the morning the ritwiks performed Bimba Vaastu, Navakalasa Snapanam, Chaturdasakalasa Snapanam, Purnahuti. After these rituals, the devotees were allowed for darshanam till 4pm.

Again from 4pm till 5pm, Mahashanti Tirumanjanam was performed to the mula first which provided a feast to the eyes of devotees. The special Abhishekam was rendered to the presiding deity with various ingredients including, milk, curd, honey, coconut water, turmeric and sandal paste.

TTD EO Sri Anil Kumar Singhal, Tirumala JEO Sri KS Sreenivasa Raju, CVSO Sri Gopinath Jatti and others were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

హైదరాబాద్ లోని శ్రీవారి ఆలయంలో వేడుకగా మహాశాంతి తిరుమంజనం

మార్చి 12, హైదరాబాద్‌, 2019: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో నూతనంగా నిర్మించిన శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మహాకుంభాభిషేకానికి సంబంధించిన వైదిక కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం బింబవాస్తు, నవకలశ స్నపనం, చతుర్దశ కలశ స్నపనం, హోమం, పూర్ణాహుతి చేపట్టారు. సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు మహాశాంతి తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో శ్రీవారి మూలమూర్తికి విశేషంగా అభిషేకం చేశారు. ఈ అభిషేక దర్శనం భక్తులకు కనువిందు చేసింది. ఆ తరువాత మహాశాంతి పూర్ణాహుతి, రక్షాబంధనం, కుంభారాధనం, నివేదనం, శయనాధివాసం, హౌత్రం, సర్వదేవతార్చన, హోమం కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, తిరుమల జెఈఓ శ్రీ కెఎస్.శ్రీనివాసరాజు, సివిఎస్ఓ శ్రీ గోపీనాథ్ జెట్టి తదితరులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.