KUMARADHARA THEERTHA MUKKOTI ON FEBRUARY 24 _ ఫిబ్ర‌వ‌రి 24న తిరుమలలో శ్రీ కుమారధార తీర్థ ముక్కోటి

TIRUMALA, 18 FEBRUARY 2024: The torrent festival of Kumaradharatheertha Mukkoti will be observed in Tirumala on February 24.

According to the Varaha and Markandeya Puranas, an old Brahmin used to wander alone in the Seshachala hills. 

Sri Venkateswara Swamy appeared and asked, “At this age, ears cannot hear, eyes cannot see… What are you doing in the forest?”  The old man replied that he was thinking of paying off his debt by performing Yajnayagas.  Later, as per Swami’s suggestion, the old man took a bath in this tirtha and turned into a 16-year-old youth. Hence this Thirtha got the name ‘Kumara Dhara’ due to the transition from old age to youth.

As per the Padma and Vamana Puranas, Devaloka Senapati, Sri Kumaraswamy tried to get rid of the curse after killing the demon Tarakasura.  As instructed by Lord Siva, he did penance at Vrishadri in the Seshachala.  Later he took a bath in this holy Thirtha and got rid of the curse.  The name ‘Kumaradhara’ was established for this Thirtha due to the fact that Kumaraswamy bathed in it.

Among the torrent festivals that are being observed by TTD, besides Tumburu, Ramakrishna Theerthams etc. Kumaradharatheertham also occupies a significant place as devotees take part in this torrent fest with enthusiasm.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

ఫిబ్ర‌వ‌రి 24న తిరుమలలో శ్రీ కుమారధార తీర్థ ముక్కోటి

తిరుమల, 2024 ఫిబ్ర‌వ‌రి 18: తిరుమలలో ఫిబ్ర‌వ‌రి 24వ తేదీన శ్రీ కుమారధార తీర్థ ముక్కోటి ఘనంగా జరుగనుంది. ఈ పర్వదినాన భ‌క్తులు తీర్థ స్నానమాచరించి, దానధర్మాలు చేసి స్వామివారిని దర్శించుకుంటారు. ప్రకృతి సౌందర్యాల నడుమ కుమారధార తీర్థంలో స్నానమాచరించడాన్ని భక్తులు ప్రత్యేకంగా భావిస్తారు.

వరాహ, మార్కండేయ పురాణాల ప్రకారం ఒక వృద్ధ బ్రాహ్మణుడు శేషాచల గిరుల్లో ఒంటరిగా సంచరిస్తుండేవాడు. శ్రీవేంకటేశ్వరస్వామివారు ప్రత్యక్షమై ”ఈ వయసులో చెవులు వినిపించవు, కళ్లు కనిపించవు.. అడవిలో ఏంచేస్తున్నావు” అని ప్రశ్నించారు. యజ్ఞయాగాలు ఆచరించి దైవరుణం తీర్చుకోవాలనే తలంపుతో ఉన్నాను అని వృద్ధుడు బదులిచ్చాడు. అనంతరం స్వామివారి సూచన మేరకు ఈ తీర్థంలో వృద్ధుడు స్నానమాచరించగా 16 ఏళ్ల నవ యువకుడిగా మారిపోయాడు. ముసలి వయసు నుంచి కౌమార్యంలోకి మారిపోవడం వల్ల ఈ తీర్థానికి ‘కుమార ధార’ అనే పేరు వచ్చింది.

పద్మ, వామన పురాణాల ప్రకారం దేవలోకం సేనాధిపతి కుమారస్వామి రాక్షసుడైన తారకాసురుడి సంహారం తరువాత శాపవిమోచనం కోసం ప్రయత్నించాడు. శివుని సూచన మేరకు శేషాచల పర్వతాల్లోని వృషాద్రిలో తపస్సు చేశాడు. అనంతరం ఈ తీర్థంలో స్నానమాచరించి శాపవిమోచనం పొందాడు. సాక్షాత్తు కుమారస్వామివారు స్నానం చేయడం వల్ల ఈ తీర్థానికి ‘కుమారధార’ అనే పేరు స్థిరపడింది.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.