KUPUCHANDRAPETA FESTIVAL ON FEBRUARY 25 _ ఫిబ్రవరి 25న కూపుచంద్రపేట ఉత్సవం

Tirupati, 18 February 2024: The idols of Swami and Ammavaru of Sri Kodandarama Swami Temple in Tirupati will be taken on a procession to Kupuchandrapeta village on February 25.

The utsava murtis of Sri Seetha Lakshmana Sametha Kodandarama Swamy will leave the temple on a celestial procession at 6 am and reach the village at 9.30 am. 

After that, Snapana Tirumanjanam is performed for the utsavarlu followed by Unjal Seva from 4 to 5 pm and return to the temple after Gramotsavam.

Bhajans and kolatas will be organized under the auspices of Hindu Dharma Prachara Parishad and Dasa Sahitya Projects in the morning and evening.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

ఫిబ్రవరి 25న కూపుచంద్రపేట ఉత్సవం

తిరుపతి, 2024 ఫిబ్ర‌వ‌రి 18: తిరుపతి శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలోని స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఫిబ్రవరి 25వ తేదీన కూపుచంద్రపేట గ్రామానికి ఊరేగింపుగా తీసుకెళ్లనున్నారు.

శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామివారి ఉత్సవమూర్తులు ఉదయం 6 గంటలకు ఆలయం నుండి ఊరేగింపుగా బయల్దేరి తిరుపతికి 8 కిలోమీటర్ల దూరంలో గల కూపుచంద్రపేటకు ఉదయం 9.30 గంటలకు చేరుకుంటారు. అనంతరం స్వామి, అమ్మవారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 4 నుండి 5 గంట‌ల వ‌ర‌కు ఊంజ‌ల్ సేవ‌, సాయంత్రం 5 గంట‌లకు గ్రామోత్స‌వం నిర్వ‌హించి, తిరిగి ఆలయానికి చేరుకుంటారు.

ఉదయం, సాయంత్రం జరిగే స్వామివారి ఊరేగింపులో టీటీడీ హిందూధర్మ ప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.