KUPCHANDRAPETA UTSAVAM HELD _ శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఏకాంతంగా పేట ఉత్సవం

TIRUPATI, 17 FEBRUARY 2022: As per the tradition, Kupchandra Peta Utsavam was held under the aegis of Sri Kodandarama Swamy temple on Thursday.

 

Every year the utsava idols of Sri Kodanda Rama Swamy along with Sita Devi and Lakshmana Swamy were taken on a grand procession to Kupuchandrapeta, which is located about 8 km from Tirupati.

 

But this year, due to Covid restrictions, the Snapana Thirumanjanam and unjal seva to utsava idols were performed in the temple itself.

 

Spl. Gr DyEO Smt Parvati and others were present.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఏకాంతంగా పేట ఉత్సవం

తిరుపతి, 2022 ఫిబ్రవరి 17: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో గురువారం ఉదయం ఏకాంతంగా పేట ఉత్సవం జరిగింది.

మాఘపౌర్ణమి సందర్భంగా శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారి ఉత్సవమూర్తులను కూపుచంద్రపేట గ్రామానికి ఊరేగింపుగా తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. కోవిడ్ నిబంధనల మేరకు ఆలయంలో ఏకాంతంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించారు.

ఇందులో భాగంగా ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీ కోదండరామ స్వామి వారికి స్నపనతిరుమంజనం జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనంలతో స్వామి, అమ్మవారి ఉత్సవర్లకు అభిషేకం చేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమ‌తి పార్వ‌తి, ఏఈవో శ్రీ దుర్గ‌రాజు, సూపరింటెండెంట్‌ శ్రీ ర‌మేష్‌ పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.