KAT IN KT ON FEB 20 _ ఫిబ్రవరి 20న శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

TIRUPATI, 17 FEBRUARY 2022: The temple cleaning fete Koil Alwar Tirumanjanam will be observed in Sri Kapileswara Swamy temple on February 20 in view of annual Brahmotsavams which commence from February 22 onwards.

 

On February 20, Koil Alwar Tirumanjanam will be performed between 11:30am and 2:30pm. Later devotees will be allowed for darshan.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

ఫిబ్రవరి 20న శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుపతి, 2022 ఫిబ్రవరి 17: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 20వ తేదీ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఆలయంలో ఫిబ్రవరి 22 నుండి మార్చి 3వ తేదీ వరకు ఏకాంతంగా వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న విషయం విదితమే.

ఈ సందర్భంగా ఫిబ్ర‌వ‌రి 20న తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి అభిషేకం, అలంకారము, శుద్ధి నిర్వహిస్తారు. ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 2.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగనుంది. ఉదయం 8.00 నుండి 11.00 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుండి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.