LADDU KIOSKS MACHINES – AN EASY-TO-USE PILGRIM INTERFACE _ శ్రీవారి లడ్డూ ప్రసాదం కొనుగోలుకు నూతన సదుపాయం

TIRUMALA, 23 JUNE 2025: In yet another innovative pilgrim-friendly initiative, TTD has recently introduced KIOSK machines at Laddu Counters in Tirumala. 

This facility allows the pilgrims to conveniently pay for additional laddus using UPI. 

After payment, a receipt is generated, which can be used to collect the extra laddus.

The intention behind this innovative move by TTD   is to improve pilgrims’ overall experience by cutting down lengthy waiting. 

Through an easy-to-use interface, pilgrims can swiftly finish their laddu purchases by using the KIOSK machines. 

A seamless, cashless transaction is ensured by the availability of UPI payment options.

Here is a step-by-step version of the process for using the KIOSK machines for laddus:

Pilgrims will approach the KIOSK Machine installed near the Laddu distribution counters.

Pilgrims will be presented with two options: one for those with a valid darshan ticket and another for those without a darshan ticket.

With Valid Darshan Ticket: Choose this option if you have a valid Darshan ticket. The system will verify the ticket details, and pilgrims can purchase up to 2 additional laddus per person based on the number of people listed on the ticket.

Without Darshan Ticket: Choose this option if you do not have a Darshan ticket. 

You can still purchase up to 2 additional laddus by providing a valid Aadhaar number.

After selecting the appropriate option, the system will navigate to the payment page, where pilgrims can complete the transaction using UPI.

Pilgrims can collect the printed receipt and proceed to the laddu counters to receive their laddus.

Pilgrims expressed immense pleasure at this innovative initiative of TTD.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారి లడ్డూ ప్రసాదం కొనుగోలుకు నూతన సదుపాయం

కియోస్క్ యంత్రాల ద్వారా లడ్డూల విక్రయం

తిరుమల, 2025 జూన్ 23: తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదం కోనుగోలుకు టీటీడీ నూతన సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. తిరుమలలోని లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రంలో భక్తులకు మరింత సులభతరంగా లడ్డూలను కోనుగోలు చేసేందుకు కియోస్క్ యంత్రాలను అందుబాటులో ఉంచింది.

ఈ సదుపాయం ద్వారా భక్తుల నిరీక్షణ సమయాన్ని తగ్గించి త్వరితగతిన లడ్డూల కొనుగోలు ప్రక్రియ చేసేలా అవకాశం కల్పించడం జరిగింది.

యూపీఐ చెల్లింపు సదుపాయం ద్వారా నగదు లేకుండా పారదర్శక లావాదేవీలు జరిగేలా టీటీడీ ఏర్పాటుచేసింది.

కియోస్క్ ద్వారా లడ్డూలు పొందే విధానం –  

భక్తులు లడ్డూ పంపిణీ కౌంటర్లకు సమీపంలో ఏర్పాటు చేసిన కియోస్క్ యంత్రం వద్దకు వెళ్తారు.

యంత్రంలో రెండు ఆప్షన్లు కనిపిస్తాయి:

1.దర్శన టికెట్ ఉన్నవారు

2.దర్శన టికెట్ లేనివారు

దర్శన టికెట్ ఉన్నవారు:

ఈ ఆప్షన్ ఎంచుకోండి.

టికెట్ వివరాలను యంత్రం ధృవీకరిస్తుంది.

టికెట్‌లో ఉన్న వ్యక్తుల సంఖ్య ఆధారంగా ప్రతి వ్యక్తికి రెండు అదనపు లడ్డూల వరకు కొనుగోలు చేయవచ్చు.

దర్శన టికెట్ లేనివారు:

ఈ ఆప్షన్ ఎంచుకుని సరైన(verified) ఆధార్ నంబర్ ఇవ్వాలి.

ఈ మార్గం ద్వారా కూడా ప్రతి వ్యక్తికి 2 లడ్డూల వరకు కొనుగోలు చేయవచ్చు.

సరైన ఆప్షన్ ఎంచుకున్న తర్వాత యూపీఐ ద్వారా చెల్లింపు చేయాల్సిన పేజీకి వెళ్లి లావాదేవీలు పూర్తి చేయవచ్చు.

చెల్లింపు అనంతరం ముద్రిత రసీదు అందుతుంది.

ఆ రసీదుతో లడ్డూ కౌంటర్ల వద్దకు వెళ్లి అదనపు లడ్డూలు పొందవచ్చు.

భక్తుల సౌకర్యార్థం టిటిడి ప్రవేశపెట్టిన ఈ కొత్త విధానానికి నుండి విశేష స్పందన లభిస్తోంది.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.