TTD SETS NEW RECORD IN LADDU DISTRIBUTION_ రికార్డు స్థాయిలో శ్రీవారి లడ్డూప్రసాదం విక్రయం

Tirumala, 1 October 2018: A new record has been created by TTD in the sale and distribution of laddus, thanks to the pilgrim crowd which thronged the hill town in the auspicious Prestasi month.

In the laddu sales and distribution which took place from 3am of September 30 till 3am of October 1, a total of 5,13,566 laddus were recorded.

The previous highest figures includes 4,64,152 on October 10 in 2016, followed by 4, 32,745 on May 28 this year. The next highest figures includes 4,14,987 on May 19 in 2018 and 4,11,943 on June 11 in 2017.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

రికార్డు స్థాయిలో శ్రీవారి లడ్డూప్రసాదం విక్రయం

తిరుమల, 01 అక్టోబరు 2018: తిరుమలలో శ్రీవారి దర్శనం తరువాత భక్తులు అపురూపంగా భావించే లడ్డూ ప్రసాదాన్ని టిటిడి రికార్డు స్థాయిలో తయారుచేసి భక్తులకు విక్రయించింది. తమిళులకు ఎంతో పవిత్రమైన పెరటాసి మాసంలో భక్తులు విశేషంగా విచ్చేసి స్వామివారిని దర్శించుకుంటున్నారు. భక్తులందరికీ సంతృప్తికరంగా శ్రీవారి దర్శనం కల్పించడంతో పాటు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టిటిడి లడ్డూ ప్రసాదాన్ని తయారుచేసి అందుబాటులో ఉంచుతోంది.

ఈ క్రమంలో సెప్టెంబరు 30వ తేదీ ఆదివారం టిటిడి చరిత్రలో మొదటిసారి 5,13,566 లడ్డూలను తయారుచేసి భక్తులకు విక్రయించడం జరిగింది. గతంలో 2016 అక్టోబరు 10న 4,64,152 లడ్డూలు, 2017 మే 28న 4,32,745 లడ్డూలు, 2018 మే 19న 4,14,987 లడ్డూలు, 2017 జూన్‌ 11న 4,11,943 లడ్డూలను టిటిడి విక్రయించింది.

పోటు విభాగం అధికారులు, సిబ్బంది, పోటు కార్మికులు సమష్టిగా కృషి చేసి భక్తులకు అవసరమైనన్ని లడ్డూలను తయారుచేస్తున్నారు. తయారుచేసిన లడ్డూలను 64 కౌంటర్ల ద్వారా భక్తులకు అందిస్తున్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.