MORE BEAUTIFICATION ALONG SIDES FOOTPATH ROUTES-TTD EO_ కాలినడక మార్గాలలో మరింత పచ్చదనం పెంచేలా చర్యలు: టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

Tirupati, 1 October 2018: To give a better aesthetic feel to the multitude of visiting pilgrims, more greenery need to be grown on either sides along Srivari Mettu and Alipiri footpath routes, said, TTD EO Sri Anil Kumar Singhal.

During the senior officers review meeting held at the conference hall in TTD administrative building in Tirupati on Monday, the EO direct the DFO Sri Phani Kumar Naidu to go for more beautification in footpath routes.

Later he directed the Chief Engineer Sri Chandrasekhar Reddy to complete the electrical works including lighting, erection of heaters, laying of cots and beds in New Seva Sadan buildings etc.on a faster pace.

He also instructed him to complete the works in SV temple at Kanyakumari before this year end.

He later instructed IT wing of TTD and TCS to present a power point presentation of all the IT applications introduced in TTD for the benefit of pilgrims.

DLO Sri Venkataramana Naidu, CVSO Incharge Sri Siva Kumar Reddy, FACAO Sri Balaji and other senior officers were also present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

కాలినడక మార్గాలలో మరింత పచ్చదనం పెంచేలా చర్యలు: టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

తిరుపతి, అక్టోబర్‌ 01, 2018: తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు మరింత ఆహ్లాదాన్ని అందించేందుకు కాలినడక మార్గాలతోపాటు, రింగ్‌ రోడ్‌ తదితర ప్రాంతాలలో మరిన్ని మొక్కలు పెంచాలని అధికారులను టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలోగల సమావేశ మందిరంలో సోమవారం సీనియర్‌ అధికారులతో ఈవో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం నిర్మిస్తున్న మరుగుదొడ్ల పనులను మెరుగైన నాణ్యతా ప్రమాణాలను పాటించాలన్నారు. తిరుమలలో యాత్రికులకు అశ్విని ఆసుపత్రి, ఇతర ఆసుపత్రులలో మెరుగైన వైద్యసేవలు అందించాలన్నారు. శ్రీవారి సేవకుల కోసం నిర్మిస్తున్న సేవా సదన్‌ నూతన భవనంలో వేడి నీటి సౌకర్యం, లైటింగ్‌, ఫ్యాన్లు, వసతి తదితర సదుపాయాల పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. మొకాలిమిట్ట నుండి జిఎన్‌సి టోల్‌ గేట్‌ వరకు రోడ్ల విస్తరణ పనులపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలన్నారు. తిరుమలలోని కాటేజీల వద్ద అన్నప్రసాద వ్యర్థాలను వేయకుండా నివారించేలా చర్యలు తీసుకోవాలని, వ్యర్థాలు ఉండటం వల్ల వన్యప్రాణులు, మృగాలు కాటేజీల వద్దకు వచ్చే అవకాశం ఉంటుందని సూచించారు.

కన్యాకుమారి ఆలయ పనులను డిసెంబర్‌ లోపు పూర్తి చేయాలని సిఇ శ్రీ చంద్రశేఖర్‌ రెడ్డిని ఆదేశించారు. తిరుచానూరు తోళప్ప గార్డెన్స్‌లో నిర్మాణంలో ఉన్న వసతి గదులను యాత్రికులకు త్వరగా అందుబాటులోకి తీసుకురావాలన్నారు. భక్తుల సౌకర్యార్థం టిటిడి అమలుచేస్తున్న ఐటీ సేవలను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ రూపంలో తయారు చేయాలన్నారు.

ఈ సమావేశంలో టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, ఇన్‌చార్జి సివిఎస్‌వో శ్రీ శివకుమార్‌రెడ్డి, ఎఫ్‌ఏ,సిఏవో శ్రీ ఓ.బాలాజి, డిఎఫ్‌వో శ్రీ ఫణికుమార్‌ నాయుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.