LIFE TIME ACHIEVEMENT AWARD TO TTD JEO E & H _ టిటిడి జెఈఓ శ్రీమతి సదా భార్గవికి జీవితకాల సాఫల్య అవార్డు సమష్టి కృషితోనే ఈ అవార్డు : జెఈఓ

IT’S A COLLECTIVE TEAM EFFORT – JEO ON HER AWARD

 

TIRUPATI, 21 OCTOBER 2022: TTD JEO for Education and Health Smt Sada Bhargavi, IAS was honoured with the prestigious Life Time Achievement Award by HYM International Certification Private Limited on Friday for her impeccable services in maintaining quality in TTD Educational Institutions.

 

The event was held at Mahati Auditorium to which she graced as Chief Guest and also felicitated the representatives from 22 other institutions for their quality excellence in their respective fields on the occasion.

 

Speaking on the occasion, the JEO attributed her achievement to the support and team effort of Devasthanam Educational Officer Sri Govindarajan, Principals, H Ms, faculty and other employees. “It’s a collective team effort of all of them”, she expressed.

 

Earlier an AV was presented on Smt Sada Bhargavi which portrayed her endeavors in bringing NAAC A+ and ISO certification to various TTD educational institutions for improving the standards in academics as well amenities to students. It has also showcased the incredible efforts she has taken to safeguard the immovable properties of TTD worth about hundreds of crores across the country.

Several TTD employees also felicitated the JEO on the occasion.

 

HYM MD Sri Sivaiah, jury members including retired Judge Sri Sundar Ramaiah, other awardees, participants were also present.

 
 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టిటిడి జెఈఓ శ్రీమతి సదా భార్గవికి జీవితకాల సాఫల్య అవార్డు 

సమష్టి కృషితోనే ఈ అవార్డు : జెఈఓ

తిరుపతి, 2022 అక్టోబరు 21: ఐఎస్ఓ సర్టిఫికేట్లు ప్రదానం చేసే హైదరాబాదుకు చెందిన హెచ్ వై ఎం ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థ ప్రతిష్టాత్మక జీవితకాల సాఫల్య అవార్డును టిటిడి జెఈఓ శ్రీమతి సదా భార్గవికి అందజేసింది. తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో సంస్థ ఎండి శ్రీ ఆలపాటి శివయ్య చేతుల మీదుగా జెఈఓ ఈ అవార్డును అందుకున్నారు.

ఈ సందర్భంగా జెఈఓ మాట్లాడుతూ టిటిడిలో అధికారులు, సిబ్బంది సమష్టి కృషితోనే పలు విభాగాలకు ఐఎస్ఓ సర్టిఫికెట్లు లభించాయని తెలిపారు. అధికారులు తన వెన్నంటి నడిచారని, ముఖ్యంగా డెప్యూటీ ఈఓ శ్రీ గోవిందరాజన్ సహకారం మరువలేనిదని తెలిపారు. టిటిడి విద్యాసంస్థల్లో ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు అంకితభావంతో పనిచేయడం వల్లే ఐఎస్ఓ సర్టిఫికెట్లు సాధించగలిగామని తెలియజేశారు. తనకు అవార్డు అందించినందుకు సంస్థకు కృతజ్ఞతలు తెలియజేశారు.

కాగా, శ్రీమతి సదా భార్గవి 2009 – 10లో విజయనగరం జిల్లా పార్వతీపురం ఆర్డీవోగా, 2011లో హైదరాబాద్ ఆర్డీవోగా, 2011 – 13లో చిత్తూరు జిల్లా తిరుపతి లీగల్ సెల్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా, 2014 నుంచి 18 వరకు విపత్తుల నిర్వహణ కమిషనర్ గా, 2018 నుంచి 20 వరకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో తెలుగుగంగ స్పెషల్ కలెక్టర్ గా విశేష సేవలందించారు. అదేవిధంగా 2020 నుండి ఇప్పటివరకు టిటిడి జెఈఓగా కార్యదక్షతతో విధులు నిర్వహిస్తున్నారు. టిటిడి ఎస్టేట్ విభాగంలో స్థిర చరాస్తులకు సంబంధించి భౌతిక పరిశీలన చేపట్టి 960 ఆస్తులను సంరక్షించారు. అన్యాక్రాంతమైన రూ.912 కోట్ల విలువైన 50 భూములను టిటిడి ఆధీనంలోకి తీసుకొచ్చారు.

ఈ సందర్భంగా పలువురు టిటిడి ఉద్యోగులు జెఈఓను ఘనంగా సన్మానించారు.

అనంతరం ఈ కార్యక్రమంలో 22 సంస్థలకు ఐఎస్ఓ సర్టిఫికెట్లు అందజేశారు అందజేశారు.

సంస్థ ఎండి శ్రీ ఆలపాటి శివయ్య మాట్లాడుతూ అత్యంత నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్న సంస్థలకు 2012వ సంవత్సరం నుంచి ఐఎస్వో సర్టిఫికేట్లు ప్రదానం చేస్తున్నట్లు తెలిపారు. ఐఎస్ఓ గుర్తింపు కోసం ఆయా సంస్థలు పోటీ తత్వంతో పనిచేస్తున్నాయని, తద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయని వివరించారు.

ఈ కార్యక్రమంలో సంస్థ జ్యూరీ సభ్యులు శ్రీ సుందరరామయ్య, శ్రీ కోటేశ్వరరావు, శ్రీ ఎ.ప్రసాద్, శ్రీ మహాదేవ నాయుడు, శ్రీ ఆర్ఆర్ రెడ్డి పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.