LOCAL SHRINES CLOSED FOR LUNAR ECLIPSE _ చంద్రగ్రహణం కారణంగా టిటిడి స్థానిక ఆలయాల మూత

TIRUPATI, 08 NOVEMBER 2022: In view of the Lunar Eclipse on Tuesday, all local temples run by TTD remained closed from 8:30 am onwards.

 

They included Sri Govindaraja Swamy temple, Sri Kodanda Ramalayam both in Tirupati and Chandragiri, Appalayagunta, Srinivasa Mangapuram and Kapileswara Swamy temple.

 

However, in Sri Kapileswara Swamy temple, Annabhishekam was performed during wee hours between 3:30am and 5:30am. Devotees were provided Annalinga Darshanam till 7:30am.

 
 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

చంద్రగ్రహణం కారణంగా టిటిడి స్థానిక ఆలయాల మూత

తిరుపతి, 2022 నవంబరు 08: చంద్రగ్రహణం కారణంగా మంగళవారం ఉదయం 8.30 గంట‌లకు టిటిడి స్థానికాల‌యాలైన తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీ కోదండరామస్వామివారి ఆలయం, శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, అప్ప‌లాయిగుంట శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యాల త‌లుపులు మూసివేశారు.

మ‌ధ్యాహ్నం 2.39 గంట‌ల నుండి సాయంత్రం 6.27 గంట‌ల వ‌ర‌కు చంద్ర‌గ్రహణం ఉంటుంది. గ్రహణ సమయానికి 6 గంటలు ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తోంది. కాగా, స్థానికాలయాల్లో ఉదయం 7.30 నుండి 8.30 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం క‌ల్పించారు. రాత్రి 7.30 గంటలకు ఆలయ తలుపులు తెరిచి ఆలయశుద్ధి, కైంకర్యాలు నిర్వహిస్తారు.

తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో రాత్రి 8 గంటల నుండి భ‌క్తుల‌ను స‌ర్వ‌ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తారు. రాత్రి 8 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు అభిషేకం, రాత్రి 8.30 నుండి 10 గంట‌ల వ‌ర‌కు అలంకారం, స‌హ‌స్ర‌నామార్చ‌న‌, నివేద‌న‌, దీపారాధ‌న‌, రాత్రి 10 నుండి 10.15 గంట‌ల వ‌ర‌కు ఏకాంత సేవ నిర్వ‌హిస్తారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.