LORD CHEERS DEVOTEES ON CHINNA SESHA VAHANAM_ చిన్నశేష వాహనంపై ముర‌ళీకృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్ప

Tirumala, 11 October 2018: On the second day morning on Thursday, as a part of the ongoing Navaratri Brahmotsavams, Sri Malayappaswamy took out a Celestial ride on Chinna Sesha Vahanam on the mada streets and mused the devotees who had gathered in the galleries in huge numbers to witness the seva.

The procession of Lord Malayappaswamy with His consorts was a grand feast for devotees with the cultural teams putting up an energetic showcase of devotional extravaganza.

Sri Malayappa, donning the role of Sri Krishna, rode the five-hooded golden vahanam in all His majesty.

Significance

It is widely believed that a divine glimpse of the Lord on Chinna Sesha Vahanam, who according to mythology is none other than the King serpent Vasuki, enlightens the devout about the importance of the hidden Kundalini energy embedded in every person.

TTD EO Sri Anil Kumar Singhal, Incharge CVSO Sri Sivakumar Reddy, Temple DyEO Sri Haridranath, Peishkar Sri Ramesh, VGO Sri Raveendra Reddy, Temple Staff and devotees took part.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

చిన్నశేష వాహనంపై ముర‌ళీకృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్ప

అక్టోబ‌రు 11, తిరుమల, 2018: శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన గురువారం ఉదయం శ్రీమలయప్పస్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై ముర‌ళీకృష్ణుడి అలంకారంలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. వాహనం ముందు గజరాజులు, అశ్వాలు ఠీవిగా నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాలు, డ్రమ్స్‌ వాయిద్యాలు, ఇతర కళాప్రదర్శనల నడుమ స్వామివారి వాహనసేవ అత్యంత వైభ‌వంగా జరిగింది.

రెండో రోజు ఉదయం శ్రీనివాసుడు ఒక్కరే ఐదు తలలు గల చిన్నశేష వాహనంపై ఊరేగారు. చిన్నశేష వాహనం శ్రీవారి వ్యక్తరూపమైన పాంచభౌతికప్రకృతికి సంకేతం. కనుక ఈ వాహనం పంచభూతాత్మకమైన విశ్వానికి, అందునివసించే జీవునికి వరాలిస్తుంది. విశ్వం కన్పించే శ్రీవారి ప్రకృతి. విష్ణువు ఈ ప్రకృతికి ఆధారమై దాన్ని నడిపించేశక్తి. స్వామి విశ్వాన్ని రక్షించేవాడు కనుక శేషునిపై తానొక్కడే విహరించాడు. పంచశిరస్సుల చిన్నశేషుని దర్శనం మహాశ్రేయఃప్రదం. శేషవాహనోత్సవాన్ని దర్శిస్తే దుష్టశక్తుల వల్ల కలిగే దుష్ఫలాలు తొలగి, భక్తులు కుండలినీయోగ సిద్ధించి, సుఖశాంతులతో ఆనందజీవులతారు.

అనంతరం సాయంత్రం 6 నుంచి 7 గంటల వకు ఊంజల్‌సేవ వైభవంగా జరుగనుంది. రాత్రి 8 నుంచి 10 గంటల వరకు హంస వాహనంపై స్వామివారు భక్తులను కటాక్షించనున్నారు.

వాహనసేవల్లో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ‌ర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ‌ర్ స్వామి, టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, ఇన్‌చార్జి సివిఎస్వో శ్రీ శివ‌కుమార్‌రెడ్డి ఇతర అధికార ప్రముఖులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.