TAKE SANATANA DHARMA CAMPAIGN TO FIELD LEVEL- JEO BHASKAR_ సనాతన హైందవ ధర్మాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలి – టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్

Tiruapti, 11 October 2018: The Dharma pracharaks of TTD should play an active role in spreading tenets of Sanatana Dharma among people, said Tirupati JEO Sri P Bhaskar.

Addressing the trainee Dharma pracharaks at SVETA on Thursday Sri Bhaskar said as per the directions of the EO Sri Anil Kumar Singhal the Dharma Pracharaks should focus on inculcating the basic tenets of Hindu dharma among youth, school children and women.

He said presently dharmic influence among the youth has been reducing in view of split of joint family system. The goal of the HDPP was to train one dharma pracharaks in each village spread awareness about Hindu region among youth, women and school children by popularizing the basic tenets of epics like Ramayana, Mahabharata and Bhagavatam.

He said the TTD had initially chosen 62 persons from all the districts of Telangana and Andhra Pradesh and aims to completely train around 500 dharma pracharaks in 12 batches by March 2019. SVBC has already broadcast 16 episodes of 30 minutes each on sanatana dharma for spreading awareness among public.

The JEO said the episodes were absorbed from the epics Ramayana, Bhagavata and Mahabharata and scripted in simple language for public consumption. He also narrated the basic tenets of Hindu dharma with help of a power point presentation to the trainee dharma pracharaks.

Among others HDPP Secretary Dr Ramana Prasad, Epic studies OSD, DR Damodar Naidu, Sri Gurudev Ravi Shankar’s Art of living teacher Smt Gayatri Sudha, and dharma pracharaks from AP and Telangana participated in the event.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

సనాతన హైందవ ధర్మాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలి – టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్

తిరుపతి, 2018 అక్టోబరు 11: సనాతన హైందవ ధర్మాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని శిక్షణ పొందుతున్న ధర్మప్రచారకులను టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్ కోరారు. తిరుపతిలోని శ్వేతా భవనంలో హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ధర్మ ప్రచారకులకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని ఆయన గురువారం పరిశీలించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఆదేశాల మేరకు నేటి యువతలో సనాతన హైందవ ధర్మం, నైతిక విలువలను పెంపొందించేలా ధర్మప్రచారకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. సనాతన ధర్మం వివేకాన్ని పెంచడంతో పాటు, సులువుగా గమ్యాన్ని చేర్చేలా మనోధైర్యాన్ని నింపుతుందన్నారు. పూర్వ రోజులలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవని, తద్వారా పిల్లలకు సనాతన ధర్మ విషయాలను బోధించేవారని అన్నారు. ప్రస్తుతం ఉమ్మడి కుటుంబాలు చిన్న కుటుంబాలుగా విడిపోవడం వల్ల ధర్మ పరిజ్ఞానం యువతకు చేరడం లేదన్నారు. టిటిడి ఆధ్వర్యంలోని హిందూ ధర్మ ప్రచార పరిషత్ ప్రతి గ్రామంలో ఒక ధర్మ ప్రచారకునికి సనాతన ధర్మం పట్ల శిక్షణ ఇచ్చి వారి ద్వారా గ్రామస్థాయిలో అవగాహన కల్పిస్తామన్నారు. యువత, మహిళలు, పిల్లలు సులువుగా అర్థం చేసుకునేలా రామాయణం, భాగవతం, భారతంలోని ముఖ్యమైన ఘట్టాలను కథలరూపంలో వివరించాలన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన జిల్లాల నుండి 52 మందిని ఎంపిక చేసి సనాతన ధర్మం, ధర్మపరిచయం తదితర అంశాలపై శిక్షణ ఇస్తున్నామని తెలియజేశారు. మార్చి 2019 నాటికి 12 బ్యాచ్ లలో 500 మందికి శిక్షణ ఇస్తామన్నారు. అంతేకాక సనాతన ధర్మంపై పండితులు, సనాతన ధర్మ నిష్ణాతులచే 30 నిమిషాల నిడివితో 16 ఎపిసోడ్లను రూపొందించి ఎస్వీబీసీలో ప్రసారం చేయనున్నట్లు తెలిపారు.

రామాయణం, భాగవతం, భారతంలోని ప్రధాన ఘట్టాలను నేటి తరానికి అర్థమయ్యేలా సరళమైన భాషలో వివరించాలని తెలియజేశారు. హిందూ ధర్మం పవిత్రమైనదని, భారతదేశానికి హిందూ ధర్మం వెన్నెముక లాంటిదన్నారు. ధర్మప్రచారకులకు ధర్మపరిచయం, లక్ష్యాలు, పురాతన గ్రంథాలు తదితర అంశాలపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించనున్నారు.

ఈ కార్యక్రమంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి డా. రమణప్రసాద్‌, ఎపిక్‌ స్టడీస్‌ ప్రత్యేకాధికారి డా.దామోదర్‌ నాయుడు, శ్రీ గురుదేవ్‌ రవిశంకర్‌ ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌లో శిక్షకురాలు శ్రీమతి గాయత్రి సుధా, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ జిల్లాల నుండి వచ్చిన ధర్మప్రచారకులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.