LORD RIDES HANUMANTHA VAHANAM_ వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి సాక్షాత్కార వైభవోత్సవాలు

Srinivasa Mangapuram, 17 July 2018: On the second day of Sakshatkara Vaibhavotsavam in Srinivasa Mangapuram on Tuesday evening, the Lord took celestial ride on Hanumatha Vahanam.

Earlier during the day Snapana Tirumanjanam was performed to the deities.

While on Wednesday the three day annual fest concludes in Sri Kalyana Venkateswara Swamy temple.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి సాక్షాత్కార వైభవోత్సవాలు

తిరుపతి, 2018 జూలై 17: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి సాక్షాత్కార వైభవోత్సవాలు రెండవ రోజైన మంగళవారం వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాలసేవ, కొలువు పంచాంగ శ్రవణం చేపట్టారు. ఉదయం 9.30 నుండి 11 గంటల వరకు కల్యాణమండపంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లు, పలురకాల పండ్లరసాలతో అభిషేకం చేశారు.

సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు స్వామివారి ఊంజల్‌సేవ జరుగనుంది. రాత్రి 8 నుండి 9 గంటల వరకు స్వామివారు హనుమంత వాహనంపై భక్తులను అనుగ్రహిస్తారు. ఈ సందర్భంగా హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ వెంకటయ్య, ఎఈవో శ్రీ శ్రీనివాసులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ అనిల్‌కుమార్‌ ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

జూలై 18న గరుడ సేవ :

శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి సాక్షాత్కార వైభవోత్సవాల్లో చివరి రోజైన జూలై 18న బుధవారం రాత్రి 8 నుండి 9 గంటల వరకు గరుడ వాహనంపై స్వామివారు భక్తులకు అభయమివ్వనున్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.