PALLAKI UTSAVAM STEALS THE HEARTS_ పుష్ప పల్లకీపై శ్రీ భూ సమేత మలయప్పస్వామివారి వైభవం

Tirumala, 17 July 2018: The pilgrims were enthralled to witness Pallaki Utsavam on the pleasant evening of Tuesday at Tirumala.

Every year on the occasion of annual Anivara Asthanam, the deities were taken on celestial procession along four mada streets.

This year the garden wing of TTD has come out with yet another unique theme of Pandaripur Pandu Ranga Vitthala which has charmed the pilgrims.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

పుష్ప పల్లకీపై శ్రీ భూ సమేత మలయప్పస్వామివారి వైభవం

జూలై 17, తిరుమల 2018: ఆణివార ఆస్థానం సందర్భంగా మంగళవారం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి వారు అత్యంత శోభాయమానంగా అలంకరించిన పుష్పపల్లకీపై తిరుమల పురవీధుల గుండా ఊరేగుతూ భక్తులకు కనువిందు చేయనున్నారు.

టిటిడి ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో పల్లకీ ముందువైపు శ్రీ మహావిష్ణువు, ఇరువైపులా చిన్ని కృష్ణులు, మధ్యలో ఒకవైపు పండరీపురం శ్రీ పాండురంగస్వామివారు, మరొకవైపు ద్వారక కృష్ణుడు, వెనుకవైపు శ్రీ ఆంజనేయస్వామివారి సెట్టింగులను ఏర్పాటు చేశారు.

అదేవిధంగా రోజాలు, చామంతి, లిల్లి, మొలలు, మల్లి, కనకాంబరం, తామరపూలు, వృక్షి తదితర 9 రకాల సాంప్రదాయ పుష్పలు, 5 రకాల కట్‌ ఫ్లవర్స్‌ను వినియోగించారు.
అదేవిధంగా వివిధ సాంప్రదాయ పుష్పలు, కట్‌ ఫ్లవర్స్‌తో విశేష అలంకరణలు చేశారు.

టిటిడి ఉద్యానవన విభాగం డెప్యూటీ డైరెక్టర్‌ శ్రీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో దాదాపు 15 మంది ఉద్యానవనశాఖ సిబ్బంది వారం రోజుల నుండి పుష్పపల్లకీని రూపొందించారు. తమిళనాడులోని సెలంకు చెందిన దాత శ్రీ మణిశంకర్‌ శ్రీవారి పుష్పపల్లకీని ఆకర్షణీయంగా రూపొందించేందుకు ఆర్థిక సహాయం అందించారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.