LORD SWINGS ON GAJA VAHANAM _ గ‌జ వాహ‌నంపై శ్రీ మ‌ల‌య‌ప్ప క‌టాక్షం

Tirumala, 24 Sep. 20: On the evening of the sixth day of the ongoing annual Brahmotsavams, Sri Malayappa Swamy seated majestically on Gaja Vahanam and blessed devotees.

The episode of Gajendra Moksham in Srimad Bhagavatam narrates how Lord rescued Gajendra and got him relieved from the clutches of Crocodile (Makara). Gaja also known, as Airaavatha is vaahana of Lord Indra that is manifested from ocean during Ksheera-saagara Mathanam.Elephant is a symbol of royalty, richness and pride. This vahanam simply showcases the mightiness of Lord Venkateswara.

TTD Chairman Sri YV Subba Reddy, TTD EO Sri Anil Kumar Singhal, Board members Sri Ananta, Sri Siva Kumar, Sri Govind Hari, DP Anantha, Sri Sekhar Reddy, Dr Nischitha, Smt Prasanthi Reddy, Additional EO Sri AV Dharma Reddy, CVSO Sri Gopinath Jatti, Srivari temple DyEO Sri Harindranath were also present. 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

2020 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

గ‌జ వాహ‌నంపై శ్రీ మ‌ల‌య‌ప్ప క‌టాక్షం

తిరుమ‌ల‌, 2020 సెప్టెంబరు 24: శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు గురు‌‌వారం రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణోత్స‌వ మండ‌పంలో శ్రీ మలయప్పస్వామివారు గ‌జ వాహ‌నంపై క‌టాక్షించారు.

గజ వాహనం – క‌ర్మ విముక్తి

రాజులను పట్టాభిషేకాది సమయాలలో గజాలపై ఊరేగిస్తారు. ఒక విశిష్ట వ్యక్తిని ఘనంగా సన్మానించాల్సి వస్తే గజారోహనం చేసే ప్రక్రియ నేటికీ ఉంది. ఈ వాహ‌న‌సేవ ద‌ర్శ‌నం వ‌ల్ల క‌ర్మ విముక్తి క‌లుగుతుంద‌ని పురాణాల ద్వారా తెలుస్తోంది. స్వామి గజవాహనాన్ని అధిష్టించిన రోజేగాక, ఉత్స‌వాల వేళ తిరుమల తిరుపతి దేవస్థానం గజరాజులు పాలు పంచుకుంటాయి.

కాగా, బ్రహ్మోత్సవాలలో ఏడవ రోజైన శుక్ర‌వారం ఉదయం 9 నుండి 10 గంటల వరకు సూర్యప్రభ వాహనం, రాత్రి 7 నుండి 8 గంటల వ‌ర‌కు చంద్రప్రభ వాహనంపై శ్రీమలయప్పస్వామి వారు ద‌ర్శ‌న‌మిస్తారు.

వాహనసేవల‌లో శ్రీశ్రీశ్రీ పెద్దజీయ‌ర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్ స్వామి, టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యులు శ్రీ‌మ‌తి వేమిరెడ్డి ప్ర‌శాంతి, డా.నిశ్చిత‌, శ్రీ శేఖ‌ర్ రెడ్డి, శ్రీ గోవింద‌హ‌రి, శ్రీ డిపి అనంత‌, ఆలయ డెప్యూటి ఈఓ శ్రీ హరీంద్రనాథ్, పేష్కార్ శ్రీ జ‌గ‌న్‌మోహ‌నాచార్యులు తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.