LORRY DONATED _ టీటీడీకి లారీ విరాళం
TIRUMALA, 22 May 2022: Former legislator from Mulabagal of Karnataka Sri G Manjunath along with 12 other vegetable donors has donated a Rs. 30 lakh worth lorry.
After performing puja to the new carrier in front of the temple on Sunday morning at Tirumala, he handed over the keys to TTD EO Sri AV Dharma Reddy.
The vehicle is specially designed to carry vegetables donated to TTD Annaprasadam activity.
Deputy EO of Annaprasadam and Donor Cell of TTD Smt Padmavathi, Driving Inspector Sri Janakirami Reddy and others were also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
టీటీడీకి లారీ విరాళం
తిరుమల, 2022 మే 22: కర్ణాటకలోని ముళబాగల్ మాజీ శాసనసభ్యుడు శ్రీ జి. మంజునాథ్‌తో పాటు మరో 12 మంది కూరగాయల దాతలు రూ. 30 లక్షల విలువైన లారీని టిటిడికి విరాళంగా అందించారు.
తిరుమలలో ఆదివారం ఉదయం ఆలయం ముందు కొత్త వాహనానికి పూజలు నిర్వహించిన అనంతరం దాతలు టీటీడీ ఈవో శ్రీ ఎవి. ధర్మారెడ్డికి తాళంచెవులను అందజేశారు.
టీటీడీ అన్నప్రసాద కార్యకలాపాలకు విరాళంగా అందజేసిన కూరగాయలను తీసుకెళ్లేందుకు ఈ వాహనాన్ని ప్రత్యేకంగా రూపొందించారు.
టీటీడీ అన్నప్రసాదం మరియు దాతల విభాగం డిప్యూటీ ఈఓ శ్రీమతి పద్మావతి, డ్రైవింగ్ ఇన్‌స్పెక్టర్ శ్రీ జానకిరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.