ASTHANAM HELD_ వైభవంగా శ్రీ కోదండరామస్వామివారి ఆస్థానం

Tirupati, 22 May 2022: On the last day of the 614th Jayanti Mahotsavams of saint-poet Sri Tallapaka Annamacharya Asthanam of Sri Kodandaramaswamy was performed at Sri Annamacharya Kala Mandiram on Sunday.

The artists of Annamacharya project performed sankeetana Gosti Ganam in the divine presence of the utsava idols. After the fete, the deities were returned to the Sri Kodandaramaswami temple.

Harikatha Parayanam was also performed later on the occasion.

TTD DyEO of local temples Smt Nagaratna, AEO Sri Durga Raju, Superintendent Sri Ramesh, Annamacharya Project Program Co-ordinator Dr Lata and other officials were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

వైభవంగా శ్రీ కోదండరామస్వామివారి ఆస్థానం

తిరుపతి, 2022 మే 22: పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 614వ జయంతి ఉత్సవాలు ఆదివారం ఘనంగా ముగియనున్నాయి. మే 16 నుండి 22వ తేదీ వరకు ఏడు రోజుల పాటు తిరుపతి, తాళ్లపాకలో అన్నమయ్య జయంతి ఉత్సవాలను టీటీడీ వైభవంగా నిర్వహించింది.

ఈ ఉత్సవాల్లో భాగంగా తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో ఆదివారం ఉద‌యం 8 గంటలకు శ్రీ కోదండరామస్వామివారి ఆస్థానం ఘనంగా జరిగింది. ముందుగా స్వామివారి ఉత్సవమూర్తులను శ్రీ కోదండరామస్వామివారి ఆలయం నుండి అన్నమాచార్య కళామందిరానికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సంకీర్తనా గోష్టిగానం నిర్వహించారు. అనంతరం తిరిగి స్వామివారి ఉత్సవమూర్తులను శ్రీ కోదండరామాలయానికి తీసుకెళ్లారు.

ఆ త‌రువాత‌ ఉదయం 10.30 గంటలకు తిరుప‌తికి చెందిన శ్రీ‌మ‌తి జ‌యంతి సావిత్రి బృందం హరికథ పారాయణం చేశారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ స్థానిక ఆలయాల డెప్యూటీ శ్రీమతి నాగరత్న, ఏఈవో దుర్గ రాజు, సూపరింటెండెంట్ శ్రీ రమేష్, ప్రోగ్రాం కో ఆర్డినేట‌ర్ డా.లత, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.