వేద ఘోషతో మార్మోగిన తిరుమల గిరులు
వేద ఘోషతో మార్మోగిన తిరుమల గిరులు
జనవరి 11, తిరుమల 2019: కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్ర ధనుర్మాసం చివరి శుక్రవారాన్ని పురస్కరించుకుని ఎస్వీ వేద పాఠశాల విద్యార్థులు, అధ్యాపకులు వేద పారాయణంతో తిరుమల గిరులు మార్మోగాయి. ప్రతి ఏడాది ధనుర్మాసం సందర్భంగా శ్రీవారి ఆలయంలో వేద పారాయణం నిర్వహించడం ఆనవాయితీ.
ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం తిరుమల ధర్మగిరిలోని వేద పాఠశాలకు చెందిన దాదాపు 750 మంది అధ్యాపకులు, విద్యార్థులు వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగింపుగా చతుర్వేద పారాయణం చేశారు.
అంతకుముందు అధ్యాపకులు, విద్యార్థులు వారి కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి నిజపాద దర్శనం చేసుకున్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.