MAHA SAMPROKSHANA PROGRAMS AT SEETAMPETA COMMENCES _ సీతంపేటలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ప్రారంభం

SEETAMPETA, 30 APRIL 2023: The Maha Samprokshana rituals in Seetampeta of Parvatipuram Manyam district have commenced on a grand religious note under the supervision of one of the chief priests of Tirumala temple Sri Venugopala Deekshitulu on Sunday.

 

Speaking on the occasion, he said, TTD has taken up the construction of Srivari temple in Agency area with an aim to propagate Srivari Vaibhavam across the country. As part of it, apart from Sri Venkateswara Swamy temple, the sub-shrines of Sri Lakshmi, Sri Godadevi, Garudalwar, Jaya-Vijaya, Vimana Gopuram, Mukha Mandapam will also be constructed. Explaining about the events, he said on Sunday Panchagavya Prasana, Vastu Homam, Akalmasha Prayaschitta Homam, Rakshabandhanam will be observed while Agni Pratista, Kumbha Sthapana, Kumbharadhana, Visesha Homams. 

 

For performing various Agamic rituals, 17 Homa Gundams were set up in the Yagashala. TTD Vaikhanasa Agama Advisor Sri Mohana Rangacharyulu is acting as Upadrastha for all these religious events while Sri Seshacharyulu as Kankanabhattar.

 

DyEO Sri Gunabhushan Reddy, Sri Venkataiah, Sri Siva Prasad, EEs Sri Sudhakar, Sri Ramesh and other officials were present.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

సీతంపేటలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ప్రారంభం

సీతంపేట, 2023, ఏప్రిల్ 30: పార్వతీపురం మన్యం జిల్లా  సీతంపేటలో టీటీడీ నూతనంగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ విగ్రహప్రతిష్ట, మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ఆదివారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. మే 4న మహాసంప్రోక్షణ, శ్రీవారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు, కార్యక్రమ ప్రధాన పర్యవేక్షకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు మాట్లాడుతూ శ్రీవారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేయడంలో భాగంగా దేశంలోని అన్ని ప్రధాన నగరాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో టీటీడీ శ్రీవారి ఆలయాల నిర్మాణం చేపడుతోందన్నారు. ఇందులో భాగంగా సీతంపేటలో అత్యద్భుతంగా స్వామివారి ఆలయ నిర్మాణం చేపట్టినట్టు చెప్పారు.

శ్రీ వేంకటేశ్వరస్వామివారు, శ్రీ లక్ష్మీ అమ్మవారు, శ్రీ గోదాదేవి, గరుడాళ్వార్, ద్వారపాలకులు, విమాన గోపురం, ముఖ మండపంతో ఈ ఆలయ నిర్మాణం చేపట్టినట్టు వివరించారు. ఆదివారం ఉదయం 8 నుండి 11 గంటల వరకు పంచగవ్యప్రాసన, వాస్తు హోమం, అకల్మష ప్రాయశ్చిత్త హోమం, రక్షాబంధనం నిర్వహించామని తెలిపారు. సాయంత్రం అగ్ని ప్రతిష్ట, కుంభ స్థాపన, కుంభారాధన, విశేష హోమాలు నిర్వహిస్తారని చెప్పారు.

కాగా, యాగశాలలో 17 హోమ గుండాలతో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలకు ఉపద్రష్ణగా టీటీడీ వైఖానస ఆగమ సలహాదారు శ్రీ మోహన రంగాచార్యులు, కంకణభట్టారుగా శ్రీ శేషాచార్యులు వ్యవహరిస్తున్నారు. 25 మంది రుత్వికులు వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవోలు శ్రీ గుణభూషణ్ రెడ్డి, శ్రీ వెంకటయ్య, శ్రీ శివప్రసాద్, ఈ ఈ శ్రీ సుధాకర్, ఏఈఓ శ్రీ రమేష్, డెప్యూటీ ఈ ఈ లు శ్రీ ఆనందరావు, శ్రీ నాగరాజు, ఎఈ ఈ శ్రీ రవికుమార్, సూపరింటెండెంట్ శ్రీ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.