SUNDARA TIRUMALA-SUDDHA TIRUMALA” PROGRAM A HUGE SUCCESS _ ఉద్యోగుల సహకారం అభినందనీయం: ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి

TTD EO COMPLIMENTS THE DEDICATION OF TTD WORK FORCE DURING HARD TIMES

Tirumala,30 April 2023 : Following the clarion call given by TTD EO Sri AV Dharma Reddy, the strong workforce of TTD, have voluntarily participated in the “Sundara Tirumala-Suddha Tirumala” programme on Sunday to transform the hill shrine into a green and garbage free environment providing a healthy and divine ambience to the visiting devotees.

Addressing media after a Tirumala cleaning voluntary program with TTD deputation staff the TTD EO said the Sulabh Agency employees in Tirumala had gone on a lightning strike since April 22 without giving notice to the TTD management.

The undeterred TTD management had strived to keep the hill shrine clean by deploying sanitary workers from Tirupati, Nellore, Chittoor and Nellore Municipal Corporations for the last one week.   
 

He said of the 8,000 – 10,000 permanent and contract employees nearly 600-700 employees were allotted cleaning duty on deputation at Tirumala which also included EO, JEOs, CVSO, Deputy EOs, Superintendents, Clerks, lecturers, teachers and doctors on a three terms per month schedule.

He said besides the TTD employees and the Srivari Sevakulu have also responded to his appeal to participate in the cleaning program as part of their service to Sri Venkateswara Swamy. The EO said the crisis is being resolved by issuing work orders to five different agencies who are now recruiting sanitary workers from several districts. The TTD has provided adequate salaries, all perks including Srivari Darshan, laddu Prasadams etc.

He complimented the media, TTD employees including the teaching faculty from various educational institutions and Srivari Sevakulu who supported the TTD during the high time and for their voluntary participation in the Sundara Tirumala-Suddha Tirumala programme.  

Earlier TTD EO launched the cleaning program at CRO, District Collector Sri Venkatramana Reddy at Lepakshi Circle, while JEOs Smt Sada Bhargavi at old Annaprasadam, Sri Veerabrahmam at Vaikunta Queue complex, CVSO Sri Narasimha Kishore at GNC, CE Sri Nageswara Rao at Shilathoranam, FA&CAO Sri Balaji at Narayanagiri Gardens with the help of Srivari Sevakulu.

CEO SVBC Sri Shanmukh Kumar, SE 2 Sri Jagadeeshwar Reddy, DEO Sri Bhaskar Reddy and other officials have also participated while the overall requirement of providing the cleaning materials were provided by the Health Officer Dr Sridevi. 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఉద్యోగుల సహకారం అభినందనీయం

– క్లిష్ట సమయంలో భక్తులకు ఇబ్బందులు రాకుండా ఉద్యోగులు పని చేస్తున్నారు

: ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి

తిరుమల, 2023 ఏప్రిల్‌ 30: క్లిష్ట సమయంలో తమ సంస్థ ప్రతిష్ట కాపాడుతూ భక్తులకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా సేవలందించేందుకు ఉద్యోగులు ముందుకురావడం అభినందనీయమని టీటీడీ ఈవో శ్రీ ధర్మారెడ్డి చెప్పారు. భక్తుల సేవే భగవంతుని సేవగా భావించి ఉద్యోగులు యాజమాన్యానికి అవసరమైన ప్రతి సందర్భంలో అండగా నిలవాలని ఆయన కోరారు . ఉద్యోగులు సంస్థను తమ సొంత ఇంటిలా భావించి పారిశుధ్య పనులకు ముందుకు వచ్చారని వారిలో ఉత్సాహం నింపారు . ఇదే స్పూర్తితో భక్తులకు మరింత ఆహ్లాదకర, ఆధ్యాత్మిక వాతావరణం కల్పించేందుకు శుద్ధ తిరుమల – సుందర తిరుమలగా తయారు చేయడంలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ శ్రీ వెంకటరమణా రెడ్డి తో కలసి ఆయన పిలుపు నిచ్చారు .

తిరుమలలో ఆదివారం ఉదయం డిప్యుటేషన్ సిబ్బందితో కలిసి ఈవో పారిశుధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ, ఈ నెల 22వ తేదీన 1600 మంది సులభ ఏజెన్సీలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు టీటీడీ యాజమాన్యానికి తెలియజేయకుండా సమ్మెకు వెళ్లారన్నారు. తిరుపతి, చిత్తూరు, కడప, నెల్లూరు కార్పొరేషన్లు , స్విమ్స్, బర్డ్ సంస్థల నుండి పారిశుద్ధ్య కార్మికులను సమీకరించి ఎనిమిది రోజులుగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ పారిశుధ్య చర్యలు చేపట్టిందని చెప్పారు.

టీటీడీలోని 8 వేల నుండి 10 వేల మంది పర్మినెంట్, కార్పొరేషన్ ఉద్యోగులకు, ప్రతిరోజు 600 నుండి 700 మందికి తిరుమలలో డిప్యుటేషన్ డ్యూటీ వేసినట్లు తెలిపారు. ఇందులో ఈవో, జేఈవోలు, సివిఎస్వో , డిప్యూటీ ఈవో లు , సూపరింటెండెంట్లు , ఎగువ, దిగువ శ్రేణి గుమస్తాలు, లెక్చరర్లు, ఉపాధ్యాయులు, డాక్టర్లు ఉన్నారన్నారు. వీరందరికి ప్రతినెల మూడుసార్లు తిరుమలలో డ్యూటీలు వేయడం జరిగిందని చెప్పారు.

తిరుమలలో విధులు నిర్వహిస్తున్న పారిశుధ్య కార్మికులు సమ్మె చేస్తున్నందున, ఉద్యోగులు సహకరించాలని తాను కోరినట్లు ఈవో తెలిపారు. అందుకు ఉద్యోగులు భగవంతుని సేవలో మనస్ఫూర్తిగా భాగస్వామ్యులై భక్తులకు సేవలు అందించేందుకు ముందుకు వచ్చారని తెలిపారు. అదేవిధంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన శ్రీవారి సేవకులు భక్తులకు సేవలు అందించేందుకు పారిశుధ్య కార్యక్రమంలో భాగస్వామ్యులయ్యారని చెప్పారు. నెలరోజుల పాటు అధికారులు, ఉద్యోగులు ఈ విధుల్లో స్వచ్ఛందంగా పాల్గొంటారని ఈవో చెప్పారు. భక్తులకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా టీటీడీ అధికారులు, ఉద్యోగులు, శ్రీవారి సేవకులు పారిశుధ్య పనుల్లో పాల్గొంటామని ఈవో స్పష్టం చేశారు.

పారిశుధ్య నిర్వహణ కోసం ఇప్పటికే ఐదు ఏజెన్సీలకు వర్క్ ఆర్డర్ ఇచ్చామని, వీరు వివిధ జిల్లాలు, రాష్ట్రాల నుండి కార్మికులను సమీకరించి తీసుకొస్తున్నారని చెప్పారు. వీరికి కనీస వేతనాలు, అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు, శ్రీవారి దర్శనం, సబ్సిడీపై లడ్డూ ప్రసాదాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

కష్ట సమయంలో టీటీడీ యాజమాన్యానికి సహకరించిన ఉద్యోగులకు, మీడియా మిత్రులకు, మీడియా యాజమాన్యాలకు , శ్రీవారి సేవకులకు ఈవో కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా భక్తులు కూడా సహకరించాలని పిలుపునిచ్చారు.

అంతకుముందు ఈవో శ్రీ ధర్మారెడ్డి – సిఆర్ ఓ, జిల్లా కలెక్టర్ శ్రీ వెంకటరమణారెడ్డి – లేపాక్షి సర్కిల్, జేఈవోలు శ్రీమతి సదా భార్గవి – పాత అన్నదానం కాంప్లెక్స్, శ్రీ వీరబ్రహ్మం – వైకుంఠం క్యూ కాంప్లెక్స్, సివిఎస్ వో శ్రీ నరసింహ కిషోర్ జియన్సి, సిఈ శ్రీ నాగేశ్వరరావు – శిలాతోరణం, ఎఫ్ ఎసిఎవో శ్రీ బాలాజి – నారాయణగిరి ఉద్యానవనాలు తదితర ప్రాంతాల్లో ఉద్యోగులు, శ్రీవారి సేవకులతో కలిసి పారిశుధ్య కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఎస్వీ బీసీ సిఈవో శ్రీ షణ్ముఖ కుమార్, ఎస్ ఈ 2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, డిఈవో శ్రీ భాస్కర్ రెడ్డి తో పాటు అన్ని విభాగాల అధికారులు ఉద్యోగులు, శ్రీవారి సేవకులు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.