MAHA SAMPROKSHANAM CONCLUDES AT SKVST IN SM_ శాస్త్రోక్తంగా శ్రీక‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌య మహాసంప్రోక్షణ

Srinivasa Mangapuram, 13 Jun. 19: The once in 12 year Agama ritual of Astabandhana Balalaya Maha samprokshanam concluded at the Sri Kalyana Venkateswara Temple, Srinivasa Mangapuram with high voltage programs at Karkataka lagnam on Thursday morning.

The TTD EO Sri April Kumar Singhal and Tirumala JEO Sri K S Sreenivasa Raju participated in the daylong events which included mahapurnahuthi and kalashabhisekam with 48 kalashas.

Speaking on the occasion the TTD EO said TTD celebrated the Astabandhana Balalaya Maha samprokshanam once in 12 years at all TTD local temples since 2007.

He said all unique rituals were performed since June 9-13 as per Agama traditions. He said 41 ritwiks from AP, Telangana, Karnataka, and Tamil Nadu performed rituals in 25 Homa Mundas all these days

Later on devotees were darshan after 11 am and Pedda Sesha vahanam at night.

DyEO Sri Dhananjayulu. Vaikhanasa Agama advisor Sri Sundara Varada Bhattacharya, Sri Mohan Rangacharyulu, Sri Ananta Shahana Dikshitulu, Chief kankana bhattar Sri Sitaramacharyulu, AEO Sri Lakshmaiah, Chief Archaka Sri Balaji Rangacharyulu, Superintendent Sri Chengalrayudu, Sri Ramanaiah, Temple inspector Sri Anil and AVSO Sri Surendra participated.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శాస్త్రోక్తంగా శ్రీక‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌య మహాసంప్రోక్షణ

తిరుప‌తి, 2019 జూన్ 13: శ్రీ‌నివాస‌మంగాపురంలోని శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆలయంలో గురువారం ఉదయం 7.30 నుండి 9.00 గంట‌ల మధ్య క‌ర్కాట‌క ల‌గ్నంలో శాస్త్రోక్తంగా మహాసంప్రోక్షణ జ‌రిగింది. ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, తిరుమ‌ల జెఈవో శ్రీ కెఎస్.శ్రీనివాసరాజు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఉద‌యం మ‌హాపూర్ణాహుతి నిర్వ‌హించారు. ఆ త‌రువాత ఆలయ విమాన గోపురానికి యాగశాలలోని కలశంతో అభిషేకం చేశారు. విమాన గోపుర శిఖ‌రంలో న‌లుగురు దేవ‌త‌లుంటారు. వీరిని విమానం ప్ర‌ప‌ధ్యే .., విష్ణుమ‌యం ప్ర‌ప‌ధ్యే …, దేవావాసం ప్ర‌ప‌ధ్యే…, వైకుంఠోద్భ‌వం ప్ర‌ప‌ధ్యే…అనే మంత్రాల‌తో ప్రార్థిస్తారు. గోపురం చుట్టూ 24 మంది ఆవ‌ర‌ణ దేవ‌తలు ఉంటారు. మ‌హాసంప్రోక్ష‌ణ‌తో యాగ‌శాల‌లో కుంభంలో ఉన్న దేవ‌తామూర్తుల శ‌క్తిని బింబం(విగ్ర‌హం)లోకి ఆవాహ‌న చేశారు. త‌ద్వారా విమాన‌గోపురంలోని దేవ‌త‌ల శ‌క్తితో పాటు శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి, శ్రీ గ‌రుడాళ్వారు, పుష్క‌రిణి వ‌ద్దగ‌ల శ్రీ ఆంజ‌నేయ‌స్వామివారి విగ్ర‌హాల‌కు తిరిగి దైవ‌శ‌క్తి చేకూరింది. దేవ‌తామూర్తుల విగ్ర‌హాల‌కు 12 జీవ‌స్థానాలు, 4 ఉప‌స్థానాలు, 48 క‌ళ‌లు ఉంటాయి. క‌ళాక‌ర్ష‌ణంతో తొల‌గించిన ఈ 48 క‌ళ‌ల‌ను మహాసంప్రోక్ష‌ణ‌తో తిరిగి ఆవాహ‌న చేశారు. మ‌హాసంప్రోక్ష‌ణ అనంత‌రం విశేష ఆరాధ‌న‌లు, నైవేద్యాలు స‌మ‌ర్పించారు. ఆ తరువాత అక్ష‌తారోప‌ణం చేపట్టారు.

ఈ సంద‌ర్భంగా టిటిడి ఈవో మీడియాతో మాట్లాడుతూ జూన్ 9 నుండి 13వ తేదీ వరకు వైఖానస ఆగమోక్తంగా అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించిన‌ట్లు తెలిపారు. టిటిడి అనుబంధ ఆల‌యాల‌లో ప్ర‌తి 12 సంవ‌త్స‌రాల‌కు ఒక‌సారి అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ నిర్వ‌హిస్తున్నామ‌న్నారు. గ‌తంలో 2007వ సంవత్సరం టిటిడి ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించింద‌న్నారు.

ఇందులో భాగంగా జూన్ 8న అంకురార్ప‌ణ‌, జూన్ 9వ తేదీన కళాకర్షణ, జూన్‌ 12న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారికి మహాశాంతి తిరుమంజనం నిర్వహించ‌నున్న‌ట్లు తెలిపారు. జూన్‌ 13న ఉదయం ”మహాపూర్ణాహుతి, మహాసంప్రోక్షణను శాస్త్రోక్తంగా నిర్వ‌హించిన‌ట్లు వివ‌రించారు. అనంత‌రం ఉదయం 11.00 గంటల నుండి భక్తులను దర్శనానికి అనుమతించిన‌ట్లు తెలిపారు.

ఈ వైధిక కార్య‌క్ర‌మానికి యాగశాలలో 25 హోమగుండాలు, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి విచ్చేసిన 41 మంది రుత్వికులు పాల్గొన్నార‌న్నారు. ఈ సంద‌ర్భంగా రాత్రి 7.00 నుండి 8.00 గంటల వరకు శ్రీదేవి, భూదేవి స‌మేత శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారు పెద్ద‌శేష వాహ‌నంపై ఆల‌య మాడ వీధులలో ఊరేగి భక్తులకు ద‌ర్శ‌న‌మివ్వ‌నున్న‌ట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో శ్రీ‌వారి ఆల‌య ప్రధానార్చకులు శ్రీ వేణుగోపాలదీక్షితులు, ప్రధాన కంక‌ణ‌బ‌ట్టార్ శ్రీ సీతారామాచార్యులు, వైఖాన‌స ఆగ‌మ స‌ల‌హ‌దారులు శ్రీ సుంద‌రవ‌ర‌ద భ‌ట్టాచార్యులు, శ్రీ‌ మోహ‌న రంగాచార్యులు, శ్రీ అనంత‌శ‌య‌ణ దీక్షితులు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ ధ‌నంజ‌యులు, విజివో శ్రీ అశోక్‌కుమార్ గౌడ్‌, ఏఈవో శ్రీ ల‌క్ష్మ‌య్య‌, ఆలయ ప్రధానార్చకులు శ్రీ బాలాజి రంగాచార్యులు, సూపరింటెండెంట్‌ శ్రీ చెంగ‌ల్రాయులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ అనిల్‌, ఎవిఎస్వో శ్రీ సురేంద్ర‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.