NO RECOMMENDATION LETTERS FOR VIP DARSHAN ON FRIDAY, SAT AND SUNDAY_ విఐపి బ్రేక్‌ దర్శనాలకు శుక్ర, శని, ఆదివారాలలో సిఫార్సు లేఖలు స్వీకరించబడవు

Tirumala, 13 Jun. 19: TTD today announced that henceforth no Recommendation letters for vIP break darshan at Srivari temple would be accepted for Friday, Saturday and Sundays.

TTD said in a statement that in view of summer rush of devotees it had made a blanket ban on the sale of VIP darshan Tickets on recommendation letters from April 15-July 15 including Saturday and Sundays and on,y Protocol VIPS were entertained.

TTD has appealed to devotees to cooperate and note that such VIP
Darshan tickets would not be issued henceforth on Friday, Saturdays, Sundays henceforth.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

విఐపి బ్రేక్‌ దర్శనాలకు శుక్ర, శని, ఆదివారాలలో సిఫార్సు లేఖలు స్వీకరించబడవు

భక్తులకు విజ్ఞప్తి

జూన్‌ 13, తిరుమల, 2019: గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు శ్రీవారికి నిర్వహించే అభిషేకం ఇతర సేవల కారణాల వలన సంవత్సరం పొడవునా ప్రతి శుక్రవారం రోజున విఐపి బ్రేక్‌ దర్శనాలు ప్రొటోకాల్‌ పరిధిలోని ప్రముఖులకే పరిమితం చేయడమైనది. ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు.

అదేవిధంగా, గతంలో నిర్ణయించిన మేరకు వేసవి రద్దీ దృష్ఠ్యా ఏప్రిల్‌ 15 నుండి జూలై 15వ తేది వరకు శని, ఆదివారాలలో కూడా విఐపి బ్రేక్‌ దర్శనాలను ప్రొటోకాల్‌ పరిధిలోని విఐపిలకు మాత్రమే పరిమితం చేయడమైనది. ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. కావున విఐపిలు మరియు భక్తులు ఈ విషయాన్ని గమనించి టిటిడికి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.