MAHA SHANTI ABHISHEKAM AT SRI KVT SRINIVASA MANGAPURAM_ శ్రీనివాసమంగాపురంలో వేడుకగా మహాశాంతి తిరుమంజనం
Srinivasa Mangapuram, 12 Jun. 19: The sacred event of Maha Shanti abhisekam was performed at the Sri Kalyana Venkateswara Temple of Srinivasa Mangapuram as part of Astabandhana Balalaya Maha samprokshanam ritual on Wednesday evening.
The ritviks and TTD archakas performed Pancha gavyadhivasam, kshuradhivasam, jalasdhivasam and Nava kalasha snanam. Later on they traditionally conducted Viswaksenaradhana, Punya havachanam, Agni Pranayam, prashana kumbharadhana ,lepta homas.
Thereafter they executed Maha Shanti Homa and performed abhisekam to the main idol with the holy water of Maha Shanti Kumbha and also to all galaxy of god’s within the complex.
Tomorrow June 13, the Maha samprokshanam event will be conducted on the karkataka lagnam after Purnahuti and Padma Pradakshina rituals. Later on, the unjal seva and Pedda Sesha vahanam will also be conducted signalling the conclusion of the ancient custom of Maha samprokshanam.
TTD EO Sri Anil Kumar Singhal, JEO Sri KS Sreenivasa Raju, DyEO Sri Dhananjayulu, Vaikhanasa Agama advisor Sri Sundara Varada Bhattacharya, Sri Mohan Rangacharyulu, Sri Ananta Shahana Dikshitulu, Chief kankana bhattar Sri Sitaramacharyulu, AEO Sri Lakshmaiah, Chief Archaka Sri Balaji Rangacharyulu,Superintendent Sri Chengalrayudu, Sri Ramanaiah, Temple inspector Sri Anil and others participated.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీనివాసమంగాపురంలో వేడుకగా మహాశాంతి తిరుమంజనం
తిరుపతి, 2019 జూన్ 12: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో బుధవారం సాయంత్రం 3.30 నుండి 5 గంటల వరకు మూలవర్లకు మహాశాంతి అభిషేకం వేడుకగా జరిగింది.
ఈ సందర్భంగా పంచగవ్యాధివాసం, క్షీరాధివాసం, జలాధివాసం, నవకలశ స్నపనం చేపట్టారు. అనంతరం యాగశాలలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి సమక్షంలో విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, అగ్నిప్రణయనం, ప్రధాన కుంభారాధన, లుప్తహోమాది క్రతువులను సంప్రదాయబద్ధంగా పూర్తి చేశారు. మహాశాంతి హోమాలు నిర్వహించారు. మహాశాంతి కుంభాన్ని యాగశాల నుండి వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా తీసుకెళ్లి పవిత్రజలంతో మూలమూర్తికి అభిషేకం చేశారు. ఆ తరువాత జయవిజయులు, గరుడాళ్వార్, ధ్వజస్తంభం, ఆంజనేయస్వామివారు, యాగశాలలోని ఉత్సవమూర్తులు, విమానగోపురానికి మహాశాంతి అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్, తిరుమల జెఈవో శ్రీ కెఎస్.శ్రీనివాసరాజు పాల్గొన్నారు.
జూన్ 13న మహాసంప్రోక్షణ :
జూన్ 13న గురువారం ఉదయం 5 నుండి 7 గంటల వరకు పూర్ణాహుతి, పద్మప్రదక్షిణం, ఉదయం 7.30 నుండి 9 గంటల వరకు కర్కాటక లగ్నంలో మహాసంప్రోక్షణ నిర్వహిస్తారు. ఆ తరువాత సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు ఊంజల్‌సేవ, రాత్రి 7 నుండి 8 గంటల వరకు పెద్దశేషవాహన సేవ జరుగనున్నాయి.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ ధనంజయులు, వైఖానస ఆగమ సలహాదారులు శ్రీ సుందరవరద భట్టాచార్యులు, శ్రీ మోహన రంగాచార్యులు, శ్రీ అనంతశయన దీక్షితులు, ప్రధాన కంకణబట్టార్ శ్రీ సీతారామాచార్యులు, ఏఈవో శ్రీ లక్ష్మయ్య, ఆలయ ప్రధానార్చకులు శ్రీ బాలాజి రంగాచార్యులు, సూపరింటెండెంట్లు శ్రీ చెంగల్రాయులు, శ్రీ రమణయ్య, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ అనిల్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.