MAHA TOURISM MINISTER OFFERS DOCUMENTS OF LAND TO TTD _ న‌వీ మంబైలో శ్రీ‌వారి ఆల‌య నిర్మాణ‌ భూమి పత్రాలను టీటీడీకి అందించిన మ‌హారాష్ట్ర మంత్రి

RAYMOND LIMITED TO CONSTRUCT THE SV TEMPLE IN NAVI MUMBAI

 TIRUMALA, 30 APRIL 2022: On behalf of the state government of Maharashtra, the Honourable Minister of Tourism of Maharashtra Sri Aditya Thackeray handed over the documents of the land donated by the Maha government to TTD towards the construction of Sri Venkateswara Swamy temple at Navi Mumbai in Maharastra.

The Maha Minister presented the documents to TTD Trust Board Chairman Sri YV Subba Reddy in the presence of TTD EO Dr KS Jawahar Reddy, all other board members and TTD mandarins at Annamaiah Bhavan in Tirumala before the beginning of the Board Meeting on Saturday.

Sri Sanjiv Sarin, the Vice-President of Raymond limited has assured on behalf of the Chairman and MD of Raymond Group Sri Gautam Singhania, that they will bear the entire cost towards the construction of the temple.

TTD Chairman has felicitated Sri Aditya Thackeray and Sri Sanjiv Sarin on the occasion. He thanked the Maharashtra Government for their kind gesture to allot 10acres of land at Ulwe in Navi Mumbai. The TTD Board Chief also thanked the largesse of the Raymond Chief Sri Singhania for coming forward to bear the entire cost towards the construction of Sri Venkateswara temple.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI 

న‌వీ మంబైలో శ్రీ‌వారి ఆల‌య నిర్మాణ‌ భూమి పత్రాలను టీటీడీకి అందించిన మ‌హారాష్ట్ర మంత్రి

ముంబైలో శ్రీ‌వారి ఆలయాన్ని నిర్మించడానికి ముందుకు వ‌చ్చిన రేమండ్ సంస్థ‌

తిరుమ‌ల‌, 2022 ఏప్రిల్ 30: మహారాష్ట్రలోని నవీ ముంబైలో శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయ నిర్మాణానికి మహారాష్ట్ర‌ ప్రభుత్వం విరాళంగా ఇచ్చిన భూమికి సంబంధించిన పత్రాలను మహారాష్ట్ర ప్ర‌భుత్వం తరపున ఆ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ ఆదిత్య ఠాక్రే టీటీడీకి భూమి పత్రాలను అందజేశారు.

తిరుమలలోని అన్నమయ్య భవనంలో శనివారం ఉద‌యం బోర్డు మీటింగ్‌ ప్రారంభానికి ముందు చైర్మన్‌ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి, ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి, బోర్డు స‌భ్యులు, టీటీడీ ఉన్నతాధికారుల స‌మ‌క్షంలో మ‌హారాష్ట్ర మంత్రి పత్రాలను అందించారు.

రేమండ్ గ్రూప్ చైర్మన్ మరియు ఎండి శ్రీ గౌతమ్ సింఘానియా తరపున, రేమండ్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ సంజీవ్ సరిన్ ఆలయ నిర్మాణానికి అయ్యే మొత్తం ఖర్చును తామే భరిస్తామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా శ్రీ ఆదిత్య ఠాక్రే, శ్రీ సంజీవ్ సారిన్‌లను టీటీడీ చైర్మన్ సత్కరించారు. నవీ ముంబయిలోని ఉల్వేలో 10 ఎకరాల భూమిని కేటాయించినందుకు మహారాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. శ్రీవారి ఆలయ నిర్మాణానికి అయ్యే మొత్తం ఖర్చును భరించేందుకు ముందుకు వచ్చినందుకు రేమండ్ గ్రూప్ చైర్మన్‌కు శ్రీ గౌతమ్ సింఘానియాకు టీటీడీ చైర్మ‌న్ కృతజ్ఞతలు తెలిపారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది