MALAYAPPA BACK IN HIS GOLDEN ARMOUR TO BLESS DEVOTEES _ స్వర్ణ కవచంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు
JYESTABHISHEKAM CONCLUDES
TIRUMALA, 14 JUNE 2022: After musing the devotees in Vajra Kavacham and Mutyapu Kavacham on June 12 and 13, Sri Malayappa Swamy was seen back in His popular Swarna Kavacham on Tuesday evening.
Earlier during the day, Snapana Tirumanjanam to the processional deities of Sri Malayappa Swamy, Sridevi and Bhudevi was taken place in Tirumala temple.
The Swarna Kavacham which was removed on June 11 was adorned back to Sri Malayappa. He will be in the same golden armour the entire year till next Jyestabhishekam.
Both the Senior and Junior Pontiffs of Tirumala, TTD EO Sri AV Dharma Reddy, Temple DyEO Sri Ramesh Babu and others were present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీవారి ఆలయంలో ముగిసిన జ్యేష్టాభిషేకం
– స్వర్ణ కవచంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు
తిరుమల, 2022 జూన్ 14: తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన జ్యేష్టాభిషేకం మంగళవారం ఘనంగా ముగిసింది. చివరిరోజు ఉభయదేవేరులతో కలిసి శ్రీమలయప్పస్వామివారు బంగారు కవచంలో పునర్దర్శనమిచ్చారు. మళ్లీ జ్యేష్టాభిషేకం వరకు సంవత్సరం పొడవునా స్వామి, అమ్మవార్లు ఈ బంగారు కవచంతో ఉంటారు.
ఈ సందర్భంగా ఉదయం శ్రీ మలయప్పస్వామివారు ఉభయనాంచారులతో కలిసి శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారానికి వేంచేపు చేశారు. ఆలయ అర్చకులు, వేదపారాయణదారులు శాస్త్రోక్తంగా మహాశాంతి హోమం నిర్వహించారు. శ్రీమలయప్ప స్వామివారికి, దేవేరులకు శతకలశ తిరుమంజనం చేపట్టారు. అనంతరం స్వర్ణ కవచాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి స్వర్ణ కవచ సమర్పణ వేడుకగా జరిగింది. సహస్రదీపాలంకరణ సేవ అనంతరం స్వామి, అమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.