MALAYAPPA RIDES FLOAT ON DAY 3 _ తెప్పపై శ్రీ‌దేవి భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారి క‌టాక్షం

Tirumala, 26 Mar. 21: On the third day of the ongoing annual float festival of the Srivari temple, the utsava idols of Sri Malayappa and His consorts Sridevi and Bhudevi took the majestic float ride on the fresh and serene waters of Swami Pushkarini in total adherence to COVID-19 guidelines.

On the colourfully decorated float with flowers and electrical lighting, the deities went three rounds and enthralled the devotees. 

TTD organised Veda Gosha by pundits, Mangala vaidyam and sankeetans by the artists of Annamacharya project at Swami Pushkarini on the celestial occasion.

Tirumala senior pontiff Sri Sri Sri Pedda Jeeyarswamy, Additional EO Sri AV Dharma Reddy, TTD board member Sri DP Ananta and Sri Chippagiri Vara Prasad, CE Sri Ramesh Reddy were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI 

తెప్పపై శ్రీ‌దేవి భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారి క‌టాక్షం

తిరుమల, 2021 మార్చి 26: తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల్లో మూడో రోజు శుక్ర‌వారం రాత్రి తెప్పపై శ్రీ‌దేవి భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు భక్తులకు అభయమిచ్చారు. కోవిడ్‌-19 నిబంధ‌న‌లు పాటిస్తూ పుష్క‌రిణిలో తెప్పోత్స‌వాలు నిర్వ‌హించారు.

ముందుగా సాయంత్రం 6 గంటలకు తెప్పపై శ్రీ‌దేవి భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారి ఉత్సవమూర్తుల ఊరేగింపు మొదలైంది. ఆలయ నాలుగు మాడ వీధుల గుండా పుష్కరిణి వద్దకు చేరుకుంది. మూడో రోజు స్వామి, అమ్మవార్లు మూడు చుట్లు తిరిగి భక్తులను అనుగ్రహించారు. మంగళవాయిద్యం‌, వేదపండితుల వేదఘోష, అన్నమాచార్య ప్రాజెక్టు సంకీర్తనల మధ్య తెప్పోత్సవం కనువిందుగా జరిగింది.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి, బోర్డు సభ్యులు శ్రీ సి.ప్రసాద్, సిఇ శ్రీ ర‌మేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.