MALAYAPPA WHIRLS ON ASWA VAHANA IN KALKI ALANKARAM _ అశ్వవాహనంపై అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు

Tirumala, 14 October 2021:  On the penultimate day of ongoing Srivari Annual Brahmotsavam, Sri Malayappa whirled on Aswa vahana in Kalki alankaram on Thursday evening at the kalyan Mandapam inside Srivari temple.

The Chief Justice of India justice NV Ramana accompanied by Supreme Court justice Hima Kohli, AP high court Chief Justice Prashant Kumar Mishra, high court judges Justice Lalita Kumari and Justice Satyanarayana Murthy participated in the Srivari Vahana Seva.

The Lord as Kalki on the aswa vehicle signified the completion of Eight-day vahana sevas during nine-day brahmotsavams. The Kalki avatar of Lord Venkateswara is hailed as the most significant in the celestial lore’s of Malayappa. The Horse (Aswa) is described as the only living witness to the first meeting of Venkateswara and his consort Padmavati, their romance and finally culmination in love and wedding.

The Krishna Yajurveda described Almighty as a ‘Ashwa rupa“. Thus the Aswa Vahanam of Lord Venkateswara is denoted as a message for every one to distance from Kali-dosha’s and observe continuous pray and sing the keertans to ward off the impact of wrong doings.

On the final day of Srivari Brahmotsavam, Friday Snapana thirumanjanam and chakra snanam is performed at the Ayina mahal in the morning between08.00- 11.00am.Later in the evening Bangaru Tiruchi procession followed by Dwajavarohanam will be observed inside the Srivari temple.

Tirumala pontiffs, Sri Sri Sri Pedda Jeeyarswamy and Sri Sri Sri Chinna Jeeyarswamy, AP assembly Deputy speaker Sri Kona Raghupati, TTD EO Dr KS Jawahar Reddy, TTD Board members Smt Prashanti Reddy, Sri AP Nanda Kumar, Additional EO Sri AV Dharma Reddy, CVSO Sri Gopinath Jatti, VGO Sri Bali Reddy, Temple DyEO Sri Ramesh Babu and others were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

2021 శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలు

అశ్వవాహనంపై అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు

వాహ‌న‌సేవ‌లో పాల్గొన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

తిరుమల, 2021 అక్టోబ‌రు 14: శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజైన గురువారం రాత్రి 7 గంట‌ల‌కు శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణోత్స‌వ మండ‌పంలో శ్రీమలయప్పస్వామి వారు క‌ల్కి అలంకారంలో అశ్వ వాహ‌నంపై దర్శనమిచ్చారు.

ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు. పరమాత్మను అశ్వ స్వరూపంగా కృష్ణయజుర్వేదం తెలియజేసింది. స్వామి అశ్వవాహనాదిరూఢుడై కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తూ కలిదోషాలకు దూరంగా ఉండాలని నామ సంకీర్తనాదులను ఆశ్రయించి తరించాలని ప్రబోధిస్తున్నాడు.

శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న సిజె :

వాహ‌న‌సేవ అనంత‌రం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌.వి.ర‌మ‌ణ శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నారు.

ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ హిమా కోహ్లీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి శ్రీ ప్ర‌శాంత్ కుమార్ మిశ్రా, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ల‌లిత‌కుమారి, జస్టిస్ స‌త్య‌నారాయ‌ణ మూర్తి, ఛత్తీస్ ఘడ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పార్త్ ప్రతీం సాహు, కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.సోమరజన్, శాసనసభ ఉప సభాపతి శ్రీ కోన రఘుపతి, టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో డాక్ట‌ర్‌ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి దంప‌తులు, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి దంప‌తులు, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి దంపతులు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

శ్రీవారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాల్లో చివ‌రి రోజైన శుక్ర‌వారం ఉద‌యం 8 నుండి 11 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌వారి ఆల‌యంలోని ఐనా మ‌హ‌ల్ వ‌ద్ద‌ స్న‌ప‌న తిరుమంజ‌నం, చ‌క్ర‌స్నానం నిర్వ‌హిస్తారు. రాత్రి 7 గంట‌లకు ఆల‌యంలో బంగారు తిరుచ్చి ఉత్స‌వం, రాత్రి 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు ధ్వ‌జావ‌రోహ‌ణం జ‌రుగ‌నుంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.