MANA GUDI PROGRAMS IN KARTIKA MONTH BY TTD _ నవంబరు 11 నుండి 17వ తేది వరకు తెలుగు రాష్ట్రాల్లో ‘మన గుడి’ కార్తీక మాస కార్యక్రమాలు
Tirupati, 05 November 2024: TTD will celebrate the Mana Gudi program from November 11 to 17 in selected Siva temples in Andhra Pradesh and Telangana states under the auspices of its Hindu Dharma Prachara Parishad (HDPP) wing.
As part of this, religious discourses on the importance of Kartika month will be held for 7 days in 26 districts of AP and 33 districts of Telangana, in one Siva temple in each district.
On November 13, in connection with Kaisika Dwadasi, Two temples will be selected in each district and special programs will be conducted.
Karthika Deepotsavam program will be organized on November 15 in the selected Lord Siva temples in these two districts.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
నవంబరు 11 నుండి 17వ తేది వరకు తెలుగు రాష్ట్రాల్లో ‘మన గుడి’ కార్తీక మాస కార్యక్రమాలు
తిరుపతి, 2024 నవంబరు 05: పవిత్రమైన కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నవంబరు 11 నుండి 17వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎంపిక చేసిన శివాలయాల్లో మనగుడి కార్యక్రమం జరుగనుంది.
ఇందులో భాగంగా ఏపీలోని 26 జిల్లాలు, తెలంగాణలోని 33 జిల్లాల్లో జిల్లాకు ఒకటి చొప్పున ఎంపిక చేసిన శివాలయాల‌్లో 7 రోజుల పాటు కార్తీకమాస విశిష్టతపై ధార్మికోపన్యాసాలు నిర్వహిస్తారు.
ఒక్కో జిల్లాలో 2 చొప్పున ఆలయాలను ఎంపిక చేసి నవంబరు 13న కైశిక ద్వాదశి పర్వదిన కార్యక్రమాలు నిర్వహిస్తారు.
జిల్లాకు ఒకటి చొప్పున ఎంపిక చేసిన శివాలయాల్లో నవంబరు 15న కార్తీక దీపోత్సవం కార్యక్రమం చేపడతారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.