MOCK HUNT FESTIVAL OBSERVED_ ఘనంగా శ్రీమలయప్పస్వామివారి పార్వేట ఉత్సవం

Tirumala, 19 October 2018: It was all fun and frolic that pervaded at the ancient Paruveta Mandapam on Friday where the Sri Malayappa was taken out on a hunting safari.

The hunting expedition, is usually observed on Kanuma festival every year. As the Navarathri Brahmotsavams occur in Adhika Masa, this mock hunt festival is observed on the immediate day after the conclusion of the annual fete.

Paruveta Mandapam situated near Gogarbham dam about two kilometres from the temple. Thousands of devotees took part in the mock hunting jubilations organised in connection with the Kanuma festival.

The processional deity of Lord Malayappa dressed in the royal robes of a King hunter was taken out to the venue in a grand procession which passed through the thick woods. The deity was equipped panchayudhas includ Gada, Khadga, Sankhu, Chakra and Bana befitting the occasion.

The priests threw silver spear was thrown at a wild beast tied to the bushesas if the Lord is hunting them. The pilgrims thoroughly enjoyed the fete. Later the Lord returned to the temple.

TTD Chairman Sri Putta Sudhakar Yadav, Temple DyEO Sri Haridranath, Peishkar Sri Ramesh, Parpathyedar Sri Ramachandra and devotees took part.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఘనంగా శ్రీమలయప్పస్వామివారి పార్వేట ఉత్సవం

తిరుమల, 19 అక్టోబరు 2018: తిరుమలలో శ్రీమలయప్పస్వామివారి పార్వేట ఉత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. పార్వేట ఉత్సవం సాధారణంగా మకర సంక్రాంతి మరుసటిరోజైన కనుమ పండుగనాడు జరుగుతుంది. అధికమాసం కారణంగా నిర్వహించే శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల మరుసటిరోజు కూడా ఈ ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ.

ఈ సందర్భంగా శ్రీవారికి ప్రాతఃకాలారాధన పూర్తి అయిన తరువాత శ్రీమలయప్పస్వామివారు తిరుచ్చిపై తిరుమలలోని పాపవినాశన మార్గంలో గల పార్వేట మండపానికి ఊరేగింపుగా చేరుకున్నారు. శ్రీవారికి ఆరాధన, నివేదన, హారతుల తరువాత ఉభయదార్లకు తాళ్ళపాకవారికి, మఠంవారికి మర్యాదలు చేశారు. శ్రీమలయప్పస్వామివారి తరపున అర్చకులు వెండి ఈటె వేసి కొంతదూరం ముందుకెళ్లి తిరిగి వెనక్కు వచ్చారు. ఇలా మూడుసార్లు జరిగింది. దుష్టులను శిక్షించి భక్తులను రక్షించడమే ఈ పారువేట అంతరార్థం. ఆ తరువాత శ్రీమలయప్పస్వామివారు పార్వేట మండపం నుంచి మహాద్వారానికి వచ్చి హతీరాంజీవారి బెత్తాన్ని తీసుకొని సన్నిధికి వేంచేయడంతో పారువేట ఉత్సవం ముగిసింది.

ఈ కార్యక్రమంలో త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీ అజయ్‌ రాస్తాగి, టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పుట్టా సుధాకర్‌ యాదవ్‌, ఆలయ డెప్యూటీి ఈవో శ్రీ హరీంద్రనాధ్‌, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.