TTD CHAIRMAN INSPECTS GODOWN IN TIRUPATI_ టిటిడి గోడౌన్‌ను పరిశీలించిన ఛైర్మెన్‌ శ్రీ పుట్టా సుధాకర్‌ యాదవ్‌

Tirupati, 19 October 2018: TTD Chairman Sri P Sudhakar Yadav on Friday inspected the TTD Godown in Tirupati.

He personally verified the stocks of various ingredientele used for making Prasadam including dry grapes, cashew, almonds, Cardamom, rice, jaggery, BG dal etc.in the godown.

Later he instructed the officials concerned to install CC cameras in all the vital places in godown. The chairman also checked the quality of ingredients, accuracy of measuring equipment etc.

Marketing General Manager Sri Jagadeahwar Reddy, DyEO Sri Venkataiah, VGO Sri Ashok Kumar Goud were also present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టిటిడి గోడౌన్‌ను పరిశీలించిన ఛైర్మెన్‌ శ్రీ పుట్టా సుధాకర్‌ యాదవ్‌

తిరుపతి, 2018 అక్టోబరు 19: శ్రీవారి భక్తులకు పంపిణీ చేసే ప్రసాదాలలో ఉపయోగించే ముడి సరుకులను టిటిడి ఛైర్మెన్‌ శ్రీ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ పరిశీలించారు. తిరుపతిలోని టిటిడి మార్కెటింగ్‌ గోడౌన్‌లో

శుక్రవారం ఉదయం అధికారులతో కలిసి ఛైర్మన్‌ తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఛైర్మెన్‌ మీడియాతో మాట్లాడుతూ స్వామివారి ప్రసాదాలకు ఉపయోగించే ముడిసరుకుల ఎంపిక, ఏజెన్సీ ఖరారు, ప్రయోగశాలలో వంటసామాగ్రి నాణ్యతా ప్రమాణాల పరిశీలన తదితర అంశాలన్నింటిని పరిగణలోకి తీసుకుంటారని తెలిపారు. ఆ తర్వాత టిటిడిలో ఉన్న నిబంధనల ప్రకారము టెండర్ల ద్వారా సేకరించి గోడౌన్‌లో నిల్వ ఉంచుతామన్నారు. గోడౌన్‌లో ఉన్న ముడి సరుకులు ఎలా ఉంది, తూనికలు, కొలతలు సక్రమంగా ఉన్నాయా, నాణ్యత తదితర అంశాలను పరిశీలించామన్నారు. బియ్యం, అందుకు ఉపయోగించే బ్యాగ్‌ బరువును పరిశీలించానని, టిటిడి నిబంధనల ప్రకారం తూనికలు పాటించారన్నారు. ఇటీవల మీడియాలో ముడి సరుకుల తూనికలు, కొలతలపై వచ్చిన వార్తలలో వాస్తవం లేదన్నారు. గోడౌన్‌ చుట్టూ అవసరమైన ప్రాంతాలలో సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని, టిటిడి రెగ్యులర్‌ భద్రత సిబ్బందిని సెక్యూరిటీకి ఉపయోగించాలని తిరుపతి విజీవో శ్రీ అశోక్‌ కుమార్‌ గౌడ్‌ను ఆదేశించారు. ముందుగా జీడిపప్పు, ద్రాక్ష, బియ్యం, చక్కెర, కలకండ, చింతపండు, బెల్లం, టెంకాయలు, ఉద్దిపప్పు, ఇతర పప్పు ధాన్యాలను ఆయన పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో మార్కెటింగ్‌ జనరల్‌ మేనేజర్‌ శ్రీ జగదీశ్వర్‌ రెడ్డి, మార్కెటింగ్‌ శాఖ అధికారులు శ్రీ నాగరాజ, శ్రీ వెంకటముని, ఏవిఎస్‌వో శ్రీ సురేంద్ర ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.