MOHINI AVATARAM MESMERIZES DEVOTEES _ పల్లకిపై మోహిని అలంకారంలో కోదండరాముడు
VONTIMITTA, 14 APRIL 2022: On the fifth day morning, Sri Kodanda Rama Swamy decked as Universal Damsel, Mohini, blessed devotees as part of the ongoing annual Brahmotsavam at Vontimitta in YSR Kadapa District on Thursday.
The devotees were thrilled to see the bejewelled Mohini Avataram.
In the evening Sri Kodanda Rama will take ride on Garuda Vahana.
Temple officials were present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
పల్లకిపై మోహిని అలంకారంలో కోదండరాముడు
తిరుపతి, 2022 ఏప్రిల్ 14: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు గురువారం ఉదయం మోహిని అలంకారంలో శ్రీరామచంద్రుడు పల్లకిలో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు వాహనసేవ వైభవంగా జరిగింది. భజన బృందాలు కోలాటాలు ఆడుతుండగా స్వామివారు నాలుగు మాడవీధుల్లో విహరించారు. భక్తులు అడుగడుగునా కర్పూర నీరాజనాలు అందించారు.
మోహిని అవతార వృత్తాంతం భాగవతంలో రమణీయంగా వర్ణింపబడింది. సురాసురులు అమృతానికై క్షీరసాగరాన్ని మథిస్తారు. చివరికి వారు కోరుకున్న అమృతం లభిస్తుంది. దానిని పంచుకోవడంలో కలహం తప్పదు. ఆ కలహాన్ని నివారించి, అసురులను వంచించి, సురులకు అమృతాన్ని పంచడానికి శ్రీహరి మోహిని రూపంతో సాక్షాత్కరిస్తారు. తనకు భక్తులు కానివారు ఆ మాయాధీసులు కాక తప్పదనీ, తనకు ప్రసన్నులైనవారు మాయను సులభంగా దాటగలరని స్వామి వారు మోహిని రూపంలో ప్రకటిస్తున్నారు.
వాహన సేవ అనంతరం ఉదయం 11 నుండిమధ్యాహ్నం 12 గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీళ్లతో సీతాలక్ష్మణ సమేత శ్రీకోదండరాములవారి ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు. రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు గరుడసేవ అత్యంత వేడుకగా జరగనుంది.
వాహనసేవలో డెప్యూటీ ఈవో శ్రీ రమణప్రసాద్, ఏఈవో శ్రీ సుబ్రహ్మణ్యం, సూపరింటెండెంట్ శ్రీ పి.వెంకటేశయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ధనుంజయ, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.