MORE FOCUS ON PILGRIM INITIATIVES _ టిటిడి కార్యనిర్వహణాధికారి గారి గణతంత్ర దినోత్సవ ప్రసంగం

IMPECCABLE SERVICES BY BIRRD AND SPCHC 

CANCER HOSPITAL TO COME UP SOON-TTD EO

TIRUPATI, 26 JANUARY 2023: After recalling the great sacrifices made by the freedom fighters on the occasion of the 74th Republic Day, TTD EO Sri AV Dharma Reddy said TTD is committed to carry out more and more pilgrim initiatives with great enthusiasm in future also.

The R-Day celebrations were observed with a great patriotic fervour in TTD Administrative Building Parade Grounds on Thursday. After hoisting the National Flag and rendering Salute, the EO listed out a few important projects which were completed and under pipeline during his R-Day speech. Some excerpts:

We have successfully carried out the Vaikuntha Dwara Darshanam for ten days providing Dwara Darshanam to over 6lakhs. Besides over 9700 devotees belonging to 197 backward areas were also provided the Dwara Darshanam. SSD tokens were successfully distributed and for the first time only Sarva Darshanam pilgrims are allowed.

The change in the VIP break darshan timings from December 1 onwards is yielding good results avoiding long waiting hours for common pilgrims and this system will be continued for two more months under trial-basis.

All arrangements are in place for Radhasapthami on January 28.

New Parakamani building will come into utility from February onwards.

World Class SV Museum and Modernisation of Laddu are also under way.

QR code which was successfully implemented in Srivari Seva for the sake of Srivari Sevakulu as a guide map to their service points will be implemented soon at all Reception offices for guiding the pilgrims also.

2068 temples in SC, ST, BC and fishermen colonies are under different stages of construction across the state under the funds of SRIVANI Trust. Another 150 ancient temples are also under renovation.

The cochlear, cleft palate surgeries in BIRRD and the 1000 successful heart surgeries in Sri Padmavathi Childrens’ Health Centre are milestones in the medical services of TTD in recent times. A new Cancer Hospital is also underway which will be inaugurated this Dasara.

To meet the needs of the ever increasing pilgrim crowd to Tirumala, apart from MTVAC, mini Annaprasadams are also being operated.

The entire accommodation in Tirumala is spruced up for the common pilgrims at Rs.132 crores. One more PAC is coming up at Rs.100 crores.  

The prime focus of TTD is to ensure its pilgrims a hassle-free darshan, stay and a memorable pilgrimage experience and our strong workforce is committed to offer dedicated services to pilgrims for ever and ever.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టిటిడి కార్యనిర్వహణాధికారి గారి గణతంత్ర దినోత్సవ ప్రసంగం

తిరుపతి, 26 జనవరి 2023: భారత గణతంత్ర దినోత్సవాన్ని తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టిటిడి ఈవో శ్రీ ఏవి.ధర్మారెడ్డి ప్రసంగించారు. వారి మాటల్లోనే….

ప్రపంచ ప్రఖ్యాత హైందవ ధార్మిక సంస్థ అయిన తిరుమల తిరుపతి దేవస్థానంలో అత్యంత భక్తిశ్రద్ధలతో శ్రీపద్మావతీ వేంకటేశ్వరుల సేవలో తరిస్తున్న ధర్మకర్తల మండలి అధ్యక్షులకు, ధర్మకర్తల మండలికి, అధికార యంత్రాంగానికి, అర్చకులకు, సిబ్బందికి, భద్రతా సిబ్బందికి, విశ్రాంత సిబ్బందికి, శ్రీవారి సేవకులకు, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌కు, భక్తులకు మరియు మీడియా మిత్రులకు 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడిన మహనీయులందరినీ మరోసారి స్మరించుకోవడం మనందరి బాధ్యత. ఈ గణతంత్ర పర్వదినం రోజున టిటిడి భక్తులకు చేస్తున్న అనేక సేవలను తెలియజేస్తున్నాను.

శ్రీవారి ఆలయం :  

– తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు టిటిడి నిర్వహణలోని అన్ని ఆలయాలలో జీయంగార్లు, ఇతర ప్రముఖ ఆగమశాస్త్ర పండితుల సలహాల మేరకు నిత్యకైంకర్యాలను ఆగమోక్తంగా నిర్వహిస్తున్నాం.

– వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 2 నుండి 11వ తేదీ వరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వారం తెరిచి సుమారు 6.06 లక్షల మంది భక్తులకు దర్శనభాగ్యం కల్పించాం.

– వైకుంఠ ద్వార దర్శనానికి రాష్ట్రవ్యాప్తంగా 197 ఎస్‌సి, ఎస్‌టి, బిసి గ్రామాల నుంచి 9700 మందికి దర్శనభాగ్యం కల్పించాం. వీరందరికి ఉచిత రవాణా, వసతి, ఆహారం అందించాం.

సర్వదర్శనం టైంస్లాట్‌ టోకెన్లు

– శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులు క్యూ లైన్లలో కిలోమీటర్ల దూరం చలిలో వేచి ఉండి ఇబ్బంది పడకుండా ఉండటం కోసం తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్‌, శ్రీనివాసం కాంప్లెక్స్‌, గోవిందరాజస్వామి సత్రాల వద్ద నవంబరు 1 నుండి సర్వదర్శనం టైంస్లాట్‌ టోకెన్ల జారీ కేంద్రాలు నిర్వహిస్తున్నాం.

– దీనివల్ల భక్తులు తిరుపతిలో టోకెన్‌ తీసుకుని వారికి కేటాయించిన సమయానికి తిరుమలకు చేరుకుని, సత్వరమే దర్శనం చేసుకునేందుకు ఈ విధానం ఉత్తమమైనదిగా భావించాం.

డిసెంబరు 1 నుండి బ్రేక్‌ దర్శన సమయం మార్పు

– శ్రీవారి దర్శనార్థం కంపార్ట్‌మెంట్లలో రాత్రి వేళ వేచి ఉండే సామాన్య భక్తులకు నిరీక్షణ సమయం తగ్గించేందుకు, ఉదయం త్వరగా దర్శనం కల్పించేందుకు వీలుగా డిసెంబరు 1వ తేదీ నుండి విఐపి బ్రేక్‌ దర్శన సమయాన్ని ఉదయం 5.30 నుండి 8 గంటలకు మార్పు చేసి ప్రయోగాత్మకంగా అమలుచేస్తున్నాం. భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధానం విజయవంతంగా అమలు జరుగుతుండటంతో మరో రెండు నెలలు పరిశీలించాక తుది నిర్ణయం తీసుకుంటాం.

రథసప్తమికి విస్తృత ఏర్పాట్లు :

– జనవరి 28న తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేశాం.

– ఈ సందర్భంగా శ్రీ మలయప్పస్వామివారు ఒకేరోజు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమంత, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై ఆలయ మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు.

– వాహనసేవలను వీక్షించేందుకు మాడ వీధుల్లోని గ్యాలరీల్లో వేచి ఉండే భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు, తాగునీరు, కాఫీ, టీ, పాలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది.

– నాలుగు మాడవీధుల్లో ఎండవేడి తగలకుండా అక్కడక్కడ షెల్టర్లు ఏర్పాటు చేస్తున్నాం.

ఎస్వీ మ్యూజియం

– టాటా సంస్థ విరాళంగా అందించిన రూ.120 కోట్లతో తిరుమలలోని ఎస్వీ మ్యూజియాన్ని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నాం. ఇందులో శ్రీవారి ఆభరణాల 3డి ఇమేజితోపాటు ఇతర కళాఖండాలను ప్రదర్శిస్తాం.

నూతన పరకామణి

– శ్రీ మురళీకృష్ణ అనే దాత సహాయంతో రూ.23 కోట్లతో నిర్మించిన నూతన పరకామణి భవనాన్ని గతేడాది సెప్టెంబరులో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఇతర అభివృద్ధి పనులు పూర్తి చేసి ఫిబ్రవరి మొదటి వారంలో కార్యకలాపాలు ప్రారంభిస్తాం.

లడ్డూప్రసాదం

– శ్రీవారి లడ్డూలను మరింత నాణ్యంగా, ఎక్కువ సంఖ్యలో తయారు చేసేందుకు వీలుగా రిలయన్స్ అధినేత శ్రీ ముఖేష్ అంబానీ విరాళంగా అందించే రూ.50 కోట్లతో నూతన సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాం. ఈ ఏడాది డిసెంబర్ నాటికి నూతన వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తాం.

అరచేతిలో సమాచార దర్శిని

– తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో సేవలందించే శ్రీవారి సేవకులు ఆయా మార్గాలను తెలుసుకునేందుకు వీలుగా రూపొందించిన క్యూఆర్‌ కోడ్‌ విధానం విజయవంతమైంది. భక్తుల కోసం త్వరలో తిరుమలలోని పలు ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తాము.

శ్రీవాణి ట్రస్టు ఆధ్వర్యంలో ఆలయాల నిర్మాణం

– శ్రీవారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేయడంలో భాగంగా శ్రీవాణి ట్రస్టు నిధులతో రాష్ట్రంలోని 26 జిల్లాలతోపాటు తెలంగాణ, పాండిచ్చేరి, కర్ణాటక రాష్ట్రాలతో కలిపి మొత్తం 2,068 ఆలయాల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి.

– సమరసత సేవా ఫౌండేషన్‌ సహకారంతో 2019వ సంవత్సరానికి ముందు 502 ఆలయాల నిర్మాణం జరిగింది. ప్రస్తుతం ఈ ఫౌండేషన్‌ సహకారంతో 320 ఆలయాలు నిర్మిస్తున్నాం.  

– రాష్ట్ర దేవాదాయ శాఖ సౌజన్యంతో వెనుకబడిన ప్రాంతాల్లో 932 ఆలయాల నిర్మాణం జరుగుతోంది.

– రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 150 పురాతన ఆలయాల జీర్ణోద్ధరణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి.

– నిర్మాణం పూర్తయిన ఆలయాలకు హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో భజన సామగ్రి అందజేశాం. ఈ ఆలయాల్లో అర్చకులుగా నియమించే వారికి శ్వేత ఆధ్వర్యంలో నిత్యపూజా విధానంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించాము.

– ఈ ఆలయాల నిర్వహణ, ధూపదీప నైవేద్యాల కోసం ఆర్థిక సాయం అందజేయడం జరుగుతుంది.

శ్రీవాణి ట్రస్ట్‌ దాతలకు మాధవంలో గదులు

– శ్రీవాణి ట్రస్ట్‌ దాతలకు తిరుపతి విమానాశ్రయంలో రోజుకు 250 చొప్పున టికెట్లు ఇస్తున్నాం. వీరికి తిరుపతిలోని మాధవం సముదాయంలో గదులు కేటాయిస్తున్నాము.

సామాన్య భక్తులు బస చేసే గదుల అద్దె పెంచలేదు  :

– తిరుమలలో సుమారు 7,500 గదులు ఉన్నాయి. ఇందులో రూ.50, రూ.100 అద్దె కలిగిన దాదాపు 5 వేల గదులు సామాన్య భక్తులకు కేటాయిస్తున్నాం. వీరు బస చేసే కాటేజిల అద్దె పెంచలేదు. వీటిని రూ.132 కోట్లతో ఆధునీకరించాం. నాలుగు పీఏసీల్లో 15 వేల మందికి బస కల్పిస్తున్నాం. అదేవిధంగా సామాన్య భక్తుల కోసం రూ.100 కోట్లతో పిఏసి-5 నిర్మాణం జరుగుతోంది. ఇందుకు సంబంధించి ప్రసార, ప్రచార, సామాజిక మీడియాల్లో భక్తులకు ఇప్పటికే స్పష్టతను ఇచ్చాం.

శ్రీ పద్మావతి చిన్నపిల్లల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి

– చిన్నపిల్లలకు వచ్చే అనేక వ్యాధులకు ఉచితంగా శస్త్రచికిత్సలు, వైద్యసేవలు అందించడం కోసం రూ.320 కోట్ల వ్యయంతో శ్రీ పద్మావతి చిన్నపిల్లల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి  నిర్మాణం ప్రారంభించాం. వచ్చే ఏడాది ఈ ఆసుపత్రి ప్రారంభించేలా ప్రణాళిక బద్ధంగా పనులు జరుగుతున్నాయి.  

– ప్రస్తుతం ఉన్న చిన్నపిల్లల గుండె చికిత్సల ఆసుపత్రిలో ఇప్పటివరకు 1000కి పైగా  గుండె శస్త్రచికిత్సలు నిర్వహించి పేద పిల్లల ప్రాణాలు కాపాడాం. ఇటీవల ఓ బాలుడికి గుండె మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించామని తెలియజేస్తున్నాను.

రోగుల కోసం బర్డ్‌ ఆసుపత్రిలో మరో 100 పడకలు

– బర్డ్‌ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న మూడు వార్డులను అభివృద్ధి  చేసి  రోగుల కోసం మరో 100 పడకలు అందుబాటులోకి తీసుకొచ్చాము.

– స్మైల్‌ ట్రైన్‌ సంస్థ ద్వారా గ్రహణమొర్రి ఆపరేషన్లు, కాక్లియర్‌ ఇంప్లాంట్‌ ఆపరేషన్లు ప్రారంభించాం.

శ్రీ బాలాజి క్యాన్సర్‌ ఆసుపత్రి నిర్మాణం

– ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశంతో  దేశంలోనే అత్యుత్తమ చికిత్సలు అందించే వసతులతో తిరుపతిలో శ్రీబాలాజి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఆంకాలజి (క్యాన్సర్‌ ఆసుపత్రి) నిర్మిస్తున్నాం. దసరాలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ ఆసుపత్రిని ప్రారంభించేందుకు పనులు జరుగుతున్నాయి.

గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు :

– గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతో తిరుమల శ్రీవారికి నైవేద్యం, ఇతర ప్రసాదాలు తయారుచేసేందుకు వీలుగా 12 రకాల ఉత్పత్తులు సేకరించేందుకు రాష్ట్ర రైతు సాధికార సంస్థ, మార్క్‌ఫెడ్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ప్రకృతి వ్యవసాయ రైతులను ప్రోత్సహించేందుకు  కనీస మద్దతు ధర కంటే ఎక్కువ చెల్లించి కొనుగోలు చేస్తున్నాం.

– తిరుమలలో అన్నప్రసాదాల తయారీకి 2004వ సంవత్సరం నుండి ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి దాదాపు 17 మంది దాతలు రూ.200 కోట్లకుపైగా విలువైన కూరగాయలను విరాళంగా అందించారు. ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించి వారితో ఆర్గానిక్ కూరగాయలు పండించే ప్రయత్నాలు చేస్తున్నాం.

– శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో నిర్మాణంలో ఉన్న ఫీడ్‌ మిక్సింగ్‌ ప్లాంట్‌, నెయ్యి తయారీ కేంద్రం, అగరబత్తుల తయారీ రెండవ యూనిట్‌ను ఫిబ్రవరి 15లోపు అందుబాటులోకి తెచ్చేలా పనులు జరుగుతున్నాయి.

ధర్మరథం ఉచిత బస్సుల స్థానంలో విద్యుత్‌ బస్సులు

– ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డిగారి ఆదేశాల మేరకు తిరుమలను కాలుష్యరహితంగా తీర్చిదిద్ధడానికి ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్నాం. వీటికి అదనంగా ధర్మరథాల(ఉచిత బస్సుల) స్థానంలో విద్యుత్‌ బస్సులు నడిపేందుకు చర్యలు చేపట్టాం. ఇందుకోసం సుమారు రూ.15 కోట్ల విలువ చేసే 10 విద్యుత్‌ బస్సులను విరాళంగా అందించేందుకు ఒలెక్ట్రా సంస్థ ముందుకు వచ్చింది. ఈ బస్సులను ఏప్రిల్ చివరి వారంలో ఈ సంస్థ అందించనుంది.

ఉద్యానవనాలకు పూర్వ వైభవం

– తిరుమలలో భక్తులకు ఆహ్లాదకరంగా ఉద్యానవనాలను అభివృద్ధి చేసి పూర్వ వైభవం తీసుకొస్తున్నాం. ఇప్పటికే దాతల సహకారంతో జిఎన్సి టోల్‌ గేట్‌ వద్ద గల గీతోపదేశం పార్కు, జిఎన్సి నుండి బస్టాండ్‌ వరకు రోడ్డుకు కుడి వైపున గల పార్కు, శంఖుమిట్ట వద్దగల నామాల పార్కు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-1 లోపల, శ్రీ పద్మావతి విశ్రాంతిగృహం వద్ద రంగురంగుల పుష్పాలు, మొక్కలతో చక్కగా పార్కులను అభివృద్ధి చేశాం.

– స్పెషల్‌ టైప్‌, నారాయణగిరిలో ఉద్యానవనాలను పూర్తిగా అభివృద్ధి చేస్తున్నాం. ఈ ఏడాది డిసెంబర్ లోపు తిరుమలలోని ఉద్యానవనాలన్నింటి పనులు పూర్తి చేసి ఇహలోక వైకుంఠంగా తీర్చిదిద్దుతాం.

తిరుమలలో మినీ అన్నప్రసాదం కాంప్లెక్స్‌లు

– తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కేంద్రానికి భక్తుల సంఖ్య భారీగా పెరగడంతో వారి సౌకర్యార్థం తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో మినీ అన్నదానం కాంప్లెక్స్‌లు ఏర్పాటు చేయాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. ఇందులో భాగంగా జనవరి 1న పిఎసి-4 (పాత అన్నదానం కాంప్లెక్స్‌)లో అన్నప్రసాద వితరణ పున:ప్రారంభించాము. శ్రీవారి మెట్టు మార్గంలో కాలినడకన వచ్చే భక్తుల కోసం త్వరలో ఎమ్‌బిసితో పాటు మరికొన్ని ప్రాంతాల్లో మినీ అన్నదానం కాంప్లెక్స్‌లు ప్రారంభించేందుకు ఛైర్మన్ ఆదేశాలతో ఇందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేస్తున్నాం.
 
టీటీడీ ఆస్తులపై శ్వేత పత్రం

– పారదర్శక పాలనలో భాగంగా 2022 సెప్టెంబరు 24వ తేదీ టిటిడికి చెందిన 7,123 ఎకరాల్లో ఉన్న 960 ఆస్తులపై శ్వేతపత్రం ప్రకటించి తుది జాబితాను టిటిడి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాము.

– అలాగే 2022 నవంబరు 5వ తేదీ టీటీడీకి వివిధ బ్యాంకుల్లో ఉన్న 15,938 కోట్ల నగదు, 10,258 కిలోల బంగారం డిపాజిట్లకు సంబంధించిన శ్వేత పత్రం విడుదల చేశాము. 1933లో టీటీడీ ఏర్పడిన నాటి నుంచి ఇలాంటి శ్వేత పత్రం ఎప్పుడు విడుదల చేయలేదు. మొట్టమొదటిసారిగా ఈ ధర్మకర్తల మండలి శ్వేతపత్రం విడుదల చేసింది.

శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌

– సనాతన హిందూ ధర్మాన్ని, శ్రీ వేంకటేశ్వర స్వామివారి వైభవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల ఇళ్లకు చేర్చడానికి గత మూడు సంవత్సరాలుగా శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌ వినూత్న కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేస్తోంది.

– తిరుమల నాదనీరాజనం వేదికపై అఖండ సుందరకాండ పారాయణం, భగవద్గీత పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం, మహా భారతం, యోగ వాశిష్ఠం పారాయణాలు నిర్వహించాం.

– జనవరి 2వ తేదీ నుండి గరుడ పురాణం పారాయణం నిర్వహిస్తున్నాం. భక్తుల నుండి విశేషాదరణ లభిస్తోంది. రాబోవు రోజుల్లో మరిన్ని కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేస్తాం.

– హనుమాన్ జయంతి సందర్భంగా సుందరకాండలోని 2808 శ్లోకాలను అఖండ పారాయణం చేస్తున్నాం.

– తిరుమలలోని ఆకాశగంగ వద్దగల అంజనాద్రిని హనుమంతుని జన్మస్థలంగా గుర్తించాం. ఇక్కడ దాతలు శ్రీ కె.మురళీకృష్ణ, శ్రీ నాగేశ్వరరావు సహకారంతో అభివృద్ధి పనులు చేపడుతున్నాం.

– ప్రతి ఎడాది లాగే గత ఏడాది కూడా కార్తీక మాసం సందర్భంగా నంద్యాల జిల్లా యాగంటి, తిరుపతి, విశాఖపట్నంలో కార్తీక మహా దీపోత్సవాలు ఘనంగా నిర్వహించాం.

– నెల్లూరు, హైదరాబాద్‌లలో శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైభవోత్సవాలను అత్యంత వేడుకగా నిర్వహించాం.

– ఇటీవల కర్ణాటకలోని రామనగరలో శ్రీవారి కల్యాణం నిర్వహించాం. మరో రెండు ప్రాంతాల్లో త్వరలో స్వామివారి కల్యాణాలు నిర్వహిస్తాం.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.