MUTYAPU PANDIRI AT SKVST _ ముత్య‌పుపందిరి వాహనంపై బ‌కాసుర‌వ‌ధ‌ అలంకారంలో శ్రీకల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి

Tirupati, 22 February 2022: As part of ongoing annual Brahmotsavams in Sri Kalyana Venkateswara Swamy temple at Srinivasa Mangapuram, Mutyapu Pandiri Vahanam was observed on Tuesday evening.

 

Sridevi, Bhudevi sameta Sri Kalyana Venkateswara blessed devotees on the pearl canopy held in Ekantam due to Covid guidelines.

 

DyEO Smt Shanti, AEO Sri Gurumurthy, Superintendents Sri Ramanaiah, Sri Chengalrayalu, Archaka Sri Balaji Rangacharyulu were also present.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

ముత్య‌పుపందిరి వాహనంపై బ‌కాసుర‌వ‌ధ‌ అలంకారంలో శ్రీకల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి

తిరుపతి,2022 ఫిబ్రవరి 22: శ్రీనివాసమంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన మంగవారం రాత్రి శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీనివాసుడు బ‌కాసుర‌వ‌ధ‌ అలంకారంలో ముత్య‌పుపందిరి వాహనంపై అభయమిచ్చారు.

స‌క‌ల సౌభాగ్య సిద్ధి

ముత్యాలు నిర్మలకాంతులు వ్యాపించడానికి, ఆ కాంతులు దర్శించి భక్తులు ముక్తులు కావడానికి రాత్రి వేళ అనుకూలం. అందుకే శ్రీమలయప్ప మూడో రోజు రాత్రి ముత్యాల పందిరిలో కూర్చొని విహరించే కైంకర్యాన్నిపెద్దలు నిర్ణయించారు. ముత్యం స్వచ్ఛతకు సంకేతం.
మనిషి శరీరాన్ని ఆధ్యాత్మిక సంపదతో శుద్ధి చేసుకుంటే బుద్ధి ముత్యంలాగా మారి, జనన, మరణచక్రం నుండి విడుదలై మోక్షాన్ని పొందుతుంది. ఇలా స్వామివారికి ప్రీతిపాత్రమైన ముత్యాలహారాలు – రత్నాల వల్ల కలిగే వేడిని, పుష్పాల వల్ల కలిగే సుగంధాన్ని తమలో ఇముడ్చుకుని, స్వామివారి వక్షఃస్థలానికి, అక్కడి లక్ష్మీదేవికి సమశీతోష్ణస్థితిని చేకూరుస్తూ, తాపగుణాన్ని హరిస్తూ, ఉత్సాహాన్ని, ప్రశాంతతను చేకూరుస్తున్నాయి.

ఈ వాహన సేవలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ గురుమూర్తి, సూపరింటెండెంట్లు శ్రీ చెంగ‌ల్రాయులు, శ్రీ రమణయ్య, అర్చ‌కులు శ్రీ బాలాజి రంగాచార్యులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.