HAMASA VAHANAM IN KT _ హంస వాహనంపై శ్రీ సోమస్కంధముర్తి

Tirupati, 22 February 2022: On the first day evening of the annual Brahmotsavams in Sri Kapileswara Swamy temple at Tirupati, Sri Somaskanda Murty blessed devotees on Hamsa Vahanam in Ekantam.

Temple DyEO Sri Subramanyam, AEO Sri Satre Naik, Superintendent Sri Bhupati were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

హంస వాహనంపై శ్రీ సోమస్కంధముర్తి

తిరుపతి, 2022 ఫిబ్రవరి 22: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలలో మొద‌టి రోజు మంగళవారం రాత్రి హంస వాహ‌నంపై శ్రీ సోమస్కంధమూర్తికి, పల్లకీలో శ్రీ కామాక్షి అమ్మ‌వారికి ఆస్థానం నిర్వ‌హించారు. రాత్రి 7 గంటల నుండి ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది. కోవిడ్ -19 నిబంధనల మేరకు ఆల‌యంలో ఏకాంతంగా వాహన సేవలు నిర్వ‌హించారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, ఏఈవో శ్రీ స‌త్రేనాయ‌క్‌, సూపరింటెండెంట్‌ శ్రీ భూప‌తి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ రెడ్డి శేఖ‌ర్‌, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.