NATIONAL LEADERS FESTS ALSO PART OF DHARMA PRACHARA- JEO _ ధర్మప్రచారంలో భాగంగానే మహనీయుల జయంతులు : టిటిడి జెఈవో శ్రీమతి సదా భార్గవి

Tirupati, 11 Apr. 21: The Jayanthi celebrations of some great leaders by TTD is also part of its Dharma Prachara so that the present generation will inculcate and follow the great values taught by them, said Smt Sada Bhargavi, JEO of TTD. 

Addressing the 194th Birth anniversary of Shri Jyoti Rao Phule celebrated by TTD in Mahathi Auditorium at Tirupati on Sunday she said, Phule’s social activism included many fields including eradication of untouchability and the caste system, education to women, Dalits and welfare of downtrodden.

Because of this great service he did to society we have been observing his birth anniversary even after almost 200 years, she pointed.

Earlier the program commenced by offering floral tributes to the photo of Sri Jyothi Rao Phule.

Later renowned scholars Sri Jayaraj, Dr K Koteswara Rao from Govt.CT College and BC Philosopher Sri C Raju, all the three speakers from Hyderabad elucidated the great achievements of Sri Phule fighting against all odds in the society in those days.

JEO felicitated the scholars on the occasion.

Prizes were distributed to the winners who won in the competitions held for the occasion. Communal awards were also given. 

Deputy EO Welfare Sri Anandaraju, PRO Dr T Ravi, BC welfare liaison officer Dr Bharat Gupta were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ధర్మప్రచారంలో భాగంగానే మహనీయుల జయంతులు :  టిటిడి జెఈవో శ్రీమతి సదా భార్గవి

తిరుప‌తి, 2021 ఏప్రిల్ 11: నవభారత నిర్మాణం కోసం పాటుపడ్డ మహనీయుల త్యాగాలను స్మరించుకుని రేపటి తరానికి తెలియజేసేందుకు నిర్వహిస్తున్న ఇలాంటి కార్యక్రమాలు ధర్మ ప్రచారంలో భాగమేనని టిటిడి జెఈవో శ్రీమతి సదా భార్గవి తెలిపారు. మహాత్మా జ్యోతిరావుఫూలే 194వ జయంతిని ఆదివారం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జెఈవో, ఇతర అధికారులు ఫూలే చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించారు. కోవిడ్ -19 నిబంధ‌న‌లు పాటిస్తూ ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన శ్రీమతి సదా భార్గవి మాట్లాడుతూ జ్యోతిరావు ఫూలే మ‌హోన్న‌త వ్య‌క్తిత్వానికి నిద‌ర్శ‌న‌మ‌ని, ఇలాంటి వారి సేవ‌ల‌ను గుర్తుంచుకోవ‌డం కూడా ధ‌ర్మ‌మేన‌న్నారు. దాదాపు 200 ఏళ్లుగా ఫూలే మ‌న‌కు గుర్తున్నార‌ని, వారు ప్ర‌త్యేక జీన‌వ‌శైలి అల‌వ‌ర‌చుకోవ‌డ‌మే దీనికి కార‌ణ‌మ‌ని చెప్పారు. ఇలాంటి వారిని ఆద‌ర్శంగా తీసుకుని ప్ర‌తి ఒక్క‌రూ ప్ర‌త్యేక‌త‌ను అల‌వ‌రుచుకోవాల‌న్నారు. టిటిడి లాంటి ధార్మిక సంస్థ‌లో ప‌ని చేయ‌డం మ‌నంద‌రి పూర్వ‌జ‌న్మ సుకృత‌మ‌ని, ఇక్క‌డ ఉద్యోగులంద‌రూ స‌మ‌భావ‌న‌తో ఉన్నార‌ని చెప్పారు. శ్రీ‌వారి భ‌క్తుడైన అన్న‌మ‌య్య 15వ శ‌తాబ్దంలోనే స‌మాన‌త్వాన్ని ప్ర‌చారం చేశార‌ని వివ‌రించారు. ఇంట్లో ఆడ‌, మ‌గ‌పిల్ల‌లిద్ద‌ర్నీ స‌మానంగా పెంచాల‌ని, మ‌నుషుల్లో మార్పు వ‌స్తేనే స‌మాన‌త్వం సాకార‌మ‌వుతుంద‌ని తెలిపారు.

హైద‌రాబాద్‌కు చెందిన ప్ర‌ముఖ ప‌ద్య‌క‌వి శ్రీ జ‌య‌రాజ్ మాట్లాడుతూ అణ‌గారిన వ‌ర్గాలు, మ‌హిళ‌లు ఎదిగేందుకు చ‌దువు ముఖ్య పాత్ర పోషిస్తుంద‌ని గుర్తించిన ఫూలే 157 పాఠ‌శాల‌ల‌ను స్థాపించార‌ని చెప్పారు. టిటిడిలో అన్ని కులాలకు స‌మ‌ప్రాధాన్యం ల‌భిస్తుండ‌డం సంతోష‌క‌ర‌మ‌న్నారు. స‌మాజం మొత్తం ఫూలే బాట‌లో న‌డిచి కులాల అడ్డుగోడ‌ల‌ను తొల‌గించాల‌ని కోరారు. ప్ర‌కృతి ఎంతో గొప్ప‌ద‌ని, దాన్ని ప్రేమిస్తే మ‌నకు అంతులేని సంతృప్తి క‌లుగుతుంద‌న్నారు. అనంత‌రం వృక్షాల గొప్ప‌ద‌నం గురించి పాట రూపంలో వినిపించారు.

హైద‌రాబాద్‌లోని ప్ర‌భుత్వ సిటి కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ డా. కోయి కోటేశ్వ‌ర‌రావు ఉప‌న్య‌సిస్తూ ఉన్న‌త విద్యావంతురాలైన మ‌హిళ ఒక విశ్వ‌విద్యాల‌యంతో స‌మాన‌మ‌ని గౌత‌మ బుద్ధుడు చెప్పార‌ని, స్త్రీల‌కు విద్యాబుద్ధులు నేర్ప‌డం ద్వారా ఫూలే దాన్ని చేత‌ల్లో చేసి చూపార‌ని చెప్పారు. ప‌ర‌పీడ‌న‌ను తొల‌గించ‌డ‌మే అష్టాద‌శ‌పురాణాల సార‌మ‌న్నారు. ఫూలేని సామాజిక ఉద్య‌మ పితామ‌హునిగా, తొలి భార‌తీయ సంఘ సంస్క‌ర్త‌గా, మాన‌వ‌హ‌క్కుల నిర్మాత‌గా అభివ‌ర్ణించారు. జ్యోతిరావుఫూలే, సాయిత్రిబాయి ఫూలే దంప‌తుల‌ను ఆది విద్యాదంప‌తులుగా కీర్తించారు.

హైద‌రాబాద్‌కు చెందిన బిసి ఫిలాస‌ఫ‌ర్ శ్రీ చెమ‌కూరు రాజు(పిడికిలి రాజు) మాట్లాడుతూ దేశంలో సామాజిక‌, సాంస్కృతిక మార్పున‌కు కృషి చేసిన బ‌హుముఖ ప్ర‌జ్ఞాశీలి శ్రీ ఫూలే అని చెప్పారు. దేవ‌దాశీ వ్య‌వ‌స్థ నిర్మూల‌న‌కు ఎంత‌గానో పాటుప‌డ్డార‌ని వివరించారు. మ‌హ‌నీయుల జ‌యంతుల‌ను నిర్వ‌హించ‌డంలో ఇత‌ర ధార్మిక సంస్థ‌ల‌కు టిటిడి ఆదర్శంగా నిలుస్తోంద‌న్నారు.

అనంత‌రం అతిథుల‌ను శాలువ‌, ఫూలే చిత్ర‌ప‌టంతో స‌న్మానించారు. ప‌లువురు ఉద్యోగుల‌కు జ్ఞాపిక‌లు, ప‌లు పోటీల్లో విజేత‌లుగా నిలిచిన‌వారికి బ‌హుమ‌తులు ప్ర‌దానం చేశారు.

ఈ కార్యక్రమంలో టిటిడి సంక్షేమ విభాగం డెప్యూటీ ఈవో శ్రీ ఆనంద‌రాజు, పిఆర్వో డా. టి.ర‌వి, స‌మ‌న్వ‌యాధికారి శ్రీ భ‌ర‌త్ గుప్త‌, ఇతర అధికారులు, టిటిడి ఉద్యోగులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.