NAVA KUNDATMAKA SRI YAGAM AT TIRUCHANOOR _ తిరుచానూరులో మూడోరోజు నవకుండాత్మక శ్రీ‌యాగం

Tirupati, 23 Jan. 22: The Sri Yagam organised by the TTD for global harmony and prosperity at the Sri Padmavati Ammavari Temple, Tiruchanoor, entered the third day on Sunday and rituals continued at the Sri Krishna Mukta mandapam in ekantha as per covid guidelines and is telecasted live for benefit of devotees.

On Sunday the rituals of chatustapan Archana, homas, laghu purnahuti, maha nivedaba, harati, Veda vinnapam were performed for utsava idols of Goddess Padmavati. After similar rituals in the evening, the utsava idols are returned to the sanctum.

TTD DyEO Smt Kasturi bai, AEO Sri Prabhakar Reddy, Archakas Sri Babu Swamy, Sri Vempalli Srinivasan were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుచానూరులో మూడోరోజు నవకుండాత్మక శ్రీ‌యాగం

తిరుప‌తి, 2022 జ‌న‌వ‌రి 23: ప్రపంచశాంతి, సౌభాగ్యం, ఆరోగ్యం కోసం తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంలో నవకుండాత్మక శ్రీ‌యాగం ఆదివారం మూడో రోజు కొనసాగుతోంది. కోవిడ్‌-19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలోని శ్రీకృష్ణ ముఖ మండ‌పంలో అర్చకులు శ్రీ వేంపల్లి శ్రీనివాసన్ ఆధ్వర్యంలో ఏకాంతంగా ఈ యాగ కార్య‌క్ర‌మాలు జరుగుతున్నాయి. యాగ క్రతువులను శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తోంది.

ఆదివారం ఉదయం శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేసి మ‌ధ్యాహ్నం వ‌రకు చ‌తుష్టానార్చ‌న‌, హోమాలు, లఘుపూర్ణాహుతి, మహానివేద‌న‌, హారతి, వేద విన్న‌పం నిర్వ‌హించారు. తిరిగి సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు చ‌తుష్టానార్చ‌న‌, శ్రీ‌యాగం హోమాలు, ల‌ఘుపూర్ణాహుతి, మ‌హానివేద‌న‌, వేద విన్న‌పం చేపట్టి అమ్మ‌వారి ఉత్స‌వ‌ర్ల‌ను స‌న్నిధిలోకి వేంచేపు చేస్తారు.

టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి దంపతులు జరిపిస్తున్న ఈ కార్యక్రమంలో ఏఈవో శ్రీ ప్రభాకర్ రెడ్డి, అర్చకులు శ్రీ బాబు స్వామి పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.