3.79 LAKH DEVOTEES GIVEN V DAY DARSHAN: TTD _ 3.79 ల‌క్ష‌ల మంది భ‌క్తుల‌కు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం : టిటిడి

Tirumala, 23 Jan. 22: TTD has during the 10 days Vaikuntha Ekadasi fete given Vaikunta Dwara Darshan to 3.79 lakh devotees between January 13-22 strictly adhering to covid guidelines.

Following are highlights of the achievements of TTD during V Day festivities

1. 3.79 lakh devotees had Vaikunta Dwara Darshan

2. 6949 devotees of SC/ST/BC and fishermen from remote areas were also provided free Vaikunta Dwara Darshan.

3. 26,420 devotees came by footpath for VD Darshan

4. 1.66 devotees opted for Special Entry Dar (SED) online tickets of ₹300

5. 83,000 devotees came through Slotted Sarva darshan (SSD) free tokens issued by TTD at Tirupati

6. 15,465 Srivani trust donors had VD Darshan. 

7. Other donors 7917 had VD darshan

8. As many as 43,250 Virtual Seva ticket holders also had VD Darshan.

9. TTD sold 15.14-lakh laddu Prasadam during VD darshans.

10. Hundi contributed scaled to Rs. 21.61 crore during ten days of VD Darshan.

SECURITY & VIGILANCE

– 500 Srivari Sevakulu, 1000 vigilance and security staff served devotees Daly.

– All security arrangements were monitored through the video wall at command control CC networks,

– As many as 2.05 lakh devotees luggages were secured at Tirumala counters.

– 69,117 vehicles clocked at Tirumala

RECEPTION

In all 42,809 rooms were occupied by devotees during 10 days of VD Darshan

TTD gathered revenue of Rs. 4.68 crore

KALYANA KATTA

As many as 1.23 devotees got their head tonsured to redeem their vow. 263 lady barbers, 851 men barbers totally 1114 of them served in 10 Kalyana kattas.

ANNA PRASADAM

In all 4.58 lakh devotees served Anna Prasadam and snacks at Matrusri Vengamamba Anna Prasadam Bhavan.

14,643 provided milk/tea and coffee during Vaikunta Ekadasi and Dwadasi days.

IT

The TTD I.T Department with cloud technology successfully organised Darshan tickets to all without any hassles.

APSRTC

The APSRTC operated 6640 trips for 1.81 devotees in upward journey abs 6256 trips for 1.84 lakh devotees during VD Darshan days,

HEALTH

TTD deployed 1100 health sanitary workers for clearing 4.25 tones of garbage daily

MEDICAL

As many as 13,829 devotees were provided medical services.

ENGINEERING

GHAT ROADS REVIVAL:

2 Ghat road damaged during November 17 &18 landslides and heavy rains were repaired at a cost of Rs.1.30 crore on war footing ahead of VD Darshan.

Works are progressing at Srivari Mettu at a cost of Rs. 3.60 crores.

HANDBOOK MANUAL ON DISASTER MANAGEMENT

TTD is preparing a manual for assessment and precautionary steps during disasters to save property and human lives a separate control room is also being set up. 

GARDEN DEPARTMENT

As part of VD preparations the Srivari temple was majestically electronically and flower decorations as a cynosure to match Vaikunta with 3 tonnes of traditional and 3.5 lakh cut flowers.

SVBC TELECAST

The SVBC channel made a live telecast of all programs including Bhagavadgita Akhanda parayanams on January 13 and the Vishnu Sahasranama parayanams from January 14th onwards,

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

3.79 ల‌క్ష‌ల మంది భ‌క్తుల‌కు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం : టిటిడి

తిరుమ‌ల‌, 2022 జ‌న‌వ‌రి 23: వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని జ‌న‌వ‌రి 13 నుండి 22వ తేదీ వరకు 10 రోజుల‌ పాటు కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ 3.79 ల‌క్ష‌ల మంది భక్తుల‌కు స్వామివారి దర్శనం మరియు వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పించడం జరిగింది.


ముఖ్యాంశాలు

శ్రీవారి ఆల‌యం :

– 3.79 ల‌క్ష‌ల మంది భ‌క్తులు శ్రీ‌వారి ద‌ర్శ‌నంతో పాటు వైకుంఠ ద్వారా ద‌ర్శ‌నం చేసుకున్నారు.

– ఎస్‌సి,ఎస్‌టి,బిసి, మ‌త్య్స‌కార ప్రాంతాల నుండి ఈ నెల 13 నుండి 20వతేదీ వరకు 6,949 మందికి ఉచితంగా వైకుంఠ ద్వార దర్శనం, రవాణా, వసతి,ఆహారం టిటిడి కల్పించింది.

– అలిపిరి నడక మార్గం నుండి 26,420 మంది

– ప్రత్యేక ప్రవేశ దర్శనం(రూ.300/-) -1.66 ల‌క్ష‌ల మంది

– సర్వదర్శనం టైంస్లాట్ – 83 వేల మంది

– శ్రీవాణి ట్రస్టు – 15,465 మంది

– దాతలు 7,917 మంది దాత‌లు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం చేసుకున్నారు.

– వర్చువల్ సేవ‌లు టికెట్లు కలిగి (కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, ఊంజల్‌ సేవ) – 43,250 మంది స్వామివారి దర్శనం చేసుకున్నారు.

– భక్తుల‌కు అందించిన మొత్తం ల‌డ్డూలు – 15.14 ల‌క్ష‌లు

– హుండీ కానుక‌లు – రూ.26.61 కోట్లు

నిఘా మరియు భద్రతా విభాగం :

– 500 మంది శ్రీవారి సేవకులు, 1000 మంది విజిలెన్స్‌ మరియు సెక్యూరిటీ సిబ్బంది భక్తుల‌కు సేవందించారు.

– కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లోని వీడియో వాల్‌ ద్వారా ముఖ్యమైన ప్రాంతాల్లో భద్రతను పర్యవేక్షించారు.

– తిరుమలోని కౌంటర్లలో 2.05 ల‌క్ష‌ల‌ మంది భక్తుల ల‌గేజిని భద్రపరచడం జరిగింది.

– 69,117 వాహనాల్లో భక్తులు తిరుమల‌కు రావడం జరిగింది.

రిసెప్షన్‌ :

– 10 రోజుల‌కు కలిపి 42,809 గదుల‌ను భక్తులు పొందడం జరిగింది.

– ఇందుకోసం టిటిడికి సమకూరిన మొత్తం
రూ.4 . 68 కోట్లు.

కల్యాణకట్ట :

– తల‌నీ‌లాలు సమర్పించుకున్న భక్తుల‌ సంఖ్య 1.23 ల‌క్ష‌లు.

– 263 మంది మహిళా క్షురకులు, 851 మంది పురుష క్షురకుల‌తో కలిపి మొత్తం 1,114 మంది క్షురకులు 10 కల్యాణకట్టల్లో భక్తుల‌కు ఉచితంగా తల‌నీలాలు తీయడం జరిగింది.

అన్నప్రసాదం :

– మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కలిపి 4.58 ల‌క్షల‌ భోజనాలు, అల్పాహారం అందించడమైనది.

– 14,643 మంది (వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో మాత్రమే) భ‌క్తుల‌కు పాలు/టీ/కాఫీ అందించడమైనది.

ఐటి :

– టిటిడి ఐటి విభాగం అధునాతన పరిజ్ఞానంతో వేగవంతమైన సేవ‌లందించడం ద్వారా భక్తులు దర్శనం, వసతి ఇతర సేవల‌ను మరింత సౌకర్యవంతంగా పొందగలిగారు.

ఎపిఎస్‌ఆర్‌టిసి :

– ఎపిఎస్‌ఆర్‌టిసి బస్సులు తిరుపతి నుంచి తిరుమల‌కు 6,640 ట్రిప్పుల్లో 1.81 ల‌క్షల‌ మంది భక్తుల‌ను చేరవేశాయి. తిరుమల‌ నుంచి తిరుపతికి 6,256 ట్రిప్పుల్లో 1.84 ల‌క్షల‌ మంది భక్తుల‌ను చేరవేశాయి.

ఆరోగ్య విభాగం :

– కాటేజీలు, యాత్రికుల‌ వసతి సముదాయాలు, సామూహిక మరుగుదొడ్ల వద్ద మెరుగైన పారిశుద్ధ్యం కోసం 1100 మంది సిబ్బంది సేవల‌ను వినియోగించడమైనది.

– రోజుకు సరాసరి 4.25 టన్నుల‌ చెత్త తొల‌గింపు.

వైద్యం :

– వైద్యసేవ‌లు పొందిన భక్తుల‌ సంఖ్య 13,829

ఇంజనీరింగ్‌ విభాగం :

ఘాట్‌ రోడ్ల పునరుద్ధరణ :

– గతేడాది నవంబరు 17, 18వ తేదీల్లో భారీవర్షాల కారణంగా భారీ కొండచరియలు విరిగిపడి తిరుమల రెండో ఘాట్‌ రోడ్డు తీవ్రంగా దెబ్బతింది.

– రూ.1.30 కోట్ల వ్యయంతో యుద్ధప్రాతిపదికన మరమ్మతులు పూర్తిచేసి వైకుంఠ ఏకాదశి నాటికి భక్తులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.

– శ్రీవారి మెట్టు మార్గంలో రూ.3.60 కోట్లతో నడకమార్గం పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి.

విపత్తుల నివారణ కరదీపిక :

– వరదలు, కొండచరియలు విరిగి పడడం లాంటి ప్రకృతి విపత్తులు సంభవించినపుడు వెంటనే స్పందించి భారీ నష్టం జరగకుండా తగిన చర్యలు చేపట్టేందుకు వీలుగా విపత్తుల నిర్వహణ కరదీపిక (మాన్యువల్‌) రూపొందిస్తున్నారు.

– ఇందుకోసం కంట్రోల్‌ రూమ్‌ను ప్రారంభించి ముందస్తు హెచ్చరికలు చేసే యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్నారు.

ఉద్యానవన విభాగం :

– శ్రీవారి ఆల‌యంలో శోభాయమానంగా పుష్పాలంక‌ర‌ణ‌లు.

– ఇందుకోసం దాత‌ల స‌హ‌కారంతో 31 ట‌న్నుల సంప్ర‌దాయ పుష్పాలు, 3.5 ల‌క్ష‌ల క‌ట్ ఫ్ల‌వ‌ర్లు వినియోగం.


శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్లో ప్రసారమైన ధార్మిక కార్యక్రమాలు :

– జనవరి 13వ తేదీ సంపూర్ణ భ‌గ‌వ‌ద్గీత అఖండ పారాయ‌ణం

– జ‌న‌వ‌రి 14వ తేదీ నుండి తిరుమ‌ల‌లో విష్ణు సహస్ర నామ పారాయణం ప్రారంభ‌మైంది.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.