NEW UMBRELLA FETE HELD AT SRIVARI PADALU _ నారాయణగిరి శ్రీవారి పాదాల వద్ద వేడుకగా ఛత్రస్థాపనోత్సవం
Tirumala,16 August 2024: The traditional annual Chatra Sthapanotsavam was observed by TTD in a grand manner at Srivari Padalu near Narayanagiri on Friday wherein TTD archakas installed and decorated a new Umbrella.
Archakas brought puja materials and Naivedyam from Srivari temple where initially they performed Tirumanjanam and Abhisekam to the sacred feet followed by Prabhanda sattumora by Veda Parayanadars and later Prasadam was distributed to the devotees.
Legend says that this ritual is observed every year to mark the appearance of Srivaru stepping His holy feet on this Peak point in Tirumala on Narayanagiri Hills.
The installation of an umbrella is aimed at seeking relief from high-velocity winds with prayers appeasing Vayu Deva.
Srivari temple Parupattedar Sri Himatgiri and archakas were present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
నారాయణగిరి శ్రీవారి పాదాల వద్ద వేడుకగా ఛత్రస్థాపనోత్సవం
తిరుమల, 2024 ఆగష్టు 16: తిరుమల నారాయణగిరి శ్రీవారి పాదాల వద్ద శుక్రవారం ఛత్రస్థాపనోత్సవం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీవారి పాదాల వద్ద టీటీడీ అర్చక బృందం ప్రత్యేకంగా అలంకరించిన గొడుగును ప్రతిష్టించారు.
తిరుమల శ్రీవారి ఆలయం నుండి పూజా సామగ్రి, పుష్పాలు, నైవేద్యం, గొడుగుతో మంగళవాయిద్యాల నడుమ ఆలయ మాడ వీధుల గుండా అర్చక బృందం మేదరమిట్టకు చేరుకున్నారు. అక్కడి నుండి నారాయణగిరికి విచ్చేశారు. ముందుగా శ్రీవారి పాదాలకు తిరుమంజనం చేపట్టారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం అలంకారం, పూజ చేసి నైవేద్యం సమర్పించారు. వేదపారాయణదారులు ప్రబంధ శాత్తుమొర నిర్వహించారు. ఆ తరువాత భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.
తిరుమల ఏడుకొండల్లో అత్యంత ఎత్తయిన నారాయణగిరి శిఖరంపై కలియుగంలో శ్రీవేంకటేశ్వరస్వామివారు మొదటగా కాలు మోపినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ద్వాదశి నాడు ఛత్రస్థాపనోత్సవం నిర్వహించారు.
ఈ ఉత్సవానికి మరో నమ్మకం కూడా ఉంది. సాధారణంగా ఈ కాలంలో గాలులు ఎక్కువగా వీస్తాయి. నారాయణగిరి శిఖరం ఎక్కువ ఎత్తులో ఉండడంతో మరింత ఎక్కువగా గాలులు వీస్తాయి. ఈ గాలుల నుంచి ఉపశమనం కల్పించాలని వాయుదేవుని ప్రార్థిస్తూ ఇక్కడ గొడుగును ప్రతిష్టిస్తారు.
ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ పార్‌పత్తేదార్ శ్రీ హిమత్ గిరి, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.