NO RECOMMENDATION LETTERS WILL BE ENTERTAINED ON JAN 1 AND VAIKUNTA DWARA DARSHAN DAYS _ జ‌న‌వ‌రి 1న‌, జ‌న‌వ‌రి 13 నుండి 22వ తేదీ వ‌ర‌కు సిఫార్సు లేఖ‌లు స్వీక‌రించ‌బ‌డ‌వు

DARSHAN WILL BE PROVIDED FOR SELF PROTOCOL VIPs

 

ELABORATE ARRANGEMENTS UNDERWAY

 

Tirumala, 28 Dec. 21: Keeping in view the darshan priority of common pilgrims on January 1 New Year Day and on the auspicious days of Vaikunta Ekadasi, Dwadasi and remaining days where Vaikuntadwara Darshan will be provided from January 13 to 22, TTD has taken a decision to provide VIP Break darshan only to Protocol VIPs on self-arrival. TTD has also asserted that VIPs will entertain no recommendation letters on these days.

 

TTD has also appealed to devotees to bring Covid Negative report taken 48hours before or the certificate of two doses of Vaccination without fail.

 

 Some important decisions have been taken in view of these auspicious days to facilitate common pilgrims by TTD:

 

@ Advance reservation of accommodation has been cancelled from January 11 to 14

 

@ All rooms in Tirumala will be allotted through current booking to pilgrims

 

@ No privilege of booking accommodation for donors from January 11 to 14

 

@ Following Covid norms and dress code, a sufficient number of tonsurers will be deployed round the clock in all the Kalyanakattas in Tirumala

 

@ Annaprasadam will be served to pilgrims from 4am to 12midnight to all the pilgrims during these auspicious days following Covid norms

 

@ Medical teams will be deployed in all the important places during these days

 

@ Traffic regulations in co-ordination with Tirumala Police by TTD Vigilance Department

 

@ As the Central and State Governments have cautioned denizens to be alert strictly following the Covid norms in view of the fast spreading of Omicron Third Wave across the country, TTD has reiterated that all the devotees who booked darshan tickets should necessarily bring Covid Negative RTPCR Certificate taken 48hours before or Two doses of Vaccine without fail

 

@ Keeping in view the health security of pilgrims as well employees, the devotees are requested to strictly adhere to Covid norms and co-operate with TTD Security

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జ‌న‌వ‌రి 1న‌, జ‌న‌వ‌రి 13 నుండి 22వ తేదీ వ‌ర‌కు సిఫార్సు లేఖ‌లు స్వీక‌రించ‌బ‌డ‌వు

స్వ‌యంగా వ‌చ్చే ప్ర‌ముఖుల‌కు మాత్ర‌మే బ్రేక్ ద‌ర్శ‌నం

భ‌క్తుల కోసం విస్తృతంగా ఏర్పాట్లు

తిరుమ‌ల‌, 2021 డిసెంబరు 27: సామాన్య భ‌క్తుల సౌక‌ర్యాన్ని దృష్టిలో ఉంచుకుని జ‌న‌వ‌రి 1న‌, వైకుంఠ ఏకాద‌శి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 13 నుండి 22వ తేదీ వ‌ర‌కు స్వ‌యంగా వ‌చ్చే ప్ర‌ముఖుల‌కు మాత్ర‌మే విఐపి బ్రేక్ ద‌ర్శ‌నం క‌ల్పించ‌డం జ‌రుగుతుంద‌ని, వారి సిఫార్సు లేఖ‌లు స్వీక‌రించ‌బ‌డ‌వ‌ని తెలియ‌జేయ‌డ‌మైనది. భ‌క్తులు కోవిడ్ వ్యాక్సినేష‌న్ లేదా నెగెటివ్ సర్టిఫికెట్ త‌ప్ప‌నిస‌రిగా తీసుకురావాల‌ని కోర‌డ‌మైన‌ది. శ్రీ‌వారి ఆలయంలో జ‌న‌వ‌రి 13న వైకుంఠ ఏకాదశి, జ‌న‌వ‌రి 14న‌ వైకుంఠ ద్వాద‌శి ప‌ర్వ‌దినాల సంద‌ర్భంగా విచ్చేసే భ‌క్తులకు కోవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ సంతృప్తిక‌ర‌మైన ద‌ర్శ‌నం క‌ల్పించేందుకు టిటిడి ఏర్పాట్లు చేప‌డుతోంది. ఈ ప‌ర్వ‌దినాల నేప‌థ్యంలో జ‌న‌వ‌రి 13 నుండి 22వ తేదీ వ‌ర‌కు 10 రోజుల పాటు భ‌క్తుల‌కు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం క‌ల్పించ‌నుంది.

గ‌దుల అడ్వాన్స్ రిజ‌ర్వేష‌న్ ర‌ద్దు

– జ‌న‌వ‌రి 11 నుండి 14వ తేదీ వ‌ర‌కు వ‌స‌తి గ‌దుల ఆడ్వాన్స్ రిజ‌ర్వేష‌న్‌ను ర‌ద్దు చేయ‌డ‌మైన‌ది.

– శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి విచ్చేసే సామాన్య భ‌క్తుల‌ వ‌స‌తికి పెద్దపీట వేస్తూ తిరుమ‌ల‌లోని అన్ని గ‌దుల‌ను క‌రెంటు బుకింగ్ ద్వారా కేటాయించాల‌ని టిటిడి నిర్ణ‌యించింది.

– జ‌న‌వ‌రి 11 నుండి 14వ తేదీ వరకు దాతల‌కు గదుల‌ కేటాయింపు ప్రివిలేజ్ ఉండదు.

కల్యాణకట్ట

– తల‌నీలాలు తీసేందుకు తగినంత మంది క్షురకుల‌ను అందుబాటులో ఉంచడం జరిగింది. కోవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ క్షురకులు పిపిఇ కిట్లు, ఆప్రాన్లు వినియోగిస్తారు.

అన్నప్రసాదం

– అన్నప్రసాద భవనంలో కోవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ ఈ 10 రోజుల‌ పాటు ఉదయం 4 నుండి రాత్రి 12 గంటల‌ వరకు అన్నప్రసాద వితరణ ఉంటుంది.

వైద్యం

– భక్తుల‌కు వైద్యసేవ‌లందించేందుకు అవసరమైన ప్రాంతాల్లో వైద్య బృందాలు అందుబాటులో ఉంటాయి.

పార్కింగ్‌

– తిరుమల‌లో పోలీసుల‌తో సమన్వయం చేసుకుని ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా వాహనాలు పార్కింగ్‌ ప్రాంతాల‌కు చేరేలా ఏర్పాట్లు.

కోవిడ్ నిబంధనలు

కోవిడ్ వ్యాక్సినేష‌న్ లేదా నెగెటివ్ సర్టిఫికెట్ త‌ప్ప‌నిస‌రి

– కోవిడ్ – 19 మూడ‌వ వేవ్ ఒమిక్రాన్ రూపంలో దేశ వ్యాప్తంగా విస్త‌రిస్తున్న నేప‌థ్యంలో ఇటీవ‌ల కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు హెచ్చ‌రిక‌లు జారీ చేశాయి. అదేవిధంగా, కొన్ని ప‌ట్ట‌ణాల్లో రాత్రి క‌ర్ఫ్యూ కూడా విధించారు. ఈ నేప‌థ్యంలో భ‌క్తులు పర్వదినాల్లోనే కాకుండా మిగతా అన్ని రోజుల్లోనూ వ్యాక్సినేష‌న్ సర్టిఫికేట్ కానీ, దర్శనానికి 48 గంటల ముందు చేసుకున్న ఆర్‌టిపిసిఆర్ పరీక్ష నెగిటివ్ సర్టిఫికేట్ కానీ త‌ప్ప‌నిస‌రిగా తీసుకురావాలి.

– టిటిడి ఉద్యోగులు, వేలాది మంది సహ భక్తుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని భక్తులు టిటిడి విజిలెన్స్ మరియు సెక్యూరిటి సిబ్బందికి స‌హ‌క‌రించాల‌ని కోర‌డ‌మైన‌ది.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.