OUTGOING CVSO FELICITATED _ శ్రీ‌వారి భ‌క్తుల‌కు శ్రీ గోపినాథ్ జెట్టి సేవ‌లు ప్రశంసనీయం – అద‌న‌పు ఈవో

LONG-SERVING CVSO OF TTD- ADDL EO 

 

A MEMORABLE EXPERIENCE IN MY CAREER- OUTGOING CVSO

 

WILL TAKE FORWARD PILGRIM INITIATIVES- NEW CVSO

 

ADDITIONAL EO FELICITATES OUTGOING CVSO

 

TIRUMALA, 06 April 2022: Describing Sri Gopinath Jatti as the longest-serving Chief Vigilance and Security Officer of TTD, Additional EO Sri AV Dharma Reddy felicitated the outgoing top cop of TTD on Wednesday.

 

A meeting was arranged at Annamaiah Bhavan in Tirumala for the outgoing CVSO Sri Gopinath Jatti and welcoming the new CVSO. Speaking on the occasion the Additional EO lauded the initiatives brought about by him in his three and a half years period. 

 

The Additional EO also recalled his association with him and the support offered by Sri Jatti in curtailing black marketing of laddus, streamlining traffic during the ghat road repairs, providing hassle-free darshan to devotees following Covid norms during Pandemic, effective monitoring and functioning of Common Command Centre and many. 

 

He also said, Sri Jatti with his vast knowledge in science has also played a very important role in improving the greenery and forestry in Tirumala. The Additional EO wished the outgoing CVSO who got promoted to the rank of DIG, the same enthusiasm in his future assignments too.

 

Sharing his experience as the top cop of TTD, the CVSO said, his tenure in the world’s biggest Hindu religious organisation has given him immense satisfaction. “With the benign blessings of Sri Venkateswara Swamy I continued for such a long time in TTD than the usual two years period. “In a sensitive sentimental place like Tirumala, dealing with the pilgrims, without hurting their sentiments is a challenging task. But we were able to achieve a lot of progress in the behavioural attitude of our vigilance and security sleuths with the devotees. As a result in the place of complaints we received appreciation mails from the pilgrims and I wish to continue the same spirit in future too”, he maintained.

 

The outgoing CVSO also thanked the TTD Chairman, EO, Additional EOs, JEOs, all the heads, officers, Vigilance and Security sleuths of TTD for their immense support during his tenure. He said TTD has now an established security and vigilance system and all the SOPs should be treasurised in the form of a book for future, he opined.

 

Later the new CVSO Sri Narasimha Kishore also said he will discharge his duties to ensure hassle free darshan and other facilities to visiting pilgrims.

 

Earlier all other department heads shared their experience with the outgoing CVSO and lauded his services.

 

SE 2 Sri Jagadeeshwar Reddy, CEO SVBC Sri Suresh Kumar, DyEOs Sri Ramesh Babu, Sri Lokanatham, Sri Selvam, Health Officer Dr Sridevi, DFO Sri Srinivasulu Reddy, EEs Sri Surendra, Sri Srihari, DE Electrical Sri Ravishankar Reddy, VGO Sri Bali Reddy, all AVSOs, VIs were also present.

 

Later the Additional EO along with the new CVSO felicitated the outgoing CVSO with shawl and momento.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ‌వారి భ‌క్తుల‌కు శ్రీ గోపినాథ్ జెట్టి సేవ‌లు ప్రశంసనీయం – అద‌న‌పు ఈవో

టిటిడిలో ప‌ని చేయ‌డం పూర్వ‌జ‌న్మ సుకృతం – శ్రీ‌ గోపినాథ్ జెట్టి

యాత్రికుల భ‌ద్ర‌త కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్ళ‌తాం -కొత్త సివిఎస్వో

ప‌దోన్న‌తిపై వెళ్ళుతున్న సివిఎస్వోను సత్కరించిన అద‌న‌పు ఈవో

తిరుమ‌ల‌, 2022 ఏప్రిల్ 06: తిరుమ‌ల‌ శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి విచ్చేసే భ‌క్తులకు సేవ‌లందించేందుకు శ్రీ గోపీనాథ్ జెట్టి అకుంఠిత దీక్ష‌తో అవిర‌ళ కృషి చేశార‌ని అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి అన్నారు. తిరుమల అన్నమయ్య భవనంలో ప‌దోన్న‌తి పొందిన‌ శ్రీ గోపినాథ్ జెట్టికి వీడ్కోలు మరియు కొత్త సివిఎస్వోకు స్వాగతం పలికేందుకు బుధవారం ఉద‌యం సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా అద‌న‌పు ఈవో మాట్లాడుతూ టిటిడిలో మూడున్నరేళ్ల కాలం ప‌నిచేసిన శ్రీ గోపినాథ్ జెట్టి భ‌క్తుల‌కు ఉప‌యోగ‌ప‌డే అనేక భ‌ద్ర‌త ప‌ర‌మైన సంస్క‌ర‌ణ‌ల‌ను తీసుకువ‌చ్చి దాదాపు 600 మంది ద‌ళారుల‌ను అరెస్టు చేసిన‌ట్లు చెప్పారు. వ‌స‌తి, ద‌ర్శ‌నం, లడ్డూల బ్లాక్ మార్కెటింగ్‌ అరికట్టడం, గ‌త ఏడాది వ‌ర్షాల‌కు దెబ్బ‌తిన్న ఘాట్ రోడ్ల‌ మరమ్మతుల సమయంలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడం, క‌రోనా మహమ్మారి సమయంలో కోవిడ్ నిబంధనలను అనుసరించి భక్తులకు ఇబ్బంది లేకుండా దర్శనం క‌ల్పించ‌డం, కామన్ కమాండ్ సెంటర్‌ను ఎంతో ప‌టిష్టంగా నిర్వ‌హించ‌డంలో శ్రీ గోపినాథ్ జెట్టి సేవ‌ల‌ను అద‌న‌పు ఈవో ప్ర‌శంసించారు.

అలాగే శ్రీ గోపినాథ్ జెట్టి సైన్స్ విద్యార్థి కావ‌డం వ‌ల్ల తిరుమలలో పచ్చదనం, అటవీ సంపదను పెంపొందించడంలో కీలక పాత్ర పోషించారన్నారు. డిఐజి స్థాయికి పదోన్నతిపై వెలుతున్న‌ ఆయ‌న భవిష్యత్‌లో ఇదే ఉత్సాహం ప‌నిచేసి, మ‌రింత ఉన్న‌త శిఖ‌ల‌రాల‌ను చేరుకోవాల‌ని అదనపు ఈవో ఆకాంక్షించారు.

అనంత‌రం శ్రీ గోపినాథ్ జెట్టి మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద హైంద‌వ‌ ధార్మిక సంస్థ అయిన టిటిడిలో ప‌ని చేయ‌డం త‌న పూర్వ జ‌న్మ సుకృత‌మ‌న్నారు. టిటిడిలో మూడున్నరేళ్ల ప‌ద‌వీ కాలం సంతృప్తి నిచ్చింద‌న్నారు. తిరుమల లాంటి సున్నితమైన ప్రదేశంలో యాత్రికుల మనోభావాలు దెబ్బతినకుండా వారితో వ్యవహరించడం సవాలుతో కూడుకున్న పని అన్నారు. కానీ భక్తుల విష‌యంలో అప్రమత్తంగా ఉంటూ, అత్యాధునిక ప‌రిక‌రాల స‌హాయంతో భద్రతా సిబ్బంది దళారులను గుర్తించ‌డంలో ఎంతో పురోగతిని సాధించిన‌ట్లు చెప్పారు. గ‌తంలో యాత్రికుల నుండి టిటిడి నిఘా మ‌రియు భ‌ద్ర‌త విభాగంపై ఎన్నో విమ‌ర్శ‌లు వ‌చ్చేవ‌ని, ఇప్పుడు వారే ఇ-మెయిల్స్‌, ఫోన్ ద్వారా ప్ర‌శంసించ‌డం ఆనందం క‌లిగిస్తోంద‌న్నారు.

తన పదవీ కాలంలో అపారమైన సహాయ సహకారాలు అందించిన టిటిడి చైర్మన్, ఈవో, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, జెఈవోల‌కు, ఇత‌ర అధికారులకు, విజిలెన్స్, సెక్యూరిటీ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

తరువాత కొత్త సివిఎస్వో శ్రీ న‌ర‌సింహ కిషోర్ మాట్లాడుతూ శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి విచ్చేసే భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనం, వ‌స‌తి, ల‌డ్డూ ప్ర‌సాదాలు, ఇతర సౌకర్యాలు అందేలా విధులు నిర్వర్తిస్తానని చెప్పారు.

అంతకుముందు టిటిడిలోని వివిధ‌ శాఖాధిపతులు ప‌దోన్న‌తిపై వెళ్ళుతున్న సివిఎస్వోతో తమ అనుభవాల‌ను పంచుకొని, ఆయ‌న సేవలను కొనియాడారు.

ఎస్ ఇ- 2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, సిఈవో ఎస్వీబిసి శ్రీ సురేష్ కుమార్, డెప్యూటీ ఈవోలు శ్రీ రమేష్ బాబు, శ్రీ లోకనాథం, శ్రీ సెల్వం, శ్రీ రామ‌రావు, ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ శ్రీదేవి, డిఎఫ్‌వో శ్రీ శ్రీనివాసులు రెడ్డి, ఇఇలు శ్రీ సురేంద్ర, శ్రీ శ్రీహరి, డిఇ (ఎలక్ట్రికల్) శ్రీ రవిశంకర్ రెడ్డి, విజివో శ్రీ బాలి రెడ్డి , అన్ని సెక్టార్ల ఎవిఎస్వోలు, విఐలుపాల్గొన్నారు.

అనంతరం అదనపు ఈవోతో క‌లిసి కొత్త సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టిని శాలువా, శ్రీ‌వారి చిత్ర‌ప‌టంతో సత్కరించారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.