OVERWHELMING RESPONSE FOR TTD’s DRY FLOWER TECHNOLOGY PRODUCTS _ డ్రై ఫ్ల‌వ‌ర్ టెక్నాల‌జి క‌ళాకృతులకు విశేష ఆదరణ

NOVEL DFT PRODUCTS GETS THE PAT FROM AP CM

 

Tirumala, 21 September 2022: The optimum utility of flowers and garlands used in TTD-run temples to make the divine portraits besides household materials like paper weights, key chains, table calendars, pendants etc. using the traditional Dry Flower Technology method, has been a major hit with devotees.

 

The products have also earned the appreciation of the Honourable CM of AP Sri YS Jaganmohan Reddy and other Ministers from State and Central as well. TTD and Dr YSR horticultural University had signed an MoU on September 13, 2021, for providing Dry flower technology to make popular products including making portraits of the Hindu deities including Sri Venkateswara Swamy, Sri Padmavathi Devi, Sri Rama etc. that would attract the devotees in a big way. TTD has also succeeded in the process as there is a huge demand for the DFT portraits among the pilgrim devotees.

As part of the agreement, first batch of women workers were given training in making products at the Citrus Research Station.

 

From September 28 in 2021 onwards the training classes commenced. As many as 340 women from self-help groups were provided training and roped in by TTD to produce the artefacts. Two portraits could be made daily by one person and another 3-4 days for producing the final product. Till now, these trained women have made 22,219 portraits of A4 size and 850 other artefacts all worth Rs.1.19crores. TTD has spent ₹88 lakhs on the equipment besides training SHG women. 

 

TTD has commenced sale of these portraits and artefacts to devotees from January 25. The artefacts are made available at TTD information centres in Tirumala, Tirupati Local temples, Bangalore, Hyderabad, Visakhapatnam, Vijayawada and Chennai. Following the growing demand for the DFT products from the pilgrim public, TTD has decided to construct a permanent shed for manufacturing the artefacts and will soon be built at the Citrus Research Station itself.      

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

డ్రై ఫ్ల‌వ‌ర్ టెక్నాల‌జి క‌ళాకృతులకు విశేష ఆదరణ

– అభినందించిన రాష్ట్ర ముఖ్య‌మంత్రి శ్రీ వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి

తిరుమల, 2022 సెప్టెంబ‌రు 21: టీటీడీలోని వివిధ ఆలయాల్లో ఉప‌యోగించిన పూల‌తో డ్రైఫ్ల‌వ‌ర్ టెక్నాల‌జిని ఉప‌యోగించి శ్రీ‌వారు, అమ్మ‌వార్ల ఫోటో ప్రేమ్‌లు, పేప‌ర్ వెయిట్స్, క్యాలెండ‌ర్లు, కీ చైన్‌లు త‌దిత‌ర ఉత్ప‌త్తుల‌కు భ‌క్తుల నుండి విశేష ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. టీటీడీ డ్రై ఫ్ల‌వ‌ర్ టెక్నాల‌జితో త‌యారుచేసిన క‌ళాకృతుల‌ను రాష్ట్ర ముఖ్య‌మంత్రి శ్రీ వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి, ప‌లువురు కేంద్ర మంత్రులు అభినందించారు.

డ్రై ఫ్ల‌వ‌ర్ టెక్నాల‌జితో క‌ళాకృతులు త‌యారు చేయ‌డానికి టీటీడీ, డాక్ట‌ర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వ‌విద్యాల‌యంతో 2021 సెప్టెంబ‌రు 13వ తేదీన‌ ఎంఓయు కుదుర్చుకుంది. ఇందులో భాగంగా 2021 సెప్టెంబర్ 28వ తేదీ నుండి తిరుప‌తిలోని సిట్ర‌స్ రిసెర్చ్ స్టేష‌న్‌లో మ‌హిళ‌ల‌కు శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. దాదాపు 350 మంది స్వయం స‌హాయ‌క సంఘాల మహిళల‌కు ప్ర‌త్యేకంగా డ్రై ఫ్ల‌వ‌ర్ టెక్నాలజీపై శిక్షణ ఇచ్చారు. ఒక మహిళ రోజుకు రెండు చిత్రపటాలను తయారు చేయవచ్చు. చిత్రపటాల‌ తయారీకి పూల‌ను ఎండబెట్టడానికి సుమారు మూడు నుండి నాలుగు రోజులు పడుతుంది. ఇప్పటివరకు శిక్షణ పొందిన మహిళలు 22,219 ఏ ఫోర్ సైజ్ చిత్ర‌ప‌టాలు, 850 వివిధ ర‌కాల క‌ళాకృతులు త‌యారు చేశారు. ఒక కోటి 19 ల‌క్ష‌ల 26 వేల 56 రూపాయ‌ల విలువ గ‌ల ఉత్ప‌త్తుల‌ను త‌యారు చేశారు.

టీటీడీ రూ.83 ల‌క్ష‌ల‌తో ప‌రిక‌రాలు, శిక్ష‌ణ‌కు నిధులు స‌మ‌కూర్చుతోంది. త్వ‌ర‌లో సిట్ర‌స్ రిసెర్చ్ స్టేష‌న్‌లో శాశ్వ‌త షెడ్డు ఏర్పాటుకు కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తున్నారు.

టీటీడీ 2022 జ‌న‌వ‌రి 25వ తేదీ నుండి వీటిని భ‌క్తుల‌కు విక్ర‌యానికి అందుబాటులో ఉంచింది. భ‌క్తుల సౌక‌ర్యార్థం తిరుమ‌ల‌, స్థానిక ఆల‌యాల్లోను, బెంగుళూరు, హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, చెన్నై సమాచార కేంద్రాల్లోను ప్ర‌త్యేక కౌంట‌ర్లు ఏర్పాటు చేసి విక్రయించడం జరుగుతుంది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.