CM INVITED FOR ANNUAL BRAHMOTSAVAMS _ శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రండి -రాష్ట్ర ముఖ్యమంత్రికి టిటిడి ఛైర్మన్, ఈవో, తిరుప‌తి ఎమ్మెల్యే ఆహ్వానం

TIRUMALA, 21 SEPTEMBER 2022:  The Honourable CM of Andhra Pradesh, Sri YS Jaganmohan Reddy has been invited by TTD Chairman Sri YV Subba Reddy along with the EO Sri AV Dharma Reddy and Tirupati MLA Sri B Karunakar Reddy to take part in the ensuing annual Brahmotsavams at Tirumala which are scheduled between September 27 to October 5.

 

The trio formally met the CM of AP in the latter’s chambers at his office in SP Secretariat in Velagapudi in Guntur District on Wednesday and handed over him the Brahmotsavam invitation.

 

The CM will present pattu vastrams on behalf of AP Government on September 27 as per the tradition.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రండి

రాష్ట్ర ముఖ్యమంత్రికి టిటిడి ఛైర్మన్, ఈవో, తిరుప‌తి ఎమ్మెల్యే ఆహ్వానం

తిరుమ‌ల‌, 2022 సెప్టెంబరు 21: ఈ నెల 27 నుండి అక్టోబ‌రు 5వ తేదీ వ‌రకు జ‌రుగ‌నున్న తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్రహ్మోత్సవాలకు విచ్చేయాల‌ని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, తిరుప‌తి ఎమ్మెల్యే శ్రీ భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి బుధ‌వారం ఉద‌యం ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్‌.జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ఆహ్వానించారు. వెల‌గ‌పూడి సచివా‌లయంలోని ముఖ్య‌మంత్రి ఛాంబ‌ర్‌లో ముఖ్య‌మంత్రిని క‌లిసి బ్ర‌హ్మోత్స‌వాల ఆహ్వాన‌ప‌త్రిక‌ను అంద‌జేశారు. అనంత‌రం శ్రీ‌వారి తీర్థ‌ప్ర‌సాదాలు అందించారు.

బ్ర‌హ్మోత్సవాల తొలిరోజు ధ్వ‌జారోహ‌ణం సంద‌ర్భంగా రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్‌.జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పిస్తారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.