PADMAVATHI PARINAYOTSAVAM ENTERS THE SECOND DAY _ అశ్వవాహనంపై పెళ్లికుమారుడిగా శ్రీనివాసుడు

PURANAS SAYS THE DIVINE WEDLOCK HELD ON VAISAKHA SUDDHA DASAMI 

 

TIRUMALA, 11 MAY 2022: The annual three-day Padmavathi Srinivasa Parinayotsavam entered the second day on Wednesday evening at Narayanagiri Gardens in Tirumala.

 

Sri Malayappa Swamy was brought to the Parinayotsava Mandiram on a small Aswa Vahanam while both Sridevi and Bhudevi arrived on separate Pallakis.

 

Later Edurkolu, Varanamayiram, Poo Bantata were performed in a traditional way with a set of officials and religious staffs, each taking the side of Swamy and another on the side of both the Goddesses, facing opposite to each other.

 

After these rituals, all the three deities were seated on a specially decorated swing. Later Chaturveda Parayanam, Sangeeta, Sahitya Mela, Tala, Vaidyams were rendered on the auspicious occasion of the celestial marriage of the deities.

 

As per legends, it is on this auspicious day of Vaisakha Suddha Dasami, Srinivasa tied the nuptial knot to Padmavathi.

 

Sri Raghunath and his team of Annamacharya Project artists rendered Sankeertans in a melodious manner and enthralled devotees that included “Lakshmi Kalyanamu”, “Entavadivayya Neevu Emani Pogadudunu”, “Vedambevvani Vedakedini”.

 

Harikatha Bhagavatar Sri Venkateswarulu rendered the celestial marriage of the deities in an attracting way which won the hearts of devotees.

 

After the devotional cultural rendition, the deities were rendered Harati and brought back to temple.

 

EO (FAC) Sri AV Dharma Reddy, SE 2 Sri Jagadeeshwar Reddy, DyEO Sri Ramesh Babu, VGO Sri Bali Reddy, HO Dr Sridevi and other officials were also present.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD TIRUPATI

అశ్వవాహనంపై పెళ్లికుమారుడిగా శ్రీనివాసుడు

తిరుమల, 2022 మే 11: శ్రీపద్మావతీ శ్రీనివాసుల పరిణయోత్సవ మహోత్సవంలో రెండవ రోజైన బుధవారం వైశాఖశుద్ధ దశమి. ఇదే అసలు అలనాటి ముహూర్తదినమని పురాణాలు ఘోషిస్తున్నాయి. కనుక ఈ మూడు రోజుల పద్మావతీ పరిణయోత్సవంలో రెండవ రోజు ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది.

బుధవారం సాయంత్రం శ్రీ స్వామివారు అశ్వవాహనాన్ని అధిరోహించి సకల సార్వభౌమాధికార లాంఛనాలతో బయలుదేరి, వెంట స్వర్ణ పల్లకిలో శ్రీదేవి మరియు భూదేవి అనుసరించగా నారాయణగిరి ఉద్యానవనానికి చేరుకున్నారు. మొదటిరోజు మాదిరే శ్రీస్వామివారికి అమ్మవార్లకు ఎదుర్కోలు, పూలబంతులాట, నూతన వస్త్రధారణ తదితర కార్యక్రమాలు పూర్తయిన తరువాత కొలువు జరిగింది. ఈ కొలువులో హరికథ, పురాణం, ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించారు. ఆ తరువాత శ్రీవారు దేవేరులతో పల్లకినెక్కి తిరువీధులగుండా ఊరేగుతూ ఆలయ ప్రవేశం చేశారు.

ఈ ఉత్సవం కారణంగా శ్రీవారి ఆలయంలో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.

ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి దంప‌తులు, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ రమేష్ బాబు, ఇత‌ర అధికారులు, పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.