PADMAVATHI PARINAYOTSAVAM HELD WITH RELIGIOUS FERVOUR _ అష్టలక్ష్మీ మండపంలో వేడుకగా శ్రీ పద్మావతీ పరిణయోత్సవాలు ప్రారంభం

TIRUMALA, 10 MAY 2022: The annual three day Padmavathi Srinivasa Parinayotsavam was held with religious fervour on Tuesday evening at Narayanagiri Gardens in Tirumala.

Sri Malayappa Swamy was brought to the Parinayotsava Mandiram on a small Gaja Vahanam from Vahana Mandapam while both Sridevi and Bhudevi arrived to the finely decked Mandapam on separate Pallakis from temple.

Later Edurkolu, Varanamayiram, Bantata were performed in a traditional way with a set of officials and religious staffs taking the side of Swamy and another on the side of both the Goddesses, facing opposite to each other.

After these rituals, all the three deities were seated on specially decorated swing. Later Chaturveda Parayanam, followed by Vasanta, Kalyani, Bhopala, Ananda Bhairavi, Gandhari, Madhyamavati, Neelambari Ragaas and different Tala Vaidyams were rendered on the auspicious occasion of the celestial marriage of the deities.

Smt Bullemma and team of Annamacharya Project rendered Sankeertans in a befitting manner.

The devotees who gathered to witness the entire event cherished every moment with spiritual ecstasy.

EO (FAC) Sri AV Dharma Reddy, SE 2 Sri Jagadeeshwar Reddy, DyEO Sri Ramesh Kumar, VGO Sri Bali Reddy and other officials were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD TIRUPATI

అష్టలక్ష్మీ మండపంలో వేడుకగా శ్రీ పద్మావతీ పరిణయోత్సవాలు ప్రారంభం

తిరుమల, 2022 మే 10: తిరుమల నారాయణగిరి ఉద్యానవనాల్లో భూలోక వైకుంఠాన్ని తలపించే రీతిలో స్వర్ణకాంతులు విరజిమ్మేలా ఏర్పాటు చేసిన అష్టలక్ష్మీ, ద‌శావ‌తార మండపంలో మంగళవారం శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి దంపతులు పాల్గొన్నారు.

శ్రీ పద్మావతి పరిణయోత్సవాల్లో మొదటిరోజు అంటే వైశాఖశుద్ధ నవమిరోజైన మంగళవారంనాడు శ్రీమలయప్ప స్వామివారు గజవాహనాన్ని అధిరోహించగా, ఉభయనాంచారులు పల్లకిపై పరిణయోత్సవ మండపానికి సాయంత్రం 5.30 గంటలకు వేంచేపు చేశారు. శోభాయమానంగా తీర్చిదిద్దిన పెండ్లిమండపంలో నిత్య నూతన వధూవరులైన శ్రీస్వామివారికి, అమ్మవార్లకు ఎదుర్కోలు, పూలదండలు మార్చుకోవటం, పూలబంతులాట, నూతన వస్త్ర సమర్పణ కోలాహలంగా జరిగాయి. ఆ తరువాత శ్రీస్వామివారికి కొలువు (ఆస్థానం) జరిగింది. ఈ కొలువులో సర్వజగత్ప్రభువైన శ్రీవేంకటేశ్వరస్వామి వారికి వేదాలు, పురాణాలు, సంగీతరాగాలు, కవితలు, నృత్యాలు నివేదించారు.

ఈ క్రతువుల అనంతరం చతుర్వేద పారాయణం,
వసంత, కళ్యాణి, భూపాల, ఆనంద భైరవి, గాంధారి, మధ్యమావతి, నీలాంబరి రాగాలు, వివిధ తాళాల వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది.

ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారిణి శ్రీమతి బుల్లెమ్మ బృందం ఆలపించిన సంకీర్తనలు భక్తులను ఆకట్టుకున్నాయి.

ఆ తరువాత శ్రీదేవి భూదేవి సహితుడైన స్వామి బంగారుతిరుచ్చిపై అశేష భక్తజనం మధ్య ఊరేగుతూ ఆలయ ప్రవేశం చేయడంతో తొలిరోజు వివాహ వేడుక ఘనంగా ముగిసింది.

ప్రత్యేక ఆకర్షణగా అష్టలక్ష్మీ మండపం :

శ్రీ పద్మావతి పరిణయ మండపాన్ని ఆపిల్‌, నారింజ, ద్రాక్ష, మొక్కజొన్న కంకులు, అనాస పండ్ల, అరటి, మామిడి కొమ్మలతో అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. మండపం అలంకరణకు బంతి, చామంతి, వట్టివేరు, వాడామల్లి, నాలుగు రంగుల రోజాలు, ఆర్కుట్‌, కార్నస్‌ తదితర పుష్పాలను వినియోగించారు. మొత్తం 4 టన్నుల ఫలాలు, 3 టన్నుల‌ సంప్రదాయ పుష్పాలు, 30 వేల కట్‌ ఫ్లవర్లు ఉపయోగించారు. మధ్యమధ్యలో క్రిస్టల్‌ బాల్స్‌, షాండ్లియర్లు వేలాడదీశారు. కాగా ఈ మండప అలంకరణకు పుణెకి చెందిన శ్రీ వేంక‌టేశ్వ‌ర ఛారిట‌బుల్ ట్ర‌స్టు టీటీడీకి విరాళం అందించింది. 15 రోజులుగా 15 మంది చెన్నైకి చెందిన నిపుణులు గార్డెన్ డెప్యూటీ డైరెక్ట‌ర్ శ్రీ శ్రీ‌నివాసులు ఆధ్వ‌ర్యంలో ఈ ప్రాంగణాన్నిఅత్యంత మనోహరంగా అలంకరించారు.

ఈ కార్యక్రమంలో ఎస్ ఇ -2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ ర‌మేష్‌బాబు, విజివో శ్రీ బాలిరెడ్డి, ఇతర అధికారులు, విశేష సంఖ్య‌లో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.